PRABHAS: రెబల్ స్టార్ మళ్లీ విరామం కావాలంటున్నాడు
సలార్ రిలీజై 700 కోట్ల పైనే రాబట్టడంతో మంచి జోష్‌లో ఉన్నాడు. అంతా బాగుంది.. ఇక కల్కి పెండింగ్ షూటింగ్‌ని పూర్తి చేస్తాడనుకుంటే, ఇంతలో మళ్ళీ బ్రేక్ అంటున్నాడు ప్రభాస్. ఈసారి నెలరోజులు మాత్రమే విశ్రాంతి అంటున్నారు.
![PRABHAS: రెబల్ స్టార్ మళ్లీ విరామం కావాలంటున్నాడు Prabhas Taking A Long Break From Shootings Due To Health Issues](https://s3.ap-south-1.amazonaws.com/media.dialtelugu.com/wp-content/uploads/2023/12/Salaar-Look.jpg)
Prabhas Salaar is releasing on December 22 and is creating a sensation all over the world.
PRABHAS: ప్రభాస్ మరోసారి చిన్న విరామం తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. కారణం మళ్లీ సర్జరీ అవసరమొచ్చిందని తెలుస్తోంది. ఆల్రెడీ మోకాలి సర్జరీకి యూరప్ వెల్లి అక్కడే శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. తర్వాత నెలరోజులపాటు రెస్ట్ తీసుకున్నాడు. ఇండియాకొచ్చాక కూడా నెల రోజులకుపైనే ఫిజియో థెరపి తీసుకున్నాడు. సలార్ రిలీజై 700 కోట్ల పైనే రాబట్టడంతో మంచి జోష్‌లో ఉన్నాడు.
PRASHANTH NEEL: చేతిలో ఒక సినిమా పెట్టుకుని ఇదేం పని..?
అంతా బాగుంది.. ఇక కల్కి పెండింగ్ షూటింగ్‌ని పూర్తి చేస్తాడనుకుంటే, ఇంతలో మళ్ళీ బ్రేక్ అంటున్నాడు ప్రభాస్. ఈసారి నెలరోజులు మాత్రమే విశ్రాంతి అంటున్నారు. అయితే పాత గాయం తిరగతోడిందని, అందుకే మళ్లీ సర్జరీకోసం యూరప్ బయలు దేరనున్నాడని ప్రచారం పెరిగింది. ఐతే మొన్న జరిగిన సర్జరీ తాలూకు ఫిజియో థెరపీతోపాటు, ఓ మైనర్ సర్జరీ బ్యాలెన్స్ ఉందని, అందుకే ప్రభాస్ యూరప్ వెళుతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఐతే ఈసారి కేవలం వన్ వీక్‌లో మైనర్ సర్జరీ, తర్వత ఫిజియో థెరపి తీసుకున్నాక, మార్చ్ సెకండ్ వీక్ నుంచి షూటింగ్స్‌తో బిజీ అవుతాడట ప్రభాస్.
మార్చ్ సెకండ్ వీక్‌లో కల్కి పెండింగ్ షూటింగ్ పూర్తిచేసి, ఏప్రిల్ మొత్తం ప్రమోషన్ కోసమే ప్రభాస్ కేటాయించటంతో, ఇప్పుడు వెళ్లే యూరప్ ట్రిప్ నిజంగా భారీ సర్జరీ కోసం కాదనే భరోసా ఫ్యాన్స్‌కి దక్కుతోంది.