10 వేల కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ ఛాన్స్..? ఐ మ్యాక్స్ నుంచే 1500 కోట్లు..!
సూపర్ స్టార్ మహేశ్ బాబు 29 వ మూవీ ప్రెస్ మీట్ కి ఏర్పాట్లు పూర్తైనట్టున్నాయి. అంతా అన్ అఫీషియల్ గానే జరుగుతోంది. జేమ్స్ కామెరున్ రాక మీద క్లారిటీ వచ్చాకే శాటర్ డే ఎనౌన్స్ మెంట్ ఉండొచ్చట.

సూపర్ స్టార్ మహేశ్ బాబు 29 వ మూవీ ప్రెస్ మీట్ కి ఏర్పాట్లు పూర్తైనట్టున్నాయి. అంతా అన్ అఫీషియల్ గానే జరుగుతోంది. జేమ్స్ కామెరున్ రాక మీద క్లారిటీ వచ్చాకే శాటర్ డే ఎనౌన్స్ మెంట్ ఉండొచ్చట. అయితే ఈ ప్రెస్ మీట్ లో భూమి బద్దలయ్యే ఎనౌన్స్ మెంట్ ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయ్యింది. ఇంతవరకు రాజమౌళీ తీసిన సినిమాలన్నీ, రిలీజ్ అయ్యాక రికార్డులు క్రియేట్ చేశాయి. కాని ఎస్ ఎష్ ఎమ్ బీ 29వ మూవీ 1000 కోట్ల బడ్జెట్ ని 10 వేల కోట్ల ప్రాఫిట్ గా ముందే మారుస్తోంది. రిలీజ్ కి ముందే రీసౌండ్ చేసేలా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 1750 ఐమ్యాక్స్ థియేటర్స్ లో కూడా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా, కేవలం ఐ మ్యాక్స్ వర్షన్ కే 1500 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ అయ్యిందట. అంటే 55 వేల థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈసినిమా ఇంకెంత ప్రీరిలీజ్ బిజినెస్ చేయొచ్చు.. అదే ప్రెస్ మీట్ లో ఎనౌన్స్ చేసేందుకు అన్నీ చక్క బెడుతున్నాడు జక్కన్న… టైటిల్, కాన్సెప్ట్, స్టార్ కాస్ట్ తో పాటు ప్రీరిలీజ్ బిజినెస్, మార్కెటింగ్ అప్రోచ్ ని కూడా వివరించి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు రాజమౌళి.
ఇండియన్ సినిమాలోనే ఇంతవరకు 2 వేల కోట్ల దంగల్ రికార్డుని ఎవరూ బ్రేక్ చేయలేదు. కాని బాహుబలి 2 తాలూకు 1850 కోట్ల రికార్డుకి పుష్ప2 వసూళ్లు దాదాపు దగ్గరగా వచ్చాయి. అదే సెన్సేషన్ అయ్యింది. అలాంటిది ఓ తెలుగు సినిమా రిలీజ్ కి ముందే 5 వేల కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేస్తే అదో పెద్ద సునామి క్రియేట్ చేసినట్టే..విచిత్రం ఏంటంటే 5 వేల కోట్లు కాదు ఏకంగా 10 వేల కోట్ ప్రీరిలీజ్ బిజినెస్ ని సూపర్ స్టార్ మహేశ్ బాబు 29వ మూవీ పూర్తి చేసినట్టుంది. అదే పెద్ద సెన్సేషన్ అయ్యేలా ఉంది. ఎందుకంటే 55 వేల థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఫస్ట్ ఇండియన్ మూవీ కాబట్టి, ఇది 55 వేల థియేటర్స్ లో ఒక్కరోజు ఆడితేనే 10 వేల కోట్లు వచ్చే ఛాన్స్ఉంది.
అందుకే హాలీవుడ్ దిగ్గజ కంపెనీలైన డ్రీమ్ వర్క్స్, డిస్నీప్ బ్యానర్లు ఈ మూవీని యూఎస్, యూరప్ లోడిస్ట్రిబ్యూట్ చేసేందుకు రెడీ అయ్యాయి. 8 వేల కోట్ల వరకు 30 వేల థియేటర్స్ లో రిలీజ్ చేసే రైట్స్ సొంతం చేసుకున్నాయని తెలుస్తోంది.అంతా తెరవెనకే జరుగుతోంది. మంగళవారం ప్రెస్ మీట్ లో ఈ విషయానికి సంబంధించి భారీ ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తోంది. అసలు ఇవన్నీ కాదు, ఐమ్యాక్స్ కెమారాతో తెరకెక్కుతున్న ఫస్ట్ ఇండియన్ మూవీ అయిన ఈ సినిమా, వరల్డ్ వైడ్ గా ఉన్న 1750 ఐమ్యాక్స్ థియేటర్స్ లోరిలీజ్ కాబోతోంది.
సో అదే జరిగితే, అన్నీ ఐమ్యాక్స్ థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న మొదటి ఇండియన్ మూవీగా కూడా ఈ సినిమాకే రికార్డు దక్కుతుంది. విచిత్రంఏంటంటే అన్ని ఐమ్యాక్స్ థియేటర్స్ లో ఈ సినిమా 10 రోజులు ఆడితే 2 వేల కోట్లు వసూలయ్యే ఛాన్స్ఉంది. అందుకే ఐమ్యాక్స్ వర్షన్ డిస్ట్రిబ్యూటరే 1500 కోట్లతో ఐమ్యాక్స్ వర్షన్ రైట్స్ డీల్ మాట్లాడేశాడట.
ఇవన్నీ మంగళవారం జరిగే ఇంటర్ నేషనల్ ప్రెస్ మీట్ లో ఎనౌన్స్ అయ్యే ఛాన్స్ఉంది. అదే జరిగితే, అసలే బాహుబలి 2 క్రియేట్ చేసిన సునామీకి బాలీవుడ్ కొట్టుకుపోయింది. త్రిబుల్ ఆర్ కి ఆస్కార్ వస్తే కుళ్లుకుంది.. అయితే అవన్నీ రిలీజ్ అయ్యాకే రికార్డులు క్రియేట్ చేశాయి. మహేశ్ బాబు 29 వ మూవీ విడుదలకు ముందే వండర్స్ చేస్తోంది కాబట్టి, ఇది మాత్రం బాలీవుడ్ ని షాక్ కి గురిచేసేలా ఉంది. హాలీవుడ్ జనాలను కూడా అవాక్కయ్యేలా చేసే ఛాన్స్ ఉంది.