Game Changer : రామ్ చరణ్ మామూలుగా లేడుగా

ఆర్ఆర్ఆర్ (RRR) వంటి గ్లోబల్ హిట్ (Global Hit) తర్వాత.. ప్రస్తుతం రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా ‘గేమ్ చేంజర్’. శంకర్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. అయితే.. ఈ సినిమా షూటింగ్ ఎలా అయితే డిలే అవుతుందో.. లీకులు కూడా అలాగే జరుగుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 7, 2024 | 11:30 AMLast Updated on: May 07, 2024 | 11:30 AM

Ram Charan Is Not Usual

 

 

ఆర్ఆర్ఆర్ (RRR) వంటి గ్లోబల్ హిట్ (Global Hit) తర్వాత.. ప్రస్తుతం రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా ‘గేమ్ చేంజర్’. శంకర్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. అయితే.. ఈ సినిమా షూటింగ్ ఎలా అయితే డిలే అవుతుందో.. లీకులు కూడా అలాగే జరుగుతున్నాయి. ఇప్పటికే గేమ్ చేంజర్ నుంచి ఎన్నో లీకులు బయటికి వచ్చాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా అవడంతో.. కొన్ని సీన్లను పబ్లిక్‌లో షూట్ చేస్తున్నారు. దీంతో లీకులను కట్టడి చేయలేకపోతున్నారు మేకర్స్. ఈ సినిమాలో చరణ్ తండ్రి కొడుకుగా డ్యూయెల్ రోల్‌లో నటిస్తున్నాడు. అందుకు సంబంధించిన రెండు లుక్‌లు కూడా ఇప్పటికే లీక్ అయిపోయాయి.

కొడుకు క్యారెక్టర్ కలెక్టర్ కాగా, తండ్రి పాత్ర రాజకీయ నాయకుడిగా ఉంది. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ రాజమండ్రిలో మొదలైంది. కథ ప్రకారం ఇది కీలకమైన షెడ్యూల్‌ అని అంటున్నారు. రామ్‌ చరణ్‌ పై ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ని తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉండగానే.. లేటెస్ట్‌గా లీక్ అయిన 16 సెకన్ల వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

పొలిటికల్ పార్టీ మీటింగ్‌లో భాగంగా.. స్టేజ్ మీద రామ్‌ చరణ్‌, శ్రీకాంత్‌ను అప్యాయంగా ఆలింగనం చేసుకుని, ఆ తర్వాత ప్రజలకు అభివాదం చేస్తున్నట్టుగా లీక్డ్ వీడియోలో ఉంది. ఇందులో రాజకీయ నాయకుడిగా పంచె కట్టులో ఉన్న రామ్ చరణ్ లుక్ అదిరిపోయింది. ఈ సినిమాలో చరణ్‌, శ్రీకాంత్‌ నిన్నటితరం రాజకీయ నాయకులుగా కనిపించనున్నారు. ఇప్పుడు లీక్ అయింది.. అందుకు సంబంధించిన సన్నివేశమే. దీంతో.. ఖచ్చితంగా ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాలో హైలెట్‌గా నిలుస్తుందని అంటున్నారు మెగా ఫ్యాన్స్. కానీ ఇలాంటి లీకుల పై మాత్రం ఫైర్ అవుతున్నారు. మరి చిత్ర యూనిట్ దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి.