ROCK సాలిడ్ గా వస్తున్నాడు… టైటిల్ ఫిక్స్ …!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 లో హ్రితిక్ తో కలిసి డాన్స్ చేసే సాంగ్ షూటింగ్ పూర్తైంది. 500 డాన్సర్ల మధ్య హ్రితిక్, ఎన్టీఆర్ కలిసి వేసిన తీన్మార్ స్టెప్పులు మతిపోగొట్టాయట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 11, 2025 | 07:50 PMLast Updated on: Mar 11, 2025 | 7:50 PM

Intersting Facts About Ntr New Movies

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 లో హ్రితిక్ తో కలిసి డాన్స్ చేసే సాంగ్ షూటింగ్ పూర్తైంది. 500 డాన్సర్ల మధ్య హ్రితిక్, ఎన్టీఆర్ కలిసి వేసిన తీన్మార్ స్టెప్పులు మతిపోగొట్టాయట. ఏకంగా ఐదున్నర నిమిషాల నిడివి ఉన్న సాంగ్ షూటింగ్ కి దాదాపు 90 కోట్ల ఖర్చయినట్టు తెలుస్తోంది. ఇలాంటి టైంలో సడన్ గా ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్ట్ కన్ఫామ్ అయ్యింది. హాలీవుడ్ మూవీ ఇన్స్ పిరేషన్ లో ఈ సినిమా సెట్స్ పైకెళ్లేలా ఉంది. ఆ మూవీ టైటిల్ కూడా రాక్ అని కన్ఫామ్ చేస్తున్నారు. కోలీవుడ్ లో ఈ టైటిల్ ని నెల్సెన్ దిలీప్ రిజిస్టర్ చేయించటంతో, అది ఎన్టీఆర్ మూవీ టైటిలే అని ప్రచారం మొదలైంది. ఇందులో చాలావరకు నిజం ఉన్నట్టే తెలుస్తోంది. కాకపోతే ఎన్టీఆర్ సినిమా కోసం ప్లాన్ చేసిన టైటిల్స్ కోసమే 100 కోట్లు ఖర్చవ్వటం ఇక్కడ షాకింగ్ న్యూస్… సినిమా టైటిల్స్ కి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు.. కాని ఇక్కడ అదే అత్యవసరం అయ్యింది.. ఎందుకు? అదేంటో కూడా చూసేయండి.

ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్ గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ తో కలిసి చేస్తున్న వార్2 మూవీ షూటింగ్ ని పూర్తి చేశాడు. 500 మంది డాన్సర్లతో కలిసి ఈ ఇద్దరు హీరోలు చేసిన హై ఓల్టేజ్ సాంగ్ షూటింగ్ సండే రోజే పూర్తైంది. ఇక ప్యాచ్ వర్కే మిగిలి ఉంది. దాంతో ఎన్టీఆర్ కి ఎలాంటి సంబంధం లేదు. సో ఇక మీదట ప్రశాంత్ నీల్ తీస్తున్న డ్రాగన్ షూటింగ్ లో తారక్ అడుగుపెట్టేందుకు రూట్ క్లియర్ అయ్యింది. వన్ వీక్ రెస్ట్ తీసుకున్నాక, వచ్చే వారం నుంచి డ్రాగన్ సెట్లో ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందట. ఐతే ఈలోపే తన కొత్త సినిమా టైటిల్ మీద అప్ డేట్ షాక్ ఇస్తోంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ తో జైలర్ మూవీ తీసిన నెల్సన్ దిలీప్, ఎప్పటి నుంచో ఎన్టీఆర్ తో మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఆల్రెడీ రజినీకాంత్ తో జైలర్ 2 ని సెట్స్ పైకీ తీసుకెళ్లిన తను, ఆగస్టు లోగా ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తాడట. అంటే దసరా నుంచి ఎన్టీఆర్ ప్రాజెక్టు పట్టాలెక్కడం ఆల్ మోస్ట్ కన్పామ్ అయ్యింది.ఆ సినిమాకే రాక్ అనే టైటిల్ పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఇలా జరగటానికి డైరెక్టర్ నెల్సన్ దిలీప్ రాక్ అనే టైటిల్ ని కోలీవుడ్ లో రిజిస్టర్ చేయించటమే కారనం. అంతేకాదు ఈ టైటిల్ మరొకరు రిజిస్టర్ చేయించటం వల్లే వాళ్లకి 15 కోట్లు సమర్పించుకుని మరీ ఈ టైటిల్ ని తన పేరు మీద రిజిస్టర్ చేయించాడట.

రజినీకాంత్ తర్వాత నెల్సన్ దిలీప్ సినిమా తీసేది ఎన్టీఆర్ తోనే కాబట్టి, ఇది పక్కగా మ్యాన్ ఆఫ్ మాసెస్ మూవీ టైటిలే అని కన్ఫామ్ చేసుకుంటున్నారు. అంతేకాదు ఇంచు మించు ఇలానే డ్రాగన్ టైటిల్ ని ప్రశాంత్ నీల్ 18 కోట్లు పెట్టి తమిళ హీరో రంగనాథన్ దగ్గర తీసుకున్నాడు. ఫలితంగానే తన రీసెంట్ మూవీ డ్రాగన్ గా కాకుండా రిటర్న్ ఆఫ్ డ్రాగన్ పేరుతో రిలీజ్ అయ్యింది.ఇక హిందీ మూవీ వార్ 2 కంటే ముందే వచ్చిన వార్ సినిమాకు ఇదే సమస్య వచ్చింది. సో వేరే వాళ్లు రిజిస్టర్ చేసుకున్నటైటిల్ కావటంతో,ఆదిత్య చోప్రా ఏకంగా 30 కోట్లు పెట్టి ఆ టైటిల్ రైట్స్ కొనేశాడు. ఇలా చూస్తే డ్రాగన్, రాక్, వార్ 2 , మూవీల టైటిల్స్ కోసంమే దర్శక నిర్మాతలు 70 కోట్ల వరకు ఖర్చు పెట్టారట. దేవర మూవీ కూడా తమిళ నిర్మాత రిజిస్టర్ చేసుకుంటే, ఇలానే 15 కోట్లు సమర్పించి ఆ టైటిల్ సొంతం చేసుకున్నారు.. ఇప్పుడు దేవర 2 కి, వార్ 2 కి వీటికి కూడా ఏడున్నర కోట్ల వరకు నిర్మాతలు చెల్లించుకున్నాకే పూర్తిగా రైట్స్ వీళ్ల వశమయ్యాయని తెలుస్తున్నాయి. మొత్తంగా చేస్తున్నఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీల టైటిల్స్ కోసమే 100 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. విచిత్రం ఏంటంటే ఇదిప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.