అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి సెన్సేషనల్ అప్డేట్.. బన్నీ అభిమానులకు పూనకాలు..!

పుష్ప తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా అంటే మామూలుగానే హైప్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. దానికి తోడు అట్లీ ఇలాంటి మాస్ డైరెక్టర్ దానికి తోడు కావడంతో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ ఉన్నాయో కొలత వేయడం కూడా కష్టంగా మారిపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 17, 2025 | 07:10 PMLast Updated on: Apr 17, 2025 | 7:10 PM

Sensational Update About Allu Arjun And Atlees Movie

పుష్ప తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా అంటే మామూలుగానే హైప్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. దానికి తోడు అట్లీ ఇలాంటి మాస్ డైరెక్టర్ దానికి తోడు కావడంతో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ ఉన్నాయో కొలత వేయడం కూడా కష్టంగా మారిపోయింది. తెలుగు హిందీ తమిళం అని తేడా లేదు అన్ని ఇండస్ట్రీలలో ఇప్పుడు బన్నీ, అట్లీ సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ తెలిసిన కూడా పండగ చేసుకుంటున్నారు బన్నీ ఫ్యాన్స్. అట్లీ ఏదో మాస్ సినిమా చేస్తున్నాడు అనుకున్నారు కానీ.. మొన్న అనౌన్స్మెంట్ వీడియో చూసిన తర్వాత ఏ రేంజ్ సినిమా చేస్తున్నాడు అనేది అర్థమవుతుంది. ఇండియన్ సినిమా ఇప్పటి వరకు కలలో కూడా చూడని ఒక మాస్ ఎంటర్టైనర్ కోసం ప్లాన్ చేస్తున్నారు అల్లు అర్జున్, అట్లీ. తమ ఆనౌన్స్మెంట్ తోనే సినిమా స్థాయి చెప్పకనే చెప్పారు. ఈ సినిమా కోసం పూర్తిగా హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. ఐరన్ మాన్, సూపర్ మాన్, అవతార్ లాంటి భారీ హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన విజువల్ ఎఫెక్ట్స్ టీం ఈ సినిమాకు పని చేస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాను ఒకటి రెండు కాదు ఏకంగా 800 కోట్లతో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.

AA22XA6 అనే వర్కింగ్ టైటిల్ తో మొదలైంది ఈ సినిమా. అమెరికాలోని ప్రత్యేక విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలన్నింటినీ చుట్టేసారు అల్లు అర్జున్, అట్లీ. అక్కడ పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ను కలిసి తమ కథను చెప్పి.. సినిమాకు కావాల్సిన అన్ని విషయాల గురించి మేకింగ్ వీడియోలో పొందుపరిచారు దర్శక నిర్మాతలు. ఇది చూస్తుంటే సినిమా రేంజ్ అర్థమైంది. కచ్చితంగా ఇంతకు ముందు ఇండియన్ స్క్రీన్ మీద ఎవరు చేయని ఒక మాస్ మ్యాజిక్ చేయాలని ఫిక్స్ అయిపోయారు అల్లు అర్జున్, అట్లీ. అక్కడే అల్లు అర్జున్ 3d స్కానింగ్ కూడా చేశారు. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం పూర్తిగా హాలీవుడ్ నుంచి ఇండియాకు వస్తున్నారు. అంతేకాదు విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కూడా అల్లు అర్జున్, అట్లీ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. కచ్చితంగా విఎఫ్ఎక్స్ పరంగా ఇండియన్ సినిమాలో సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేయడానికి రెడీ అవుతున్నారు ఈ ఇద్దరు. మే నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇంత పెద్ద సినిమా షూటింగ్ కేవలం ఒక ఏడాదిలో పూర్తి చేయడం అనేది చాలా కష్టం.

అట్లీ సెటప్ మొత్తం చూస్తుంటే కనీసం రెండేళ్లు ఈ సినిమా తీసేలా కనిపిస్తున్నాడు. ఈ సినిమా గురించి తాజాగా మరోక అప్డేట్ బయటికి వచ్చింది. ఇందులో అల్లు అర్జున్ ఒకటి రెండు కాదు ఏకంగా ట్రిపుల్ రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. తన సినిమాలలో హీరోలను ట్రిపుల్ క్యారెక్టర్ చేయించడంలో అట్లీ ఆరితేరిపోయాడు. అదిరింది సినిమాలో విజయ్ త్రిపాత్రాభినయం చేశాడు. అలాగే తేరి, బిగిల్ సినిమాలలో హీరోతో మూడు షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేయించాడు. జవాన్ సినిమాలో కూడా షారుక్ చాలా షేడ్స్ ఉన్న పాత్రలు చేశాడు. అలా తన సినిమాలలో హీరోలతో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయించడం అట్లీకి బాగా అలవాటు. ఇప్పుడు అల్లు అర్జున్ తో కూడా ఫస్ట్ టైం త్రిపాత్రాభినయం చేయించబోతున్నట్టు తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే ఇప్పటివరకు బన్నీ తన కెరీర్లో డబుల్ రోల్ కూడా చేయలేదు. అలాంటివి ఏకంగా ఇప్పుడు ట్రిపుల్ రోల్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. వీలైనంత త్వరగా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నాడు అట్లీ.