ఆ స్టార్ హీరో డ్రగ్స్‌కు బానిస.. తన ముందే బట్టలు మార్చుకోమనేవాడు.. హీరోయిన్ సంచలనం..!
సౌత్ ఇండస్ట్రీలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండేది మలయాళ ఇండస్ట్రీ. అక్కడ నటీనటులు, దర్శక నిర్మాతలు చేసే కామెంట్స్ ఎప్పుడూ హాట్ టాపిక్కే.

సౌత్ ఇండస్ట్రీలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండేది మలయాళ ఇండస్ట్రీ. అక్కడ నటీనటులు, దర్శక నిర్మాతలు చేసే కామెంట్స్ ఎప్పుడూ హాట్ టాపిక్కే. ముఖ్యంగా అప్పుడప్పుడూ సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ అంతా తమ వైపు చూసేలా చేస్తుంటారు కొందరు హీరోయిన్లు. తాజాగా మరో హీరోయిన్ కూడా అలాంటి కామెంట్స్ చేసింది. ఏకంగా ఓ స్టార్ హీరోను డ్రగ్స్‌కు బానిస అంటూ కామెంట్ చేసింది హీరోయిన్ విన్సీ సోనీ అలోషియస్. ఈమె పేరు తెలుగులో అస్సలు పరిచయం లేదు.. కానీ కేరళలో మాత్రం అమ్మడు మంచి సినిమాలే చేసింది. అక్కడ గుర్తింపు కూడా బాగానే ఉంది. తాజాగా ఈమె చేసిన ఓ కామెంట్ మలయాళ ఇండస్ట్రీని మరింత స్లంప్‌లోకి దింపేలా కనిపిస్తుంది. ఒక సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ స్టార్ హీరో తనను చాలా దారుణంగా ట్రీట్ చేసాడని.. టార్చర్ చేసాడని చెప్పుకొచ్చింది సోనీ.
డ్రగ్స్‌కు బానిసగా ఉన్న ఆ నటుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని.. షూటింగ్ సమయంలో కూడా ఆయన డ్రగ్స్ తీసుకునేవాడంటూ సెన్సేషనల్ కమెంట్స్ చేసింది సోనీ అలోషియస్. తను షూటింగ్ చేస్తున్న సమయంలో.. సదరు స్టార్ హీరో తన ముందు దుస్తులు మార్చుకోమని ఒత్తిడి చేసేవాడని.. అది సరిపోలేదన్నట్లు ఈ విషయాన్ని అందరి ముందే మాట్లాడేవాడంటూ చెప్పుకొచ్చింది ఈమె. తన జీవితంలో ఒక అసహ్యమైన సంఘటనగా అది నిలిచిపోయింది అంటూ గుర్తు చేసుకుంది సోనీ. ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యేంతవరకు తను టార్చర్ చూపించాడని.. రోజూ మానసికంగా ఇబ్బంది పెడుతూ, తన డ్రగ్స్ అలవాటుతో తనను కూడా ఇరకాటంలోకి నెట్టేసాడని చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్. ఈ అనుభవం తర్వాతే డ్రగ్స్‌కు బానిసలైన నటులతో కలిసి నటించకూడదని తాను నిర్ణయించుకున్నానని చెప్పిందామే.
ఇలాంటి విషయాలు బహిరంగంగా చెప్పడం వల్ల తన కెరీర్ నాశనం అవుతుందని తెలుసు.. అవకాశాలు కూడా తగ్గొచ్చు.. కానీ తాను ఎదుర్కొన్న ఈ బాధను పంచుకోవాలనిపించింది అంటూ తెలిపింది విన్సీ సోనీ. ఇది ఒక సామాజిక బాధ్యతగా తాను భావిస్తున్నట్లు చెప్పిందామే. నిజం చెప్పక తప్పదు.. దాన్ని ఆపలేం కదా.. తను చెప్పిన నిజం కొందరికైనా హెల్ప్ అవుతుందనే ఆశిస్తున్నానని చెప్పింది విన్సీ. తనతో అలా ప్రవర్తించిన హీరో ఎవరన్నది ఇండస్ట్రీలో అందరికీ తెలుసంటూ మరో సంచలనం కూడా రేపింది విన్సీ. కానీ ఆయన రేంజ్ చూసి ఎవరూ బయటికి మాట్లాడే ధైర్యం చేయరంటూ చెప్పుకొచ్చింది ఈమె. విన్సీ చేసిన ఆరోపణలతో మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళా భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. ఎందుకంటే ఆ మధ్య ఓ హీరోయిన్‌ను కారులో ఊరంతా తిప్పుతూ ఓ హీరో బలాత్కారం చేసాడు. అప్పట్లో అది సంచలనంగా మారింది. ఇప్పుడు విన్సీ చేసిన కామెంట్స్ మరింత తీవ్రంగా ఉన్నాయి. మరి దీనిపై కేరళ ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుందో చూడాలిక.