SSMB29 కొంపముంచేలా ఉన్నారే… ఎన్టీఆర్, ప్రభాస్ తో టెన్షన్..

సూపర్ స్టార్ మహేశ్ బాబు 29 వ మూవీ కి చిన్న బ్రేక్ ఇచ్చిన రాజమౌళి జపాన్ లో బిజీ అయ్యాడు. సూపర్ స్టార్ మహేశ్ కూడా ఫ్యామిలీతో వెకేషన్ లో ఉన్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 15, 2025 | 08:30 PMLast Updated on: Apr 15, 2025 | 8:30 PM

Ssmb29 Is Going To Be A Hit Tension Between Ntr And Prabhas

సూపర్ స్టార్ మహేశ్ బాబు 29 వ మూవీ కి చిన్న బ్రేక్ ఇచ్చిన రాజమౌళి జపాన్ లో బిజీ అయ్యాడు. సూపర్ స్టార్ మహేశ్ కూడా ఫ్యామిలీతో వెకేషన్ లో ఉన్నాడు. ఐతే డ్రాగన్ మూవీ తో పాటు స్పిరిట్ సినిమా గురించి రాజమౌళి పేల్చిన బాంబు, నిజంగా ఎస్ ఎస్ ఎంబీ కొంపముంచే అవకాశాలే ఎక్కువున్నాయి. అసలే పాన్ ఇండియా కు రోడ్డేసిన మార్గ దర్శకుడిగా రాజమౌళికి ఓ చరిత్ర క్రియేట్ అయ్యింది. ఇప్పుడు పాన్ వరల్డ్ మార్కెట్ కి కూడా తాను ఇలానే రోడ్డేస్తున్నాడన్నారు. కాని మధ్యలోకి రెబల్ స్టార్ తో సందీప్ రెడ్డి తీయబోతున్న స్పిరిట్ మూవీ వచ్చేస్తోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న డ్రాగన్ కూడా సీన్ లోకి వస్తోంది. ఈ రెండు సినిమాలు ఎస్ ఎస్ ఎమ్ బీ 29వ మూవీ బెండు తీసేలా ఉన్నాయి.. ఆ విషయంలో రాజమౌళి స్టేట్ మెంట్ కూడా నిజంగా మహేశ్ ఫ్యాన్స్ ని కంగారు పెట్టించేలా ఉంది.. అదెంటోచూసేయండి.

సూపర్ స్టార్ మహేశ్ బాబు 29 వ మూవీ షూటింగ్ కి చిన్న బ్రేక్ ఇచ్చింది ఫిల్మ్ టీం. ఆల్రెడీ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన ఫ్యామిలీతో విదేశాల్లో సమ్మర్ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. రాజమౌళి మాత్రం తన డాక్యుమెంటరీని ప్రమోట్ చేసేందుకు టోక్యో చేరుకున్నాడు. అదయ్యాకే తను ఇండియాకొచ్చి ఈనెల 21న ఎస్ ఎస్ ఎంబీ 29 వ మూవీ ప్రెస్ మీట్ కి అటెండ్ కాబోతున్నాడు.అసలు తను ఎస్ ఎస్ ఎమ్ బీ 29 వ మూవీ తాలూకు టైటిల్, పోస్టర్, స్టార్ కాస్ట్ ఇలా ఏమేమి అంశాలు ఎనౌన్స్ చేస్తాడా అని మహేశ్ ఫ్యాన్స్ వెయిటింగ్. కాని తను మాత్రం స్పిరిట్, డ్రాగన్ మూవీల కోసం ఓ సాధారణ ప్రేక్షకుడిగా వేయిట్ చేస్తున్నా అన్నాడు.

అంత వరకు ఓకే కాని, ఆ రెండు సినిమాలతోనే అసలుకే ఎసరొచ్చేలా ఉంది. ఒకటి రాజమౌళితో సమానంగా పాన్ ఇండియాని షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ తో డ్రాగన్ తీస్తున్నాడు. ఇది కొరియా, జపాన్, ఇండోనేషియా, మలేషియా మార్కెట్ ని టార్గెట్ చేసింది. చైనా లక్ష్యంగా కూడా ఈ సినిమా రాబోతోంది. అంటే పాన్ ఆసియా మూవీగా ఈ సినిమా వచ్చే ఏడాది వస్తే, వసూళ్ల వరద తెస్తే, అది ఖచ్చితంగా రాజమౌళి మూవీకి పెద్ద రికార్డులనే ముందు పెట్టే ఛాన్స్ ఉంది.

ఆ రికార్డులే కాదు, రెబల్ స్టార్ మూవీ స్పిరిట్ రికార్డులు కూడా ఎస్ ఎస్ ఎమ్ బీ 29 మూవీ బ్రేక్ చేయాల్సి ఉంటుంది. ఇంకా షూటింగ్ జరగని, రిలీజ్ కాని సినిమాలకు రికార్డులంటే కాస్త తొందరపడినట్టే.. కాని అక్కడ కాంబినేసన్ అలాంటిది కాబట్టే స్పిరిట్ కూడా పాన్ ఆసియా మార్కెట్ ని కుదిపేసే ఛాన్స్ఉంది. సందీప్ రెడ్డి లాంటి డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా అంటే, అాది ఏమాత్రం బాగున్నా 2 వేల కోట్ల వసూళ్లు లెక్కే కాదు..

సో సూపర్ స్టార్ మహేశ్ బాబు 29 వ మూవీ తో పోలిస్తే, స్పిరిట్, డ్రాగన్ వచ్చే ఏడాదే వచ్చే అవకాశాలున్నాయి. ఎట్ లీస్త్ ఎస్ ఎస్ ఎమ్ బీ 29 కంటే ముందే వచ్చిన వసూళ్ల వరదల్ని, రికార్డులని క్రియేట్ చేసే చాన్స్ ఉంది. సో డెఫినెట్ గా ఆ రికార్డులు రాజమౌళి కొత్త మూవీకి సవాల్లుగా మారే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మహేశ్ మూవీ 55 వేల థియేటర్స్ లో ఒకరోజు ఆఢితేనే 12000 కోట్లొస్తాయంటున్నారు. అదే జరిగితే స్పిరిట్, డ్రాగన్ క్రియేట్ చేసే రికార్డులు రాజమౌళిని భయపెట్టవు… కాని డెఫినెట్ గా ఎస్ ఎస్ ఎం బీ 29 మూవీకి ముందే రిలీజ్ అయ్యే డ్రాగన్, స్పిరిట్ మూవీలు, అవి క్రియేట్ చేయబోయే రికార్డులు డెఫినెట్ గా భయపెట్టే అవకాశాలే ఎక్కువ.