swayambhu-nikhil : 12 రోజులు… రూ.8 కోట్లు

కార్తీకేయ 2 (Karthikeya 2) తర్వాత.. యంగ్ హీరో నిఖిల్ రేంజ్ పెరిగిపోయింది. పాన్ ఇండియా (Pan India) వైడ్ గా ఈ మూవీ భారీ కలెక్షన్లు కొల్లగొట్టడంతో.. అందరి దృష్టిలోపడ్డాడు నిఖిల్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 7, 2024 | 06:00 PMLast Updated on: May 07, 2024 | 6:00 PM

Tollywood Young Hero Karthikeya 2 Fame Nikhil Is A Pan India Movie With Huge Budget

కార్తీకేయ 2 (Karthikeya 2) తర్వాత.. యంగ్ హీరో నిఖిల్ రేంజ్ పెరిగిపోయింది. పాన్ ఇండియా (Pan India) వైడ్ గా ఈ మూవీ భారీ కలెక్షన్లు కొల్లగొట్టడంతో.. అందరి దృష్టిలోపడ్డాడు నిఖిల్. తనకున్న క్రేజ్ ను అలాగే కంటిన్యూ చేసేందుకు నిఖిల్ నెక్స్ట్ ప్రాజెక్టును కూడా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కు ప్లాన్ చేసుకున్నాడు. ఈ క్రమంలో భరత్ కృష్ణమాచారి (Bharat Krishnamachari) దర్శకత్వంలో స్వయంభూ సినిమాను చేస్తున్నాడు. పోస్టర్ తోనే ఈ సినిమా ఆడియెన్స్ లో క్యూరియాసిటీ పెంచింది. అయితే తాజాగా ఈ మూవీ గురించి మరిన్ని క్రేజీ విషయాలు బయటకు వస్తున్నాయి.

స్వయంభూ (swayambhu) సినిమా నిఖిల్ కు 20వ సినిమా. ఈ సినిమా తన కెరీర్ లో మైలురాయి మాత్రమే కాదు.. పాన్ ఇండియా హీరోగా నిలదొక్కుకోవడానికి మంచి అవకాశంగా కూడా చెప్పుకోవాలి. దీంతో సినిమా కోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్టుగా తెలుస్తోంది. హిస్టారికల్‌ సబ్జెక్ట్‌ తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో శత్రువులను చీల్చి చెండాడే యుద్ద వీరుడిగా కనిపించనున్నాడీ యంగ్ హీరో. అందుకోసం మేకోవర్ ను మార్చుకుని హాట్ టాపిక్ గా మారాడు. ఇక ఈ మూవీ కోసం ప్రస్తుతం భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. అయితే ఇందుకోసం నిఖిల్ (Nikhil) చాలా రిస్క్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

స్వయంభు కోసం నిఖిల్ యుద్ధ విద్యల్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నాడు. మేకర్స్ కూడా ఎంత ఖర్చయినా పెట్టేస్తున్నారు. తాజా యాక్షన్ సీక్వెన్స్ కోసం అయితే ఏకంగా 8 కోట్ల రూపాయలకు పైనే ఖర్చు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సుమారు 700 మంది జూనియర్ ఆర్టిస్టులు, ఇంకా ప్రధాన తారాగణం మీద 12 రోజుల పాటు ఈ సీక్వెన్స్ షూట్ చేస్తారట.. సినిమాలోని మేజర్ హైలైట్స్‌లో ఇదొకటి అవుతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. పైగా ఈ సీన్ కోసం వరల్డ్ బెస్ట్ టెక్నీషియన్స్ ని తెప్పించారని ఇటు నిఖిల్ స్వయంగా ఓ పోస్టర్ ను షేర్ చేయగా వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించిన స్టిల్ చూస్తే… వేలాది మంది జనం మధ్యలో యాక్షన్ చేస్తున్నట్లు అర్థం అవుతోంది. ఇదిలా ఉంటే నిఖిల్ సినిమాకి 8 కోట్లు పెట్టి భారీ యాక్షన్ సీన్ చేస్తున్నారంటే స్వయంభు మొత్తం బడ్జెట్ ఎంతో అని ఆశ్చర్యపోతున్నారు. చూడాలి మరి నిఖిల్ చేస్తున్న కసరత్తు.. సినిమాకు ఎంత కలెక్షన్ తీసుకొస్తుందో చూడాలి.