జూనియర్ ఎన్టీఆర్ పై బ్లాక్ పాంథర్ హీరో కామెంట్స్.. దీనమ్మ ఇప్పుడు ఎగరేయండి కాలర్..!
జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ రోజురోజుకు పెరిగిపోతుంది. ఆయన మార్కెట్ తో పాటు క్రేజ్ పెరుగుతున్న విధానం చూసి అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ రోజురోజుకు పెరిగిపోతుంది. ఆయన మార్కెట్ తో పాటు క్రేజ్ పెరుగుతున్న విధానం చూసి అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. మిమ్మల్ని ఎప్పుడూ కాలర్ ఎగరేసుకునేలా చేస్తా అంటూ ఈ మధ్య కనిపించిన ప్రతిసారి చెప్తున్నాడు తారక్. ఆయన చెప్పినట్టుగానే ఇమేజ్ అలా అలా పెరుగుతూ పోతూ ఉంది. మరీ ముఖ్యంగా త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటన గురించి ఎన్టీఆర్ కాదు మొత్తం ప్రపంచం మాట్లాడుకుంటుంది. ఆ సినిమాకు ఆస్కార్ వచ్చిన తర్వాత హాలీవుడ్లో చాలావరకు పరిచయాలు పెంచుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఆస్కార్ తో పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కోసం అక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది హాలీవుడ్ నటులు జూనియర్ ఎన్టీఆర్ కు పరిచయం అయ్యారు. అదే స్నేహం ఇప్పటికీ వాళ్ళతో కంటిన్యూ చేస్తున్నాడు తారక్. ఇప్పటికిప్పుడు అది ఈయనకు ఉపయోగపడకపోవచ్చు కానీ ఫ్యూచర్ లో మాత్రం చాలా హెల్ప్ అవుతుంది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ సినిమా విడుదలైన తర్వాత చాలామంది హాలీవుడ్ నటులు, దర్శకులు జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా ప్రశంసించారు.
తాజాగా మరొక హాలీవుడ్ స్టార్ హీరో కూడా ఎన్టీఆర్ గురించి మాట్లాడాడు. బ్లాక్ పాంథర్ లాంటి సెన్సేషనల్ సినిమాలో నటించిన మైఖేల్ డీ జోర్డాన్ తాజాగా తారక్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తన కొత్త సినిమా సిన్నర్స్ ప్రమోషన్స్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ టాపిక్ వచ్చింది. ఇండియన్ యాక్టర్స్ లో మీకు ఎవరు తెలుసు అని అడిగితే.. తడుముకోకుండా జూనియర్ పేరు చెప్పాడు మైకెల్. ఆస్కార్ అవార్డుల కోసం వచ్చినప్పుడు తాను ఎన్టీఆర్ ను కలిశానని.. చాలా స్వీట్ పర్సన్ అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. అంతేకాదు ఆయన నటనకు తాను ఫిదా అయిపోయాను అని చెప్పాడు. తారక్ కు బాస్కెట్ బాల్ అంటే చాలా ఇష్టం అంటూ మైఖేల్ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ తో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నాడు. కేవలం బ్లాక్ పాంథర్ నటుడు మాత్రమే కాదు.. హాలీవుడ్ లో ఇంకా చాలామంది నటులకు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు తెలుసు. త్రిబుల్ ఆర్ లో ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలామంది హాలీవుడ్ మేకర్స్ కు డ్రీమ్ షాట్ లా మారిపోయింది.
అంతెందుకు మొన్నటికి మొన్న ఆస్కార్ లో స్టంట్ డిజైన్ అనే కొత్త కేటగిరి పెట్టారు. అందులో రిఫరెన్స్ కింద ట్రిపుల్ ఆర్ ఇంటర్వెల్ సీక్వెన్స్ లోని జూనియర్ ఎన్టీఆర్ ఫోటోను వాడుకున్నారు. దీన్ని బట్టి తారక్ కు హాలీవుడ్లో ఉన్న ఫాలోయింగ్ అర్థమైపోతుంది. కేవలం జూనియర్ మాత్రమే కాదు రామ్ చరణ్, రాజమౌళి గురించి కూడా హాలీవుడ్ లో రెగ్యులర్ గా చర్చ జరుగుతుంది. ఇండియన్ సినిమా గురించి మాట్లాడుకునే సమయంలో తారక్, చరణ్, జక్కన్న పేర్లు పదేపదే అక్కడ వినిపిస్తున్నాయి. ముగ్గురులో తన కమ్యూనికేషన్ స్కిల్స్ తో జూనియర్ ఎన్టీఆర్ ఒక మెట్టు పైనే ఉన్నాడు. తాజాగా బ్లాక్ పాంథర్ నటుడు మైకెల్ జోర్డాన్ చేసిన కామెంట్స్ తో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ గురించి హాలీవుడ్లో చర్చ మొదలైంది. ఎవరు ఈ తారక్ అంటూ తెలియని వాళ్ళు కూడా ఆయన గురించి సెర్చ్ చేస్తున్నారు. ఏదైనా తమ హీరో గురించి హాలీవుడ్ వాళ్ళు మాట్లాడుతుంటే అభిమానులు మాత్రం కాలర్ ఎగరేసుకొని మరీ వింటున్నారు. అభిమానులు అయినా కాకపోయినా మన ఇండియన్.. అందులోనూ మన తెలుగువారి గురించి హాలీవుడ్ వాళ్లు మాట్లాడుకుంటుంటే విని సంతోషపడకుండా ఎలా ఉంటాం చెప్పండి.