రాజమౌళికి కెన్యా గవర్నమెంట్ వార్నింగ్.. యాక్షన్ చాలు ఓవరాక్షన్ వద్దు…

రాజమౌళి సినిమా అనగానే జనాల్లో ప్రతి ఒక్కటి ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటారు జనాలు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 4, 2025 | 10:45 AMLast Updated on: Feb 04, 2025 | 10:45 AM

Kenyan Government Warning To Rajamouli

రాజమౌళి సినిమా అనగానే జనాల్లో ప్రతి ఒక్కటి ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటారు జనాలు. ఇక సినిమా పిచ్చోళ్ళకు రాజమౌళి సినిమా అనగానే ఒక రకమైన పండగ. ప్రస్తుతం మహేష్ బాబుతో రాజమౌళి చేస్తున్న సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే జనాల్లో పిచ్చ క్రేజ్ ఉంటుంది. అనుకున్న దాని కంటే ముందుగానే సినిమా మొదలు పెట్టేసిన రాజమౌళి త్వరలోనే ఈ సినిమా గురించి క్రేజీ అప్డేట్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను ఫైనల్ చేశారు. రీసెంట్ గా ప్రియాంక చోప్రా హైదరాబాద్ వచ్చి లుక్ టెస్ట్ కూడా ఇచ్చేసింది. దాదాపు ఆమెకు 30 కోట్లు ఇవ్వడానికి రాజమౌళి రెడీ అయినట్లు సమాచారం. ఇందుకోసం 16 నెలల టైంను రాజమౌళి అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా ది హాలీవుడ్ రేంజ్ కాబట్టి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుండగా త్వరలోనే విజయవాడలో కూడా షూటింగ్ జరిగే ఛాన్స్ ఉంది.

ఇక ఆ తర్వాత సినిమా షూటింగ్ కెన్యాలో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఒక టీం కెన్యా బయలుదేరి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. రాజమౌళి కుమారుడు కార్తికేయ కెన్యా వెళ్లినట్లు టాక్. సినిమా షూటింగ్ స్పాట్స్ కు సంబంధించి అక్కడ ఏర్పాట్లు అలాగే షూటింగ్ లొకేషన్స్ ను.. ఎక్కడెక్కడ ఏ సీన్ ఉండాలి అనేదానిపై కార్తికేయ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కార్తికేయతో పాటుగా మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఒకరు వెళ్లారట. గతంలో మాదిరిగా ఈ సినిమాలో తప్పులు చేయకూడదని రాజమౌళి చాలా పట్టుదలగా వర్క్ చేస్తున్నారు.

త్రిబుల్ ఆర్ సినిమాలో కొన్ని విషయాల్లో చాలా కామెంట్స్ వచ్చాయి. సినిమా హైప్ కారణంగా హిట్ అయింది… గానీ స్టోరీ లేదు అనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. దీనితో ఈ సినిమా విషయంలో స్టోరీ పై రాజమౌళి ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాడు. బాహుబలి పార్ట్ 2 సమయంలో కూడా సినిమాలో స్టోరీ లేదని విమర్శలు వచ్చాయి. దీనితో ఇప్పుడు రాజమౌళి కాస్త జాగ్రత్త పడుతున్నట్లు టాక్. కెన్యాలోని నేషనల్ పార్క్ లో ఈ సినిమా షూటింగ్ జరగనుంది. దీనితో అక్కడి ప్రభుత్వానికి ఇప్పటికే రాజమౌళి టీం అప్లికేషన్ కూడా పెట్టుకుంది. ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి పర్మిషన్ తీసుకోవడానికి రెడీ అయింది. అయితే ఇక్కడ గవర్నమెంట్ రాజమౌళి టీంకు ఒక చిన్న వార్నింగ్ ఇచ్చిందట. నేషనల్ పార్కులో జంతువులను చూసేందుకు చాలా మంది పర్యాటకులు వస్తూ ఉంటారని వాళ్లకు… అలాగే అక్కడ ఉన్న అడవి జంతువులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని.. ఎటువంటి ఇబ్బందులు కలిగిన సరే భారీగా జరిమానా విధిస్తామని జైలు శిక్ష కూడా విధిస్తామని వార్నింగ్ ఇచ్చిందట కెన్యా గవర్నమెంట్. అక్కడున్న జంతువుల ప్రాణాలకు హాని తలపెడితే మాత్రం కచ్చితంగా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కెన్యా ప్రభుత్వం హెచ్చరించింది.