బ్రేకింగ్: టీచర్‌ను చెప్పుతో కొట్టిన స్టూడెంట్
విజయనగరం రఘు ఇంజనీరింగ్ కాలేజీలో అమానుష ఘటన జరిగింది. తన ఫోన్ తీసుకుని ఇవ్వలేదనే కారణంతో టీచర్‌ను ఓ స్టూడెంట్ చెప్పుతో కొట్టింది.

విజయనగరం రఘు ఇంజనీరింగ్ కాలేజీలో అమానుష ఘటన జరిగింది. తన ఫోన్ తీసుకుని ఇవ్వలేదనే కారణంతో టీచర్‌ను ఓ స్టూడెంట్ చెప్పుతో కొట్టింది. ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ రెచ్చిపోయింది. రఘు ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. క్లాస్ రూమ్‌లోకి ఫోన్ అనుమతి లేదని చెప్పినా ఓ విద్యార్థిని తన ఫోన్ తెచ్చుకుంది.
అది చూసిన టీచర్ వెంటనే అమ్మాయి ఫోన్ తీసుకుంది. క్లాస్ ముగిశాక ఫోన్ ఇవ్వకపోవడంతో టీచర్‌తో విద్యార్థిని వాగ్వాదానికి దిగింది. తన ఫోన్ 12 వేలని ఆ డబ్బు నువ్వు ఇస్తావా అంటూ టీచర్ మీదికి రెచ్చిపోయింది విద్యార్థిని ఇద్దరి మధ్యా మాటా మాటా పెరగడంతో టీచర్‌ను బూతులు తిడుతూ ఆమెపై దాడి చేసింది ఆ అమ్మాయి. చెప్పుతో కొడుతూ రెచ్చిపోయింది. దీంతో తోటి విద్యార్థులు వాళ్లను ఆపే ప్రయత్నం చేశారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.