IPL 2024 : బట్లర్ దెబ్బకు గేల్ రికార్డు గల్లంతు..
ఐపీఎల్ 17వ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ దుమ్ము రేపుతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) పై 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఐపీఎల్ 17వ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ దుమ్ము రేపుతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) పై 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బట్లర్ విరోచిత శతకంతో చెలరేగాడు. ఈ విజయంలో ఆ జట్టు స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ కీలక పాత్ర పోషించాడు. ఓటమి తప్పదనుకున్న చోట బట్లర్ తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ క్రీజులో ఉన్న బట్లర్ మాత్రం తన పట్టును విడలేదు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికి తన జోరును కొనసాగించాడు.
తన హాఫ్ సెంచరీ పూర్తియ్యాక కేకేఆర్ (KKR) బౌలర్లను బట్లర్ ఊచకోత కోశాడు. ఆఖరివరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 60 బంతులు ఎదుర్కొన్న బట్లర్.. 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 107 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. ఓవరాల్‌గా బట్లర్‌కు ఇది ఏడో ఐపీఎల్ సెంచరీ. తద్వారా ఐపీఎల్ (IPL) లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా బట్లర్ రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజం గేల్ రికార్డును బ్రేక్ చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో తొలి స్ధానంలో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి 8 సెంచరీలతో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఆ తర్వాతి స్ధానంలో బట్లర్ నిలిచాడు.