ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నాకెందుకు ? ఆ ఇద్దరికే అర్హత ఉందన్న ధోనీ

ఐదు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్ 2025లో వరుస పరాజయాలకు బ్రేక్ వేసింది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో గెలిచి ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఓడిన సీఎస్కే..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 15, 2025 | 08:05 PMLast Updated on: Apr 15, 2025 | 8:05 PM

Why Am I The Player Of The Match Both Of Them Deserve It Says Dhoni

ఐదు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్ 2025లో వరుస పరాజయాలకు బ్రేక్ వేసింది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో గెలిచి ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఓడిన సీఎస్కే.. ఎట్టకేలకు మరో విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫస్టు బౌలింగ్ చేసి లక్నోను కట్టడి చేసింది సీఎస్కే. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ.. మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్‌తో ఈ ఎడిషన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్‌తో, కీపింగ్‌తో ఆకట్టుకున్న ధోని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ధోని 11 బంతుల్లో 26 పరుగులు చేయడం ద్వారా మ్యాచ్ ను ముగించాడు. ఇదిలా.. ఉండగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ విషయంలో ఓ ప్రశ్న తలెత్తుతోంది.

నిజానికి ధోని కాకుండా మరో ఇద్దరు ఆటగాళ్లు కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రేసులో ఉన్నారు. వీరిలో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్, సీఎస్కే ఆటగాడు శివం దూబే ఉన్నారు. సాధారణంగా గెలిచిన జట్టు నుంచి మాత్రమే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ను ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో రిషబ్ పంత్ జట్టు ఓడిపోవడంతో పంత్ ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపిక చేయలేదని చెప్పవచ్చు. కానీ ఇక్కడ శివం దూబేకి అన్యాయం జరిగిందని పలువురు భావిస్తున్నారు. శివం దూబే బ్యాటింగ్ కు వచ్చినప్పుడు రవీంద్ర జడేజా, విజయ్ శంకర్ వికెట్లు ముందుగానే పడిపోయాయి. సీఎస్కే కు క్లిష్ట పరిస్థితిలో శివం దూబే ఓపికగా బ్యాటింగ్ చేసి కెప్టెన్ ధోనికి మంచి సపోర్టును అందించాడు. జట్టు తరపున ఎంఎస్ ధోని 11 బంతుల్లో 26 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీనితో పాటు ఎంఎస్ ధోని వికెట్ కీపింగ్ లో కొన్ని క్యాచ్‌లు పట్టుకున్నాడు. అద్భుతమైన స్టంపింగ్‌లతో పాటు రనౌట్ లు కూడా చేశాడు. బహుశా అందుకే ఎంఎస్ ధోనిని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత తనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తున్నప్పుడు ధోనీ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ అవార్డ్ తనకు ఎందుకు ఇస్తున్నారని, నూర్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని, ఇది అతనికి దక్కాల్సిందని పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌ కార్యక్రమంలో అభిప్రాయపడ్డాడు. హోస్ట్ మురళీ కార్తీక్.. 18వ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ గెలవడం ఎలా అనిపిస్తుందని ప్రశ్నించగా.. ధోనీ భిన్నంగా స్పందించాడు. నూర్ అహ్మద్, రవీంద్ర జడేజా మెరుగైన ప్రదర్శన చేశారన్నాడు. ఈ ఇద్దరూ మిడిల్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశారని ధోనీ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన నూర్ అహ్మద్ ఒక్క వికెట్ తీయకపోయినా 13 పరుగులే ఇచ్చాడు. మరోవైపు జడేజా మూడు ఓవర్లలో 24 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.