లుక్ మారితే లక్కే… 24 కోట్ల నుంచి 2400 కోట్లు…?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 18 ఏళ్ల క్రితం తన లుక్ మార్చుకున్నాడు. మార్చుకోవటం అంటే ఏదో చిన్నా చితకా మార్పుకాదు... మజిల్స్ పెంచటం తగ్గించటం కాదు..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 16, 2025 | 09:30 PMLast Updated on: Apr 16, 2025 | 9:30 PM

If The Look Changes It Will Be Worth It 24 Crores To 2400 Crores

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 18 ఏళ్ల క్రితం తన లుక్ మార్చుకున్నాడు. మార్చుకోవటం అంటే ఏదో చిన్నా చితకా మార్పుకాదు… మజిల్స్ పెంచటం తగ్గించటం కాదు.. పూర్తిగా మరో కొత్త వ్యక్తిగా మారాడు. యమదొంగ వచ్చి 18 ఏళ్లవుతోంది. ఈ సినిమా రాకముందు ఎన్టీఆర్ బొద్దుగా ఉంటే, యమదొంగ లో మాత్రం సన్నబడ్డ తారక్ తన ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు. ఓరకంగా జపాన్ లో తన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఈమూవీ నుంచే మొదలైందనేది అక్కడి ఫ్యాన్స్ నుంచి వచ్చే సమాధానం. అక్కడి మంత్రి కూడా యమదొంగని, అరవింద సమేత వీర రాఘవ టైటిల్స్ ని కూడా తన మాట్లల్లో వాడాడు. అయితే ఇప్పడీ సినిమాలెందుకు ఇప్పుడే ఇంతగా చర్చకు రావటానికి రీజన్, ఎన్టీఆర్ మీద జబ్బు రూమర్లు క్రియేట్ చేస్తున్న బ్యాచ్. మొన్న ఓ యాడ్ లో సన్నబడ్డ తారక్ మీద కామెంట్లు చేశారు. నిన్న కళ్యాణ్ రామ్ మూవీ ఈవెంట్ కి వస్తే, సన్న బడుతున్న తనకి లేని పోని జబ్బులు అంటిస్తున్నారు… ఈవిషయంలో కళ్యాణ్ రామే కాదు, ఈసారి ఫ్యాన్స్ గట్టిగా ఇచ్చిపడేస్తున్నారు. మహేవ్, ప్రభాస్ కంటే కూడా ఎక్కువ యాంటీ ఫ్యాన్స్ ఎటాక్ కి గురౌతోంది తారకే కాబట్టే, కౌంటర్ ఎటాక్ కూడా సాలీడ్ గానే ఉంటోంది..

ఎన్టీఆర్ మొన్న జుట్టు కత్తిరించుకుంటే న్యూసైంది. యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో న్యూసెన్స్ క్రియేట్ చేసింది. రీసెంట్ మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ ఈవెంట్ లో ఎన్టీఆర్ కనిపిస్తే, ఏంటి తారక్ కి ఏమైందన్ని దిక్కుమాలిన డౌట్లన్నీ సోషల్ మీడియాలో పెట్టారు. మీమ్స్ తో పైశాచిక ఆనందం పొందారు.కట్ చేస్తే తారక్ అన్న కళ్యాణ్ రామ్ మూవీ ఈవెంట్ కి వస్తే, ఈ వీడియోలు, ఇమేజ్ లు కూడా టార్గెట్ చేశారు.సన్నబడ్డ ఎన్టీఆర్ కి నిజంగా ఏమైనా అయ్యిందా? ఏదో జబ్బొచ్చే తన ముఖంలో కలలేదని, మరొకటని ఇలా లోలోపల ఆనందపడుతూ, బయటికి జాలిపడే పైశాచికత్వాన్ని ట్రోల్స్ రూపంలో చూపించారు. విచిత్రం ఏంటంటే డ్రాగన్ మూవీ కోసం తను సన్నబడుతున్నాడని ఎప్పుడో తేల్చారు. వార్ 2 మూవీ లో తన పాత్రకోసం మజిల్స్ పెంచి, మీసం తీసేసిన తారక్, డ్రాగన్ కోసం ఎయిట్ ప్యాక్స్ ప్లాన్ చేశాడు.

ఆలుక్ రావాలంటే, ప్రభాసైనా, చెర్రీ, బన్నీ అయినా సన్నబడాల్సిందే… ఆల్రెడీ అరవింద సమేత వీరరాఘవలో ఇలానే సన్నబడ్డాడు తారక్. లేదంటే టెంపర్ లుక్ కి, అరవింద సమేత వీరరాఘవ లుక్ కి అంత డిఫరెన్స్ ఉండేది కాదు. ఒంట్లో సిక్స్ ప్యాక్స్ లేదంటే ఎయిట్ , టెన్ ప్యాక్స్ బయటికి రావాలంటే, ఎవరైనా సన్నబడాల్సిందే..అందుకే డైట్ ని జిమ్ లో వర్కవుట్లని ఫాలో అవుతూ ఆల్ మోస్ట్ 14 కిలోలు తగ్గాడు ఎన్టీఆర్. ఈ విషయం న్యూస్ లో వచ్చి వారాలు గడుస్తోంది. అయినా అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఈవెంట్ కి వచ్చిన తారక్ ని చూసిన తన లుక్ మీద షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు.

ఈ విషయంలో కళ్యాణ్ రామ్ టీమే కాదు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి కూడా కౌంటర్స్ పెరిగాయి. అచ్చంగా ఇలానే యమదొంగ టైంలో ఎన్టీఆర్ సన్నబడితే తన పనైపోయినట్టే అని కామెంట్ చేశారు. కాని యమదొంగ బ్లాక్ బస్టరైంది. 24 కోట్లు రాబట్టింది. 18 ఏళ్ల క్రితం 24 కోట్లు ఆల్ మోస్ట్ వందకోట్ల హిట్ తో సమానం. సో ఒక్క సారి తను సన్నబడితే, యమదొంగ రూపంలో బ్లాక్ బస్టర్ పడింది. తర్వాత టెంపర్ టైంలో కూడా తన లుక్ మారగానే 50 కోట్ల వసూళ్ల వరదొచ్చింది. నాన్నకు ప్రేమతో మూవీలో లుక్ తో షాక్ ఇవ్వగానే, 135 కోట్ల సునామీ వచ్చింది. అరవింద సమేత వీరరాఘవలో సిక్స్ ప్యాక్స్ తో షాక్ ఇస్తే 200 కోట్ల రీసౌండ్ వచ్చింది. త్రిబుల్ ఆర్ లో మజిల్స్ తో కనిపిస్తే, గ్లోబల్ గా తన పేరుమారుమోగింది. సో ఎలా చూసినా తన లుక్ మారిన ప్రతీ సారి బాక్సాపీస్ లో వసూల్లు ఊహాతీతంగా రీసౌండ్ చేశాయి… గ్లోబల్ గా పాపులారిటీకి తన లుక్స్ కారణమయ్యాయి… కాబట్టే వార్ 2, డ్రాగన్ లో తన లుక్ మీక్స్ గట్టిగా ఫోకస్ చేశాడు తారక్. దాన్ని ఓర్వని బ్యాచ్ ఇలా పనికట్టుకుని బురద చల్లే ప్రయత్నం చేస్తోందనే కామెంట్స్ పెరిగాయి.