Vijayawada : విజయవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. కండక్టర్, చిన్నారితో సహా మృత..
విజయవాడ లోని పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున విజయవాడ నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ అయి బస్టాండ్ లోని ప్రయాణుకుల వైపు దూసుకెళ్లింది.

An RTC bus created havoc at Pandit Nehru bus stand in Vijayawada The conductor and the child died
విజయవాడ (Vijayawada) లోని పండిట్ నెహ్రూ బస్టాండ్ (Pandit Nehru bus stand )లో ఓ ఆర్టీసీ బస్సు (RTC bus ) బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున విజయవాడ నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ అయి బస్టాండ్ లోని ప్రయాణుకుల వైపు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కండక్టర్ తో సహా వెళ్తున్న ప్రయాణికులు, 10 నెలల చిన్నారి మృతి చెందింది. బస్సు కింద పడి మరి కొందరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన విజయవాడ బస్టాండ్ లోని 12వ ప్లాట్ ఫారమ్ లో చోటు చేసుకుంది.
Mahesh-Venky : పబ్లిక్ గా పేకాట ఆడిన మహేష్-వెంకీ మామ..
ఈ ప్రమాదం ఎలా జరిగింది..?
విజయవాడ లో ఈ ఉదయం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ప్రాథమిక సమాచారం మేరకు విజయవాడ నుంచి గుంటూరు వెళ్తున్న బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ఘటన జరిగిందని ఆర్టీసీ యాజమన్యం తెలిపింది. ఇక బస్సు ప్రయాణికుల పై వెళ్లడంతో ఆర్టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఒక్కసారిగా బస్సు ప్రయాణికుల పైకి దూసుకెళ్లడంతో బస్సు స్టాండ్ లో ఉన్న వారికి ఏం జరుగుతుందో అర్థంకాక భయందోళనతో పరుగులు పెట్టారు. ఈ ఘటనలో మృతి చెందిన కండక్టర్ గుంటూరు-2 డిపోకు చెందిన వీరయ్యగా గుర్తించారు.