AP Sea Food Exports : సీ ఫుడ్ ఎగుమతుల్లో దేశంలోనే ఏపీ టాప్…
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంకు అరుదైన రికార్డు నమోదు చేసుకుంది. మత్స్యసంపద (Fisheries) ఎగుమతుల్లో దేశంలోనే AP టాప్‌లో నిలిచింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంకు అరుదైన రికార్డు నమోదు చేసుకుంది. మత్స్యసంపద (Fisheries) ఎగుమతుల్లో దేశంలోనే AP టాప్‌లో నిలిచింది. 2023-24లో ఏపీలోని సముద్ర ప్రాంతాల నుంచి 4,27,237 లక్షల టన్నుల మత్స్య సంపద(చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, తదితర ఆహార పదార్థాలు) ఎగుమతి అయినట్లు కేంద్ర వాణిజ్య (Central Commercial Wealth), పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద.. రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు. సీ ఫుడ్ ఎగుమతుల్లో గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాళ్, తమిళనాడు రాష్ట్రాలను దాటి టాప్ ప్లేస్ లో నిలించింది! కాగా 2, 3 స్థానాల్లో గుజరాత్, కర్ణాటక నిలిచాయి.
సీఫుడ్ ఎగుమతుల (Sea Food, Exports) గణంకాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానంలో 3.45 లక్షల టన్నులతో గుజరాత్ రెండో స్థానంలో ఉంది. అదేవిధంగా… 2.73 లక్షల టన్నుల ఎగుమతితో కర్ణాటక మూడో స్థానంలో ఉండగా.. 1.88 లక్షల టన్నులతో కేరళ, 1.70 లక్షల టన్నులతో మహారాష్ట్ర, 1.60 లక్షల టన్నులతో పశ్చిమ బెంగాల్ లు వరుసగా తర్వాత స్థానాల్లో నిలిచాయి..! ఈ సందర్భంగా రాజ్యసభలో కేంద్ర మంత్రి మాట్లాడుతు.. భారతదేశం నుంచి వెళ్లే కంటైనర్ల సెయిలింగ్ లను కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గం ద్వారా మళ్లించడం నుంచి ఎగుమతులు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు..! ఈ మార్గంలో ఎన్నో సవాళ్లు ఉన్నప్పటీకీ ఎగుమతులు 2022-23 సంవత్సరంలో 17.54 లక్షల టన్నులు ఉండగా.. 20223-24 నాటికి 3.73 శాతం వృద్ధిని సాధిస్తూ 18.19 లక్షల టన్నులకు పెరిగినట్లు వెల్లడించారు.