సంపూర్ణేష్ బాబుకు ఏమైంది..? హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా..? సినిమాలెందుకు చేయట్లేదు..?
ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు హీరో అవుతారో చెప్పడం కష్టం..? ఇక్కడ డెస్టినీ ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. అలా అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చిన నటుడు సంపూర్ణేష్ బాబు.

ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు హీరో అవుతారో చెప్పడం కష్టం..? ఇక్కడ డెస్టినీ ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. అలా అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చిన నటుడు సంపూర్ణేష్ బాబు. మొదట్లో ఈయన్ని చూసి అసలు ఇతడేం హీరో.. ఇలాంటి వాళ్లు కూడా హీరోలు అవుతారా అంటూ వెక్కిరించారు. కానీ తన పని తాను చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు సంపూర్ణేష్ బాబు. హృదయ కాలేయంతో హీరోగా పరిచయమైన సంపూ.. ఆ తర్వాత వరసగా సినిమాలు చేసాడు. ఒకే ఏడాది మూడు నాలుగు సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. అయితే కరోనా తర్వాత ఎందుకో గానీ లాంగ్ గ్యాప్ తీసుకుంటున్నాడు. కొన్నేళ్లుగా ఈయన నటించిన సినిమాలేవీ విడుదల కావట్లేదు.. చేసిన సినిమాలేమో అనుకోని కారణాలతో ఆగిపోతున్నాయి.
అలా తెలియకుండానే చాలా గ్యాప్ వచ్చేసింది. చాలా రోజుల తర్వాత సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా సోదరా. మన్మోహన్ మేనంపల్లి ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాలో సంజోష్ అనే మరో హీరో కూడా నటిస్తున్నాడు. సోదరా సినిమా ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు మేకర్స్. సంపూర్ణేష్ బాబు కూడా చాలా రోజుల తర్వాత వరస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన పర్సనల్ విషయాలు కూడా పంచుకున్నాడు సంపూర్ణేష్ బాబు. సినిమాల్లో గ్యాప్ రావడం, తన ఆర్థిక పరిస్థితులపై ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. హీరోగా 11 ఏళ్లు పూర్తి చేయడం తనకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని.. అసలు తను హీరోగా నటిస్తానని కలలో కూడా ఊహించలేదు అని చెప్పుకొచ్చాడు సంపూ. ఈ ప్రయాణం తనకు చాలా ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని కూడా ఇస్తుందని చెప్పుకొచ్చాడీయన. సినిమాల కారణంగా తనకు ఒక్కసారిగా క్రేజ్ వచ్చేసిందని.. అయితే ఆ క్రేజ్ ఎంజాయ్ చేయలేకపోయానని అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుందన్నాడు ఈ హీరో.
ఇప్పటికీ తన భార్య ఉమారాణి మిషన్ కుడుతుందని.. ఊళ్లో సింపుల్‌గా జీవితం గడుపుతుందని చెప్పాడు సంపూర్ణేష్ బాబు. తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని.. అందులో ఒకరు బీటెక్ .. మరొకరు ఇంటర్మీడియెట్ చదువుతున్నారని చెప్పాడు. తాను నటుడి అయినప్పటికీ వాళ్లు మాత్రం ఊళ్లో ఉండే నరసింహాచారి పిల్లలుగానే ఉంటారని.. ఎలాంటి హంగులకు పోరు అంటూ గుర్తు చేసుకున్నాడు సంపూ. సాధ్యమైనంత వరకూ తన పేరును బయటికి రానీయరని.. తన మాదిరే బస్సులలో, ఆటోలలో తిరుగుతూ ఉంటారన్నాడు ఈయన. నిజం చెప్పాలంటే వాళ్లు అలా ఉండటమే తనకు కూడా నచ్చుతుందంటున్నాడు సంపూ. తాను ఈ మధ్య పెద్దగా సినిమాల్లో నటించట్లేదని.. బయట కూడా పెద్దగా కనిపించట్లేదని చెప్పాడు. అయితే తనకు అనారోగ్యంగా ఉందని.. హెల్త్ చెడిపోయింది కాబట్టే సినిమాలు చేయట్లేదంటూ రూమర్స్ బయట వినిపిస్తున్నాయని.. అందులో నిజం లేదన్నాడు సంపూర్ణేష్ బాబు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు సంపూ. తాను సినిమాలు చేశాను గానీ అనుకున్న సమయానికి అవి రిలీజ్ కాకపోవడంతో అలా అనిపించి ఉంటుందన్నాడు సంపూర్ణేష్ బాబు.