ఐపీఎల్ లో కెమెరా డాగ్, చంపక్ సందడే సందడి

టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత క్రికెట్ బోర్డు అందరికంటే ఓ అడుగు ముందే ఉంటుంది. తాజాగా ఐపీఎల్ లో సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో టెక్నాలజీ రివల్యూషన్ నెక్ట్స్ లెవల్ కు చేరుకుంది

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 26, 2025 | 11:42 AMLast Updated on: Apr 26, 2025 | 11:42 AM

Camera Dog Champak All The Buzz In Ipl

టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత క్రికెట్ బోర్డు అందరికంటే ఓ అడుగు ముందే ఉంటుంది. తాజాగా ఐపీఎల్ లో సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో టెక్నాలజీ రివల్యూషన్ నెక్ట్స్ లెవల్ కు చేరుకుంది. ఈ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో బీసీసీఐ ముందుందని మరోసారి నిరూపించుకుంది. ఐపీఎల్ నయా ఎడిషన్ లో రోబోటిక్ డాగ్ ను పరిచయం చేసింది బీసీసీఐ. చూడటానికి కుక్క ఆకారంలో ఉన్న ఈ రోబోకు హైక్వాలిటీ కెమెరాలు అమర్చి ఉన్నాయి. ఆటలోని వైవిధ్యమైన విషయాలను ప్రెజెంట్ చేస్తూ ఫ్యాన్స్ కు డబుల్ కిక్ ఇస్తోంది ఈ కెమెరా. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

మ్యాచ్‌ సమయంలో మైదానంలో ఉన్న ఆటగాళ్లనే కాదు క్రికెట్‌ ప్రేమికుల దృష్టిని కూడా ఆకర్షిస్తోంది. క్రికెటర్లకు షేక్ హ్యాండ్స్ ఇస్తూ.. గంతులు వేస్తూ ఈ రోబో డాగ్ ఐపీఎల్ లో హాట్ టాపిక్ గా మారింది. దీనికి పేరు పెట్టమని ఫ్యాన్స్ ను ఐపీఎల్ కోరడంతో చివరకు మెజారిటీ నిర్ణయంతో చంపక్ అనే పేరు పెట్టారు. ఐపీఎల్ మ్యాచ్ లు ఉన్నప్పుడు, ఆటగాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇది చేసే హంగామా అంతా ఇంతా కాదు. డిఫరెంట్ వాయిస్ కమాండ్స్ కు రెస్పాండ్ అవుతోంది. అలాగే తన ముందటి కాళ్లతో హార్ట్ షేప్ ను కూడా చూపిస్తోంది.

ప్లేయర్స్ కు హైఫై ఇవ్వడం, వాళ్లలాగే ఎక్సర్ సైజ్ చేయడం, చీర్ గర్ల్స్ తో కలిసి స్టెప్స్ వేయడం.. ఇలా ఈ చంపక్ అన్నీ చేస్తోంది. దీంతో ప్లేయర్స్ ఆటలాడుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీన్ని ప్లేయర్లు ఎత్తుకుంటున్నారు. నాలుగు కాళ్లతో నడిచే ఈ చంపక్ ముఖం స్థానంలో కెమెరా ఉంటుంది. దీంతో విజువల్స్ రికార్డు చేస్తోంది. ఈ కెమెరాతో ఫ్యాన్స్ కు డిఫరెంట్ అనుభూతి ఇచ్చేందుకు ఐపీఎల్ బ్రాడ్ కాస్టర్ ప్రయత్నిస్తోంది. ఐపీఎల్‌ మ్యాచ్ జరుగుతున్నప్పుడు మైదానంలోని అన్ని మూలలకు తిరుగుతూ, పెట్‌ విజన్‌ అందించడం దీని పని. అంటే, ప్రేక్షకులు ఇప్పటి వరకు చూడని కోణాల నుంచి మ్యాచ్‌ను చూపిస్తుంది.