హిట్ మ్యాన్ కు ఏమైంది ?

టీ20 వరల్డ్ కప్ సమీపిస్తున్న తరుణంలో.. టీమిండియా అభిమానుల్లో టెన్షన్ మొదలయింది. ఐపీఎల్ 17వ సీజన్ లోక్ ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ప్రదర్శనే వారి టెన్షన్ కి కారణం. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ఈ రోహిత్ కేవలం 4 పరుగులు చేసి వెనుదిరిగాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 7, 2024 | 06:45 PMLast Updated on: May 07, 2024 | 6:45 PM

What Happened To Hit Man

టీ20 వరల్డ్ కప్ సమీపిస్తున్న తరుణంలో.. టీమిండియా అభిమానుల్లో టెన్షన్ మొదలయింది. ఐపీఎల్ 17వ సీజన్ లోక్ ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ప్రదర్శనే వారి టెన్షన్ కి కారణం. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ఈ రోహిత్ కేవలం 4 పరుగులు చేసి వెనుదిరిగాడు. సీజన్ ఫస్టాఫ్‌లో పర్వాలేదనిపించిన రోహిత్.. సెకండాఫ్‌లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. తొలి 7 ఇన్నింగ్స్‌ల్లో 297 పరుగులు చేసిన రోహిత్ తర్వాతి 5 ఇన్నింగ్స్‌ల్లో 34 పరుగులు మాత్రమే చేశాడు.

దీంతో హిట్ మ్యాన్ ప్రదర్శనపై క్రికెట్ ఫాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా ఐపీఎల్ ఒక్కటే అయితే రోహిత్ ప్రదర్శనపై అంత ఆందోళన ఉండదు. కానీ త్వరలోనే టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుంది. టీమిండియా ఈసారైనా కప్ కొట్టాలంటే.. కెప్టెన్ గా ఓపెనర్ గా రోహిత్ శర్మ రాణించడం చాలా ముఖ్యం. టీ20 ప్రపంచకప్‌ల్లో ఏ మాత్రం మెరుగైన రికార్డ్ లేని రోహిత్ పేలవ ప్రదర్శనను చూసి మాజీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ గణంకాలను చూసిన ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ప్రపంచకప్ ముందు రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. కెరీర్‌లో చివరి టీ20 ప్రపంచకప్ ఆడబోతున్న రోహిత్ శర్మ సత్తా చాటాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. కెప్టెన్ కాకుంటే రోహిత్ శర్మను టీ20 ప్రపంచకప్‌కు కూడా ఎంపిక చేసేవారు కాదని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.