55 వేల థియేటర్స్ లో… ఒక్క రోజు ఆడితే… 12000 కోట్లు…

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ లో పూనకాలొచ్చేటైమైందా..? ఆగస్ట్ 14 వరకు వార్ 2 మూవీ వచ్చే ఛాన్స్ లేదు... అయినా రిలీజ్ కి రెడీ అయిన మూవీతో కాదు... ఇంకా సెట్లో ఉన్నసినిమానే సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 9, 2025 | 07:00 PMLast Updated on: Apr 09, 2025 | 7:00 PM

If It Plays In 55 Thousand Theaters In One Day 12000 Crores

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ లో పూనకాలొచ్చేటైమైందా..? ఆగస్ట్ 14 వరకు వార్ 2 మూవీ వచ్చే ఛాన్స్ లేదు… అయినా రిలీజ్ కి రెడీ అయిన మూవీతో కాదు… ఇంకా సెట్లో ఉన్నసినిమానే సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది. ఎన్టీఆర్ మ్యాజిక్ ప్రశాంత్ నీల్ కి అర్ధమైనట్టుంది. ఈనెల 22న డ్రాగన్ సెట్లోకి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అడుగు పెట్టబోతున్నాడు. కాని ఈలోపే ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు రికార్డులు తన ఎకౌంట్లో పడేలా ఉన్నాయి. యూఎస్ రైట్స్ తో 200 కోట్ల షాక్ ఇస్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. రెమ్యునరేషన్ విషయంలో రెబల్ స్టార్ నే మించేలా కనిపిస్తున్నాడు. 1400 కోట్లు రాబట్టిన కేజీయఫ్2, 800 కోట్లు రాబట్టిన సలార్ రికార్డులు ప్రశాంత్ నీల్ ఎకౌంట్ లో ఉన్నా, తనకే మైండ్ బ్లాక్ అవుతోంది.. ఎన్టీఆర్ వల్ల డ్రాగన్ షూటింగ్ మొదలైన వెంటనే, వందలకోట్ల ప్రీరిలీజ్ డీల్స్ షాక్ ఇస్తున్నాయి.. అవేంటో చూసేయండి.

రాజమౌళి ఇప్పటి వరకు పాన్ ఇండియాని షేక్ చేశాడు. గ్లోబల్ గా త్రిబుల్ ఆర్ తో అటెన్షన్ లాక్కున్నాడు. ఇప్పడు హాలీవుడ్ మార్కెట్ లో జెండాపాతాలనుకుంటే, ఏకంగా యూరప్, నార్త్ అమెరికాలో హిస్టరీ క్రియేట్ అయ్యేలా ఉంది. కారణం ప్రపంచ వ్యాప్తంగా 55 వేల థియేటర్స్ తో సూపర్ స్టార్ మహేశ్ బాబు 29వ మూవీ రిలీజ్ కాబోతుండటం..ఇందులో 35 వేల థియేటర్లు కేవలం యూరప్, నార్త్ అమెరికాలోనే ఉన్నాయి. అసలు మహేశ్ మూవీ 3 షెడ్యూల్స్ కి మించి పూర్తి కాలేదు. కాని రిలీజ్ కి ముందే 5 వేల కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. అంత ఎమౌంట్ రిలీజ్ అయ్యాక వస్తుందా అంటే, ఫస్ట్ డేనే 1200 కోట్ల నుంచి 1400 కోట్లు వచ్చేలా ఉన్నాయి. అంటే త్రిబుల్ ఆర్ మూవీ లైఫ్ టైంలో రాబట్టిన టోటల్ కలెక్షన్స్ ని, ఎస్ ఎస్ ఎమ్ బీ మూవీ మొదటి రోజు ఓపెనింగ్స్ లోనే రాబట్టేలా ఉంది.

దానికి రీజన్ ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 55 వేల థియేటర్స్ లోరిలీజ్ కావటమే… అసలు అన్ని థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ అయితే, మొదటి రోజు వరకు అక్కర్లేదు, మొదటి షో కి హౌజ్ ఫుల్ అయినా ఆ వసూళ్లు 660 కోట్లుంటాయి. అంటే నాలుగు షోలు పడితే 2400 కోట్లు వచ్చే ఛాన్స్ఉంది. కాకపోతే అన్ని థియేటర్స్ లో సీట్ల సంఖ్య ఒకేలా ఉండదు, రేట్లు ఒకేలా ఉండవు కాబట్టి, యావరేజ్ ఫస్ట్ డే ఓపెనింగ్స్ 1400 కోట్లని అంచనా వేస్తున్నారు.అసలే అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరున్, జురాసిక్ పార్ట్ ఫేం స్టీవెన్ స్పిల్ బర్గ్ లాంటి దర్శక దిగ్గజాలు సీన్లో కి వచ్చారు. రాజమౌళి రిక్వెస్ట్ వల్ల ఈనెల 21న జరిగే ప్రెస్ మీట్ కి రాబోతున్నారు. అది కాకుండా స్టీవెన్ స్పిల్ బర్గ్ తన బ్యానర్ డ్రీమ్ వర్క్స్ తరపున ఎస్ ఎస్ ఎమ్ బీని, యూఎస్, కెనెడాలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. జేమ్స్ కామెరున్ కూడా రాజమౌలి సినిమాను ప్రమోట్ చేయటానికి స్నేహంతో పాటు, అవతార్ 3 రిలీజ్ కూడా కారణమే.

ఇండియా నెంబర్ వన్ డైరెక్టర్ తీసే పాన్ వరల్డ్ మూవీకోసం తను వస్తే, తన అవతార్ 3 మూవీకి ఇక్కడ చాలా రీచ్, ఈజీ ప్రమోషన్ దక్కుతుంది. తన సినిమాకు అంత ప్రమోషన్ అవసరమా అంటే, అవతార్ 2 సరిగా ఆడలేదు కాబట్టే, అవతార్ 3 మీద జనాల్లో పెద్దగా ఎగ్జైట్ మెంట్ కనిపించట్లేదు. కాబట్టే డెఫినెట్ గా జేమ్స్ కామెరున్ ఇండియా టూర్ కలిసొచ్చేదే.ఇది కాకుండా రాజమౌళి తీసేంది అల్లా టప్పా మూవీకాదు..ఇండియన్ మైథాలజీ అయినా రామయణంలో హనుమంతుడు, మహాభారతంలో బార్బారికుడి పాత్రలను తీసుకుని హీరో క్యారెక్టర్ డిజైన్ చేశాడనే ప్రచారం జరుగుతోంది. ఐమ్యాక్స్ కెమెరాలో తెరకెక్కే మొదటి మూవీ అవటంతో పాటు, గ్రాఫిక్స్ సాహసాలు ఇలా చాలా అంశాలు అందరి అటెన్షన్ లాక్కునేలా ఉన్నాయి. అదే జరిగితే 55 వేల థియటేర్స్ లో ఈ సినిమా వస్తే మొదటి రోజే 1400 కోట్ల వసూళ్లు వస్తే, 30రోజుల్లో 5 వేలకోట్లు కాదు, 20 వేల కోట్లనే సినిమా రీచ్ అయ్యేఛాన్స్ఉంది…