పిల్లల్ని వెంటాడి మరీ నరికి.. జీడిమెట్ల పిల్లల హత్యకు కారణం ఇదే
దేవుడు అంతటా ఉండలేక.. అందరికీ సమాన ప్రేమ పంచలేక అమ్మను సృష్టించాడు అంటారు. అమ్మ గొప్పతనం అదీ.. ప్రతీ ఒక్కరి జీవితంలో అమ్మకు ఉండే స్థానం అది.

దేవుడు అంతటా ఉండలేక.. అందరికీ సమాన ప్రేమ పంచలేక అమ్మను సృష్టించాడు అంటారు. అమ్మ గొప్పతనం అదీ.. ప్రతీ ఒక్కరి జీవితంలో అమ్మకు ఉండే స్థానం అది. కానీ అలాంటి అమ్మ తనానికే కలకం తెచ్చే దారుణం చేసింది ఓ మహిళ. హైదరాబాద్ శివారు గాజులరామారంలో ఓ తల్లి తీసుకున్న నిర్ణయం అందరికీ కంటి తడిగా మార్చింది. తనకు ఉన్న అరుదైన ఓ కంటి వ్యాధి పిల్లలకు కూడా రావడంతో.. వాళ్లు పడుతున్న బాధను చూడలేక కన్న పిల్లలను చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన తేజస్విని తన భర్త గాండ్ర వెంకటేశ్వరరెడ్డికి ఇద్దరు కొడుకులు. వీళ్లిద్దరూ అరుదైన ఓ కంటి వ్యాధితో బాధపడుతున్నారు. వాళ్లకు ప్రతీ రెండు గంటలకోసారి కంట్లో మందు వేయాల్సి ఉంటుంది. లేదంటే, తీవ్ర నొప్పితో విలవిలలాడతారు. తల్లిగా తేజస్విని పిల్లల బాధను తట్టుకోలేకపోయింది. పిల్లలు ఏడుస్తుంటే ఆమె గుండె ద్రవించేది.
ప్రతి రోజు వాళ్ల నొప్పిని చూసి తన మనశ్శాంతి కోల్పోయింది. తేజస్వినికి ఎదురు వచ్చిన సమస్య కేవలం అనారోగ్యం కాదు సమాజం నుంచీ, కుటుంబం నుంచీ వచ్చిన హేళనలు కూడా. తన పిల్లలకు ఉన్న కంటి వ్యాధికి తానే కారణమనే అభిప్రాయంతో చాలామంది ఆమెను విమర్శించారు. ఆఖరికి ఇంట్లో భర్త కూడా ఆమెకు తోడుగా నిలబడలేకపోయాడు. చివరికి చస్తే చావండి అని అనడంతో మనస్తాపం చెందిన తేజస్విని తన ఇద్దరు పిల్లలను హత్య చేసి, తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పడింది. భర్త డ్యూటీకి వెళ్లగానే ఇద్దరు పిల్లలను కత్తితో వెంటాడి నరికేసింది. తరువాత తాను కూడా అపార్ట్‌మెంట్ మీద నుంచి దూకేసి ఆత్మహత్య చేసుకుంది. తేజస్విని ఫ్లాట్‌లో పోలీసులు 8 పేజీల లేఖ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలకు కంటి సమస్య ఉంది. రెండు గంటలకు ఒకసారి కంట్లో మందు వేయకుంటే పిల్లలు నొప్పితో ఏడుస్తారు.
దేవుడా నా పిల్లలకు ఎందుకు ఇంత బాధను ఇచ్చావు ? నన్ను అందరూ పిచ్చిది అంటున్నారు. కంటి నొప్పి సమస్యలతో బాధపడుతున్న నా పిల్లలను నేనే చంపుకున్నాను. ఇంతటి పరిస్థితి ఏ తల్లికీ రావద్దు. నా పిల్లలు లేని బతుకు నాకు ఎందుకు ? నేను కూడా చనిపోతున్నాను. అమ్మా, నాన్నా ఐ యామ్ సారీ. ఆస్తిలో ఒక్క పైసా కూడా నా భర్తకు ఇవ్వవద్దు. ఆస్తి మొత్తం అనాథలు, స్కూల్ పిల్లలకు ఇవ్వండి అంటూ కన్నీటి లేఖ రాసి ప్రాణం తీసుకుంది. తేజశ్విని చాలా కాలంగా డిప్రెషన్‌లో ఉందని చెప్తున్నారు ఆమె కుటుంబ సభ్యలు. ఇంట్లో ఒంటరిగా ఉండటంతో ఆమెలో ఒంటరితనంతో పాటు తీవ్రమైన డిప్రెషన్ ఏర్పడిందని తెలిపారు. పిల్లలను చంపడానికి గంట ముందు కూడా తేజశ్విని నాతో మాట్లాడింది అని చెప్తున్నారు ఆమె తల్లి.
కాల్‌లో తాను మాట్లాడినప్పుడు తేజశ్వినిలో ఎంలాటి డిప్రెషన్ ఉన్నట్టు తనకు అనిపించలేదంటున్నారు. సరిగ్గా గంట తరువాత ఈ దారుణమై వార్త విని మానసికంగా కుంగిపోయామని చెప్తున్నారు. ఈ ఘటనకు ఆర్థిక పరిస్థితులు గానీ, భార్యాభర్తల మధ్య విభేదాలు గానీ కారణాలు కావని.. తేజస్వినికి కేవలం మానసిక సమస్యలే బాధగా మారినట్లు తెలిపారు. ఇక్క మరో బాధాకరమైన విషయం ఏంటంటే.. మరో రెండు రోజుల్లో తేజశ్విని పెద్ద కొడుకు బర్త్ డే. కొడుకు కోసం వెంకట్‌రెడ్డి కొత్త బట్టలు కూడా కొన్నాడు. అత్తామామలను ఇంటికి పిలిచి సంబరాలు చేసుకోవాలి అనుకుంటున్న సమయంలో ఆ ఇంట్లో ఇలాంటి దారుణం జరగడంతో వాళ్లంతా కన్నీరుమున్నీరవుతున్నారు.