ఐపీఎల్ లో కలకలం ,రాజస్థాన్ పై ఫిక్సింగ్ ఆరోపణలు

ఐపీఎల్ 18వ సీజన్ లో ఫ్రాంచైజీలకూ, లోకల్ క్రికెట్ అసోసియేషన్లకు మధ్య తీవ్ర యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే పిచ్ ల తయారీ విషయంలో కోల్ కత్తా నైట్ రైడర్స్ , కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో సన్ రైజర్స్ కూ ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 22, 2025 | 05:20 PMLast Updated on: Apr 22, 2025 | 5:20 PM

Ipl Chaos Rajasthan Alleges Fixing

ఐపీఎల్ 18వ సీజన్ లో ఫ్రాంచైజీలకూ, లోకల్ క్రికెట్ అసోసియేషన్లకు మధ్య తీవ్ర యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే పిచ్ ల తయారీ విషయంలో కోల్ కత్తా నైట్ రైడర్స్ , కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో సన్ రైజర్స్ కూ ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. తాజాగా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ స్థానిక క్రికెట్ అసోసియేషన్ ను పట్టించుకోకపోవడంతో ఏకంగా ఫిక్సింగ్ ఆరోపణలు దారితీసింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫిక్సింగ్‌కు పాల్పడిందంటూ రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అడ్‌హక్ కమిటీ కన్వీనర్, బీజేపీ ఎమ్మెల్యే జైదీప్ బిహానీ ఆరోపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవడంపై జైదీప్ సందేహాలు వ్యక్తం చేశారు. ఈ సీజన్ లో లక్నో చేతిలో రాజస్థాన్ కావాలనే ఓడిందనేలా ఆయన కామెంట్లు ఉన్నాయి.

రాజస్థాన్ మ్యాచ్ పై జైదీప్ బిహానీ ఫిక్సింగ్ ఆరోపణలు చేశారని న్యూస్ 18 రాజస్థాన్ ఛానెల్ వెల్లడించింది. పిల్లలు చూసినా ఈ మ్యాచ్ లో ఏం జరిగిందో అర్థమవుతుందని, లాస్ట్ ఓవర్లో అంత తక్కువ పరుగులు ఎందుకు చేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు. ఇది కచ్చితంగా మ్యాచ్ ఫిక్సింగ్ అని జైదీప్ చెప్పారని న్యూస్ 18 పేర్కొంది. హోమ్ గ్రౌండ్‌లో విజయం ఖాయమనుకున్న దశలో ఎలా ఓడిపోయిందంటూ ప్రశ్నించారు. రాజస్థాన్ రాయల్స్ జట్టుపై విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్.. ఆర్‌సీఏకు విలువ ఇవ్వడం లేదని, పూర్తిగా పక్కనపెట్టిందని ఆరోపించారు.

ఏప్రిల్ 19న లక్నో సూపర్ జెయింట్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడింది. 18 బంతుల్లో 25 పరుగులు కావాల్సి ఉండగా.. చేతిలో ఎనిమిది వికెట్లతో ఉన్న రాజస్థాన్ ఈజీగా గెలుస్తుందనిపించింది. కానీ ఆ తర్వాత అంతా రివర్సైంది. లాస్ట్ ఓవర్లో హెట్ మయర్, ధ్రువ్ జురెల్ లాంటి బ్యాటర్లున్నా ఆ టీమ్ 9 పరుగులు కూడా చేయలేకపోయింది. హెట్ మయర్ ను ఔట్ చేసిన అవేశ్ ఖాన్ 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో రెండు పరుగుల తేడాతో రాజస్థాన్ పరాజయం పాలవడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఇదే మ్యాచ్ పై ప్రస్తుతం జైదీప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. గతంలో ఫిక్సింగ్ ఉదంతం నేపథ్యంలోనే గతంలో రాజస్థాన్ రాయల్స్‌పై రెండేళ్ల నిషేధం విధించారు.