Home » Tag » Rahul Gandhi
రేవంత్ రెడ్డి అనే నేను.. ఈ మాటకు ఏడాది. మూడు రంగుల జెండా పట్టి.. సింగమోలే కదిలిన కాంగ్రెస్ సూరీడు.. హస్తం పార్టీని అధికారానికి దగ్గర చేశారు. ఇందిరమ్మ రాజ్యం తీసుకు వద్దామని.. సీఎంగా బాధ్యతలు అందుకున్నారు. కాంగ్రెస్ పోటీనే కాదు, పోటీలోనే లేదని.. బీఆర్ఎస్ సర్కార్ తీసివేసినట్లు మాట్లాడినా.. ఆ మాటలను తట్టుకున్నారు.
ఇండియా కూటమికి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. అసలే మహారాష్ట్ర ఎన్నికల్లో ఘోర ఓటమిలో ఉన్న హస్తం పార్టీకి...ఆప్ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఝలక్ ఇచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో...ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు.
కులగణన సంప్రదింపుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. సామాజిక, ఆర్ధిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి కుల గణన సర్వే ప్రభుత్వం బాధ్యతగా భావించిందన్నారు. పౌరసమాజం నుంచి సూచనలు తీసుకోవడానికి రాహుల్ గాంధీ గారు ఇక్కడకు రావడం గొప్ప విషయమని తెలిపారు.
వాయనాడ్ ఉప ఎన్నికల యుద్దానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఉప ఎన్నికల డేట్ ను కేంద్ర ఎన్నికల సంఘం గత మంగళవారం ప్రకటించగా... నవంబర్ 13న ఓటింగ్ జరుగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. వాయనాడ్ ఉప ఎన్నిక కాంగ్రెస్ కంటే అధికార బిజేపికి అత్యంత కీలకం.
హర్యానాలో కాంగ్రెస్‌ను కాంగ్రెస్సే ఓడించిందా...? చేతికి అంది వచ్చిన అవకాశాన్ని హస్తం ఎందుకు చేజార్చుకుంది...? అతివిశ్వాసమే కాంగ్రెస్‌ను ముంచిందా...? కాంగ్రెస్ నేతల తీరు ఇలాగే ఉంటే రాహుల్ ప్రధాని కావాలన్న ఆశ ఆకాంక్ష ఫలిస్తుందా...? ఇలాగైతే బీజేపీని ఎదుర్కోవడం కాంగ్రెస్ వల్లవుతుందా....?
హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. హర్యానాలో బీజేపీ బలమైన ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటుంది అని స్పష్టం చేసాయి.
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. మూసి బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ కాదు, లూటీఫికేషన్ ప్రాజెక్ట్ అంటూ ప్రసంగం మొదలుపెట్టిన కేటిఆర్... శాసన సభలో ఎటువంటి చర్చ లేకుండా హైడ్రా పై ఆర్డినెన్స్ తెచ్చారు అని కేంద్ర పెద్దల కనుసన్నల్లో గవర్నర్ సంతకం పెట్టాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఇండియన్ పాలిటిక్స్‌లో ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్‌లో ఫస్ట్ కనిపించే పేరు రాహుల్ గాంధీ. 50 ఏళ్ల దాటినా రాహుల్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆయన పెళ్లి గురించి చాలా కాలంగా చాలా వార్తలు వస్తూనే ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ మీద కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఫోకస్ చేసింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. జిల్లా పార్టీ అధ్యక్షులను కూడా నియమించింది. త్వరలోనే మరిన్ని కీలక మార్పులు చేసే అవకాశం ఉందనే వార్తలు సైతం వస్తున్నాయి.