కేఎల్ రాహుల్ ధనాధన్ వార్నర్,కోహ్లీ రికార్డులు బ్రేక్

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2025 సీజన్ లో దుమ్మురేపుతున్నాడు. గత ఏడాది కెప్టెన్సీ ఒత్తిడితోనూ పరుగుల వరద పారించిన రాహుల్ ఇప్పుడు ఢిల్లీ జట్టు తరపున అదరగొడుతున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 23, 2025 | 01:30 PMLast Updated on: Apr 23, 2025 | 1:30 PM

Kl Rahul Breaks Dhanadhan Warner Kohlis Records

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2025 సీజన్ లో దుమ్మురేపుతున్నాడు. గత ఏడాది కెప్టెన్సీ ఒత్తిడితోనూ పరుగుల వరద పారించిన రాహుల్ ఇప్పుడు ఢిల్లీ జట్టు తరపున అదరగొడుతున్నాడు. తాజాగా తన పాత ఫ్రాంచైజీ మీద కసితీరా ఆడేసి హాఫ్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 33 ఏళ్ల కేఎల్ రాహుల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 5 వేల పరుగులు పూర్తి చేశాడు. దీంతో ఐపీఎల్ లో అత్యంత వేగంగా 5 వేల పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

కేఎల్ రాహుల్ కేవలం 130 ఇన్నింగ్స్ లలో ఈ ఘనత సాధించి ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ రికార్డును బద్ధలు కొట్టాడు. డేవిడ్ వార్నర్ 135 ఇన్నింగ్స్ లలో 5000 పరుగులు పూర్తి చేశాడు. ఈ జాబితాలో మూడో స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ 157 ఇన్నింగ్స్ లలో 5 వేల ఐపీఎల్ పరుగులు పూర్తి చేశాడు. తర్వాత ఏబీ డివీలియర్స్ 161 ఇన్నింగ్స్ లలోనూ, శిఖర్ ధావన్ 168 ఇన్నింగ్స్ లలోనూ ఈ ఘనత సాధించారు. రాహుల్ 46.35 స‌గ‌టు, 135.70 స్ట్రైక్‌రేట్‌తో 5వేల ర‌న్స్ పూర్తి చేశాడు. ఇందులో 4 సెంచ‌రీలు, 40 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అలాగే నాలుగుసార్లు డ‌కౌట్ అయ్యాడు. ఇదిలా ఉంటే కేఎల్ రాహుల్ కు ఈ సీజన్‌లో ఇది మూడవ అర్ధ సెంచరీ.. ఓవరాల్ గా ఐపీఎల్ లో 48వ ఫిఫ్టీయయయ.

కేఎల్ రాహుల్ సిక్సర్ తో ఢిల్లీకి అద్భుతమైన విజయాన్ని అందించాడు. అతనితో పాటు అభిషేక్ పోరెల్ జోరుతో ఢిల్లీ క్యాపిటల్స్ 160 పరుగుల లక్ష్యాన్ని 13 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.. అభిషేక్ పోరెల్ 36 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే మ్యాచ్ అనంత‌రం రాహుల్ త‌న మాజీ ఓన‌ర్ సంజీవ్ గోయెంకాతో మాట్లాడేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. కేవ‌లం షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయాడు. గ‌త సీజ‌న్‌లో త‌న‌ను అవ‌మానించిన గోయెంకాకు రాహుల్ గ‌ట్టి బుద్ధి చెప్పాడ‌ని నెటిజ‌న్లు అంటున్నారు. ఇదే స‌మ‌యంలో కేఎల్ రాహుల్ సోష‌ల్ మీడియాలో చేసిన పోస్ట్ వైర‌ల్ అవుతోంది. మ్యాచ్ ఫోటోల‌ను పోస్ట్ చేస్తూ.. ల‌క్నోలో తిరిగి పుంజుకోవ‌డం ఎప్పుడూ ఓ ప్ర‌త్యేక‌మైన అనుభూతి అని రాసుకొచ్చాడు.