జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్ అప్డేట్స్.. ఏయే షెడ్యూల్స్ ఎక్కడ ప్లాన్ చేస్తున్నారంటే..!
నిన్న మొన్నటి వరకు వార్ 2 సినిమాతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. తాజాగా ప్రశాంత్ నీల్ సినిమా దగ్గరికి వచ్చేసాడు. ఏప్రిల్ 22 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

నిన్న మొన్నటి వరకు వార్ 2 సినిమాతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. తాజాగా ప్రశాంత్ నీల్ సినిమా దగ్గరికి వచ్చేసాడు. ఏప్రిల్ 22 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. దీనికి సంబంధించిన మేజర్ అప్డేట్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. తాజాగా ప్రశాంత్, ఎన్టీఆర్ సముద్రం దగ్గర నిలబడి డిస్కస్ చేసుకున్న ఫోటో ఒకటి బయటికి వచ్చింది. ఈ ఇద్దరు సీరియస్ గా కథ గురించి డిస్కస్ చేస్తున్నారు. ఏప్రిల్ 22 నుంచి నాన్ స్టాప్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు. తారక్ మీద కర్ణాటకలో మొదటి షెడ్యూల్ జరగనుంది. అక్కడ ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా కోసం సన్నగా మారిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. మామూలుగా అయితే తన హీరోలను బాగా లావుగా చూపించే ప్రశాంత్.. ఎన్టీఆర్ ను మాత్రం ఎందుకో మోస్ట్ స్టైలిష్ గా ప్రజెంట్ చేస్తున్నాడు. కర్ణాటకలో భారీ షెడ్యూల్ మే 14 వరకూ కొనసాగుతుంది.
ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ తో పాటు సీనియర్ నటుడు నాజర్, ‘ప్రభాస్’ శీను తదితరులు పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత ఓ ఫారెస్ట్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్. అది కూడా చాలా భారీగా ఉండబోతుంది. అంతేకాదు సినిమాలో చాలా కీలకమైన పార్ట్ అది. దానికోసం మెయిన్ యాక్టర్స్ అందరూ ఈ షూట్ లో పాల్గొంటారు. ఈ షెడ్యూల్ కోసం ఇప్పటికే ఫారెస్ట్ లొకేషన్ల రెక్కీ నిర్వహిస్తున్నారు. జులై వరకూ ‘డ్రాగన్’ కే డేట్స్ ఇచ్చాడు ఎన్టీఆర్. జులై చివరి వారం నుంచి ఆగస్టు 15 వరకూ వార్ 2 ప్రమోషన్లతో బిజీ కానున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హృతిక్ రోషన్ తో కలిసి దేశం మొత్తం ఒక ట్రిప్ వేయబోతున్నాడు జూనియర్. ఇది తనకు కచ్చితంగా బాలీవుడ్ లో సూపర్ మార్కెట్ ఓపెన్ చేస్తుందని నమ్ముతున్నాడు జూనియర్. అందుకే వార్ 2 కోసం చాలా కష్టపడుతున్నాడు. ప్రమోషన్స్ కోసం కూడా దాదాపు 20 రోజులు కేటాయించాడు. అది విడుదలైన వెంటనే మళ్ళీ డ్రాగన్ వైపు రానున్నాడు జూనియర్ ఎన్టీఆర్. కుదిరితే ఈ సినిమా షూటింగ్ 2025 లోనే పూర్తి చేయాలని చూస్తున్నాడు.
అలా చేస్తేనే 2026 ఏప్రిల్ లో సినిమా విడుదలవుతుంది. దానికి తగ్గట్టుగానే షెడ్యూల్స్ అన్ని ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాలో కన్నడ భామ రుక్మిణి వసంత హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా పూర్తయ్యే వరకు మరొక సినిమా ఒప్పుకోకూడదనేది ఆమెకు దర్శక నిర్మాతలు పెట్టిన కండిషన్. దానికి ఒప్పుకొని ఎన్టీఆర్ సినిమా సైన్ చేసింది రుక్మిణి. రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాలు దాదాపు 350 కోట్లతో నిర్మిస్తున్నాయి.