నా ముందు నువ్వో బచ్చా 20 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ…

విరాట్ కోహ్లీ మైదానంలో ఉంటే ఎంత దూకుడుగా కనిపిస్తాడో అందరికీ తెలుసు.. తాను ఆడేది అంతర్జాతీయ మ్యాచ్ అయినా, రంజీ మ్యాచ్ అయినా, ఐపీఎల్ అయినా ఈ దూకుడులో మాత్రం తేడా ఉండదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 21, 2025 | 08:30 PMLast Updated on: Apr 21, 2025 | 8:30 PM

You Are In Front Of Me You Have Been In The Industry For 20 Years

విరాట్ కోహ్లీ మైదానంలో ఉంటే ఎంత దూకుడుగా కనిపిస్తాడో అందరికీ తెలుసు.. తాను ఆడేది అంతర్జాతీయ మ్యాచ్ అయినా, రంజీ మ్యాచ్ అయినా, ఐపీఎల్ అయినా ఈ దూకుడులో మాత్రం తేడా ఉండదు. ప్రస్తుత ఐపీఎల్ 18వ సీజన్ లోనూ కింగ్ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. హోంగ్రౌండ్ , బయటి గ్రౌండ్ అనే తేడా లేకుండా ప్రత్యర్థి జట్లను వణికిస్తున్నాడు. ఇటీవల సొంతగడ్డపై పంజాబ్ చేతిలో ఓటమికి ఆర్సీబీ రివేంజ్ తీర్చుకోవడంలో కోహ్లీనే కీలకపాత్ర పోషించాడు.. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి ఫీల్డింగ్, బ్యాటింగ్‌లో తన సత్తా ఏంటో చూపించాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు హర్‌ప్రీత్ బ్రార్‌తో పంజాబీలో మాట్లాడి హీట్ పెంచేశాడు.

లెగ్ స్పిన్‌లో ఎక్కువగా వికెట్ పోగొట్టుకునే విరాట్ కోహ్లి.. నిన్న పంజాబ్‌పై చాలా జాగ్రత్తగా ఆడాడు. చాహల్, హర్‌ప్రీత్ బ్రార్ స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొని మరీ పరుగులు తీశాడు. ఇరవై ఏళ్లు అయిపోయాయి. నేను ఇలా అవుటవ్వను. మీ కోచ్ కూడా నాకు తెలుసు అంటూ పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్‌ప్రీత్ బ్రార్‌తో కోహ్లి పంజాబీలో మాట్లాడాడు. కోహ్లి సీరియస్ లుక్‌లో చెప్తుండటంతో హర్‌ప్రీత్ ఏం మాట్లాడలేక నవ్వుతూ వెళ్లిపోయాడు. దాంతో విరాట్ కోహ్లి క్రికెట్‌లో అడుగుపెట్టి ఇరవై ఏళ్ల అయింది.. నేను ఇలా అవుటవ్వను అంటూ ఇన్‌డైరెక్ట్‌గా తన రేంజ్ ఏంటో చెప్పాడు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విరాట్ కోహ్లి ఫ్యాన్స్ ఈ వీడియో పోస్ట్ చేస్తూ వింటేజ్ కోహ్లి ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిచి విరాట్ కోహ్లి తన పంతం నెగ్గించుకున్నాడు. బెంగళూరులో పంజాబ్ కింగ్స్ గెలిచిన తర్వాత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ యాటిట్యూడ్ చూపించగా.. ఈ మ్యాచ్‌లో గెలిచి విరాట్ కోహ్లి సేమ్ యాటిట్యూడ్‌తో గ్రౌండ్‌లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. కాగా పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఛేజింగ్ లో కోహ్లీ, పడిక్కల్ మ్యాచ్ ను వన్ సైడ్ గా మార్చేశారు. పడిక్కల్ 35 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 61 పరుగులు చేయగా, విరాట్ కోహ్లి 54 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో నాటౌట్‌గా 73 పరుగులతో మ్యాచ్ విన్నర్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.