95% శాతం షూటింగ్.. 700 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్.. ఇప్పడీ కంపు.

రెబల్ స్టార్ తో మారుతి తీస్తున్న, ఆల్ మోస్ట్ 95 శాతం షూటింగ్ పూర్తి చేసిన మూవీ ది రాజా సాబ్. ఇప్పుడిది అటకెక్కింది.. ఆగిపోయింది...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 16, 2025 | 09:00 PMLast Updated on: Apr 16, 2025 | 9:00 PM

95 Shooting 700 Crore Pre Release Business

రెబల్ స్టార్ తో మారుతి తీస్తున్న, ఆల్ మోస్ట్ 95 శాతం షూటింగ్ పూర్తి చేసిన మూవీ ది రాజా సాబ్. ఇప్పుడిది అటకెక్కింది.. ఆగిపోయింది… బడ్జెట్ సమస్యలతో సైడ్ కెళ్లిందని రూమర్లు క్రియేట్ చేస్తున్నారు. దీంతో చాలా కాలంగా సైలెంట్ గా ఉన్న రెబల్ ఫ్యాన్స్ విజ్రుంబించారు.. ఈ సారి కామెంట్లు, రూమర్లు క్రియేట్ చేస్తున్న యాంటీ ఫ్యాన్స్ మీద కాదు.. ఏకంగా ది రాజా సాబ్ ప్రొడక్షన్ హౌజ్ ని టార్గెట్ చేశారు. దర్శకుడు మారుతి మీద కూడా ట్వీట్ల యుద్ధం ప్రకటించారు.. సోషల్ మీడియాలో ఇంతగా ది రాజాసాబ్ మీద డ్యామేజింగ్ ఎటాక్ జరుగుతుంటే, రెస్పాన్స్ లేదనేదే ఫ్యాన్స్ ఫ్రష్ట్రేషన్ కి కారణం. ది ఫౌజీ టీం, స్పిరిట్ టీం ఉన్నంత యాక్టీవ్ గా ది రాజా సాబ్ టీం లేదనేది రెబల్ ఫ్యాన్స్ ప్రధాన ఆరోపన. ఏదో చిన్నగా మొదలైంది అనుకుంటే, ఇప్పుడది చిలికి చిలికి గాలివాన నుంచి తుఫాన్ గా మారింది. యాష్ ట్యాగ్ వార్ గా సోషల్ మీడియాని కుదిపేసేలా ఉంది.

ది రాజా సాబ్ 95 శాతం షూటింగ్ ఎప్పుడోపూర్తైంది. కేవలం క్లైమాక్స్ ప్యాచ్ వర్క్, నాలుగు సాంగ్స్ మాత్రమే పెండింది. అది డిసెంబర్ లో అనుకుంటే, ఫౌజీ షూటింగ్ వల్ల గ్యాప్ వచ్చింది. తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ మోకాలి చికిత్స, తర్వాత రెస్ట్ కారనంతో, ఇంకాస్త బ్రేక్ పడింది. ఇది ఆల్ మోస్ట్ అందరికీ తెలిసిందే..కాని ఈమధ్య ది రాజా సాబ్ షూటింగ్ ఆగిపోవటం కాదు, ప్రాజెక్టే పక్కకెళ్లిపోయిందని ప్రచారం పెరిగింది. బడ్జెట్ సమస్యల వల్లే పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఆగిందని, ఫలితంగా ప్రభాస్ కూడా ఈ ప్రాజెక్టుని పట్టించుకోవట్లేదని, తలా తోక లేకుండా సోషల్ మీడయాలో మీమ్స్ పెడుతున్నారు. కామెంట్లతో శాడిస్టిక్ ఎంజాయ్ చేస్తున్నారనేది ది రాజా సాబ్ టీం కౌంటర్ ఎటాక్.

ఇంత ఖచ్చితంగా ఇలాంటి మాటలు ది రాజా సాబ్ టీం అనటానికి రీజన్, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా ఏడు భాషల్లో ది రాజా సాబ్ మూలకకు పడినట్టే అన్న కామెంట్లు, మీమ్స్ తో కూడిన ట్రోలింగ్ జరుగుతోంది. సరే సౌత్ హీరోల పాన్ ఇండియా డామినేసన్ నచ్చక బాలీవుడ్ యాంటీ బ్యాచ్ ఈ పనిచేస్తోందనుకుంటే, తమిల్, మలయాళంలో కూడా ఇలాంటి రాతలు, కూతలు పెరిగిపోయాయి.
అక్కడే ది రాజా సాబ్ టీం అలర్ట్ అయ్యింది. తెలుగు సినిమా గురించి ఇంతగా పట్టించుకునేలా అక్కడ జనం అంత ఖాలీగా ఉన్నారా అన్నకోణంలో అక్కడ సైబర్ టీం కి కూడా అలర్ట్ చేసింది. కాని ఎక్కడ అఫీషియల్ స్టేట్ మెంట్స్ లేవనంటున్నారు. సో ఇవి తెలియక, ప్రభాస్ మూవీ ఆగిపోయిందన్న కామెంట్లను మారుతి, అలానే ది రాజా సాబ్ ప్రొడక్షన్ టీం పట్టించుకోవట్లేదనే ఫైర్ అవుతున్నారు రెబల్ ఫ్యాన్స్.

బేసిగ్గా టాలీవడ్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మీద ఎక్కువగా యాంటీ ఫ్యాన్స్ నెగెటివిటి ఎక్కువ ఉంటుంది. తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు మీద వ్యతిరేక ప్రచారం ఎక్కువే కనిపిస్తుంది. తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ మీద ఇలాంటి కుళ్లు ఏడుపు సోషల్ మీడియాలో కొంతమంది ఏడవటం కనిపిస్తుంది.. కాని ప్రభాస్ మూవీ ఆగిపోయిందని ఇలా ఏడు భాషల్లో ఏడుస్తున్న బ్యాచ్ పెరిగే సరికే ఫ్యాన్స్ అలర్ట్ అయ్యారు. ఫిల్మ్ టీం పట్టించుకోదా..? ఈ రూమర్లు, లీకులకు కౌంటర్ ఇవ్వాదా అన్న ఫ్రస్ట్రేషన్ సోషల్ మీడియాలో వినిపస్తున్నారు. కాని కేరళ, తమిల్ నాడు, ముంబైలో సైబర్ టీం తో ది రాజా సాబ్ టీం టచ్ లో ఉండటమే కాదు, ఈ యాంటీ ఫ్యాన్స్ ఎటాక్ కి తగ్గ ప్రతిచర్యలు తీసుకుంటోందట. ఫిల్మ్ టీం నుంచి ఈ వీకెండ్ ఖచ్చితంగా ఏదైనా స్టేట్ మెంట్ రావొచ్చని తెలుస్తోంది.