55000 థియేటర్ల రికార్డుకి… ఇంకా 18 నెలలే..? ఇంత ఫాస్టా..?

ప్రపంచ వ్యాప్తంగా 55 వేల థియేటర్స్ లోరిలీజ్ కాబోయే మొట్ట మొదటి ఇండియన్ సినిమా సూపర్ స్టార్ మహేవ్ బాబు 29 వ మూవీ. ఇది ఫిక్స్...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 21, 2025 | 04:30 PMLast Updated on: Apr 21, 2025 | 4:30 PM

Only 18 Months Left To Reach The Record Of 55000 Theaters So Fast

ప్రపంచ వ్యాప్తంగా 55 వేల థియేటర్స్ లోరిలీజ్ కాబోయే మొట్ట మొదటి ఇండియన్ సినిమా సూపర్ స్టార్ మహేవ్ బాబు 29 వ మూవీ. ఇది ఫిక్స్… ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 1750 ఐమ్యాక్స్ థియేటర్స్ అన్నీంట్లో కూడా ఆడబోయే మొదటి ఇండియన్ మూవీ కూడా మహేశ్ బాబుదే.. ఇది కూడా ఫిక్స్ అయ్యింది. అంతేకాకుండా ఐమ్యాక్స్ కెమెరాతో తెరకెక్కుతున్న మొదటి ఇండియన్ సినిమా కూడా ఎస్ ఎస్ ఎంబీ 29 మూవీనే… ఇది కూడా నిజమే అని కన్ఫామ్ అయ్యింది. ఇక ఇప్పుడు కొత్తగా కన్పామ్ అయ్యిందేంటంటే, ఈసినిమా రిలీజ్ డేట్… ఎగ్జాక్ట్ గా 18 నెలల తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు 29వ మూవీ రిలీజ్ కాబోతోంది. అంటే 2026 దసరా కి ఈ సినిమా వచ్చేస్తుందా? రెండు భాగాలను కలిపి 4 గంటల సినిమా తీయాలనుకుంటున్న రాజమౌైళి, 2027 లో ఈమూవీని రిలీజ్ చేయాలనుకున్నాడన్నారు. అది నిజం కాదా…? ఖచ్చితంగా ఈ డౌట్ రావనికి కారణం నాలుగో షెడ్యూల్ షూటింగ్ మొదలవటమే.. ఏదో జరగిపోతున్నట్టు రాజమౌలి సడన్ గా పరుగులు తీస్తున్నాడు.. ఎన్నడూ లేనంత వేగంగా షూటింగ్ చేస్తున్నాడు.. ఇంతకి ఏం జరుగుతోంది. తన నిర్ణయం ఎందుకు మారింది? హావేలుక్

ఒక ఇండియన్ మూవీ వరల్డ్ వైడ్ గా 55 వేల థియేటర్స్ లో రిలీజ్ అయితే ఎంత కలెక్షన్స్ వస్తాయి…? లెక్కేస్తే 5 వేల కోట్ల నుంచి 12 వేల కోట్ల మధ్యలో రోజుకి 5 షోల లెక్కన వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టే 55 వేల థియేటర్స్ లో రిలీజ్ కాబోయే ఫస్ట్ ఇండియన్ మూవీగా రికార్డుతో పాటు, సుమారు 10 వేల కోట్ల వసూళ్లని మొదటి రోజే కొల్లగొట్టే అవకాశం ఎస్ ఎస్ ఎమ్ బీ29 కి దక్కేలా ఉంది.మరి అలాంటి రికార్డుని, రిజల్ట్ ని ముందే సొంతం చేసుకున్నరాజమౌళి ఈ సినిమా కోసం ఎంత కష్టపడాలి… ఎంత గొప్పగా సినిమాను డిజైన్చేయాలి.. ఆ డిజైన్ చేసిన మూవీని అంతే పర్ఫెక్ట్ గా షూట్ చేయాలి.. కాబట్టి ఖచ్చితంగా టైం పడుతుంది. బాహుబలిలాంటి పాన్ ఇండియా ప్రాజెక్టుకే ఒక్కో భాగానికి రెండేళ్లు టైం తీసుకున్న రాజమౌళి, మరి పాన్ వరల్డ్ మూవీని తీసేందుకు కనీసం నాలుగేళ్లైనా టైం తీసుకుంటాడనుకున్నారు.

కాని ఇక్కడ సీన్ రివర్స్ లో కనిపిస్తోంది. కేవలం అంటే కేవలం మరో 18 నెలల్లో ఈ సినిమాషూటింగ్ పూర్తయ్యేలా ఉంది. అంతా షెడ్యూల్ ప్రకారం, వాయిదాల్లేకుండా షూటింగ్ జరుగుతోంది. ఈపాటికే మూడు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తైంది. సడన్ గా నాలుగో షెడ్యూల్ షూటింగ్ ని కూడా మొదలు పెట్టాడు రాజమౌలి. ఫారెస్ట్ అడ్వెంచర్స్, ఇండియన్ మైథాలజీ కనెక్షన్, భారీ ఫైట్ సీన్లు, ఏడు ఖండాలు, ఏడు వింతలు, 350 కోట్లతో గ్రాఫిక్స్ కే భారీ ఖర్చు.. ఇన్ని ఉంటే షూటింగ్ మరింత కాంప్లెక్స్ గా మారుతుంది. అయినా జెట్ స్పీడ్ తో ఎస్ ఎష్ ఎమ్ బీ 29ని తెరకెక్కిస్తున్నాడు.

రెండు భాగాలుగా తీయాలనుకున్న సినిమాను కుదించి, 4 గంటల డ్యూరేషన్ వచ్చినా పర్లేదని ఒకే భాగంగీ తీస్తున్న రాజమైళి ఎట్టిపరిస్తితుల్లో వచ్చే ఏడాది దసరాకే ఏదో బాంబు పేల్చేలా ఉన్నాడు. ఈ వేగం ఇలానే కంటిన్యూ అయితే నెక్ట్స్ ఇయర్ దసరాకు సినిమారావొచ్చు… కాకపోతే గ్రాఫిక్స్ వర్క్ డిలే అయితే ఎలా అన్న కోణంలో 2027 ఏప్రిల్ 14 ని బ్యాకప్ ప్లాన్ గా పెట్టుకున్నారట. సో 18 నెలల తర్వాత అంటే ఈ దసరా కాకుండా, వచ్చే ఏడాది దసరా కి ఎస్ ఎస్ ఎమ్ బీ 29 వస్తే మాత్రం అదో వండరే…