Oakridge International School: హైదరాబాద్ లో ముఖాముఖి కార్యక్రమానికి హాజరైన ఇరుదేశాల దిగ్గజ క్రికెటర్లు..
ఓక్రిడ్జి పాఠశాలలో ఇరుదేశాల క్రిడాకారులు ముఖాముఖి కార్యక్రమానికి హాజరయ్యారు. శ్రీలంక మాజీ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్ లు పాల్గొన్నారు. వీరికి పాఠశాల యాజమాన్యం ఘన స్వాగతం పలికారు.

ముఖ్య అతిథులుగా హాజరైన ఇరు దేశాల క్రికెట్ ఆటగాళ్లకు పిల్లలు తమ చేతిలోని బ్యాట్ లను ఎత్తిపట్టుకొని ఘన స్వాగతం పలికారు

ఒక కుర్రవాడు తన టీషర్ట్ వెనుక భాగంలో డేల్ స్టెయిన్ ఆటోగ్రాఫ్ ను చెరిగిపోని గుర్తుగా రాయించుకుంటున్నాడు.

అధ్యాపక, స్కూల్ యాజమాన్యంతోపాటూ విద్యార్థలు అందరూ కలిసి వేదికపైకి ఎక్కి ఆ క్షణాలను మధుర జ్ఞాపకంగా ఫోటోలో బంధించారు

ఈ స్కూల్లో చదువుతూ క్రికెట్ పై ఆసక్తి ఉన్న పిల్లలు దిగ్గజ క్రికెటర్లతో గ్రూప్ ఫోటో దిగారు

స్కూల్ అధ్యాపక బృందం ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపించారు

వేదికపై కూర్చొని ప్రసంగిస్తున్న ముత్తయ్య మురళీధరన్

స్కూల్ లోని విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య అక్కడి వాతావరణం సందడిగా మారింది.

ఈ పాఠశాల విద్యార్థులు వేదిక పై క్రికెట్ ఆడి సందడి చేశారు

ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో మాజీ శ్రీలంక క్రికెట్ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్లతో ముఖా ముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

పిల్లలు పుస్తకాలపై ఆటోగ్రాఫ్ తీసుకునేందుకు క్యూ కట్టారు