NTR విశ్వరూపం… మర్చిపోలేనంతగా ఏం నేర్పించాడు..

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ మరోసారి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని పొగడ్తలతో ఆకాశానికెత్తాడు. మొన్నటికి మొన్న తన ఫేవెరెట్ కో ఆస్టార్ ఎన్టీఆర్ అన్నా తను, తారక్ ని వెరీ గుడ్ హ్యాూమన్ బీయింగ్ అన్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 14, 2025 | 02:24 PMLast Updated on: Apr 14, 2025 | 2:24 PM

Ntr Works Hard For War 2

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ మరోసారి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని పొగడ్తలతో ఆకాశానికెత్తాడు. మొన్నటికి మొన్న తన ఫేవెరెట్ కో ఆస్టార్ ఎన్టీఆర్ అన్నా తను, తారక్ ని వెరీ గుడ్ హ్యాూమన్ బీయింగ్ అన్నాడు. కట్ చేస్తే వారం గ్యాప్ లో మరోసారి మ్యాన్ ఆఫ్ మాసెస్ మీద స్వీట్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఆ వీడియా లానే, ఈ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలైంది. ఎన్టీఆర్ ని చూసి తాను చాలా నేర్చుకున్నానన్న హ్రితిక్ మాటలు, సోషల్ మీడియాలో తూటాల్లా పేలాయి. త్రిబుల్ ఆర్ తో గ్లోబల్ గా ఫోకసై, దేవరతో రెండో పాన్ ఇండియా హిట్ సొంతం చేసుకున్న తారక్, ఎందుకు బాలీవుడ్ సినిమా చేశాడని చాలా మంది మొదట్లోకామెంట్ చేశారు. వార్ 2 లో నెగెటీవ్ రోల్ వేయాల్సిన అవసరమేంటనే కామెంట్లు మొదట్లో వచ్చినా, ఇప్పుడిప్పుడే ఎన్టీఆర్ నిర్ణయంలో లోతెంతో జనానికి అర్ధమౌతోంది. వార్ 2 మూవీలో హీరో హ్రితికే అయినా, హీరోయిజం మాత్రం ఎన్టీఆర్ దే వైరలౌతోంది..

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో బాలీవుడ్ గ్రీక్ గాడ్ చేసిన మూవీ వార్ 2. కేవలం ప్యాచ్ వర్క్ తోపాటు సగం షూటింగ్ పూర్తి చేసుకున్న పాట షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్. ఐతే ఈ సినిమా తో హ్రతిక్ కి, ఎన్టీఆర్ కి మంచి బాండింగ్ క్రియేట్ అయినట్టుంది. ఈమధ్య ఏ చిన్న ఈవెంట్ కి హ్రితిక్ వెళ్లినా ఎన్టీఆర్ నామస్మరణే చేస్తున్నాడు

మొన్నేమో ఎన్టీఆర్ తన ఫేవరెట్ కో స్టార్ అన్నాడు. తన లాంటి కోస్టార్ ని చూడలేదని తెగ మెచ్చుకున్నాడు. కట్ చేస్తే ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ జపం చేశాడు. ఓ ఇంటర్వూలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ని చూసి తాను ఎంతో నేర్చుకున్నానన్నాడు. ఇవన్నీ బాలీవుడ్ జనానికే కాదు, నార్త్ ఇండియన్స్ కి కూడా కిక్ ఇస్తున్నాయి

ఎందుకంటే బాలీవుడ్ లో పుట్టి పెరిగిన అక్కడి స్టార్స్ కి కూడా ఎన్టీఆర్ కి ఉన్నంత మాస్ ఫాలోయింగ్ లేదు… ఆవిషయంలో స్టోరీ సెలక్షన్, పెర్ఫామెన్స్ ఇలా చాలా విషయాల్లో డెఫినెట్ గా ఎన్టీఆర్ దేశ ముదురు కాదు, ప్రపంచ ముదురని ప్రూవ్ అయ్యింది.

టెంపర్, జై లవకుశలో తన పెర్పామెన్స్ కి సౌత్ లోనే కాదు, హిందీ డబ్ వర్షన్ వల్ల నార్త్ లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. త్రిబుల్ ఆర్, దేవర లాంటి పాన్ ఇండియా హిట్లు పడ్డాక ఎందుకు వార్ 2 మూవీలో ఎన్టీఆర్ నెగెటీవ్ రోల్ చేసినట్టనే వాళ్లకి, ఇప్పుడిప్పుడే విషయం బోధపడుతున్నట్టుంది

నిజానికి రామ్ చరణ్ జంజీర్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు, ఎందుకుహిందీ మూవీ చేశాడని కామెంట్ చేశారు. ఎన్టీఆర్ వార్ 2 మూవీ చేస్తున్నప్పుడు కూడా చరణ్ చేసిన తప్పే ఎన్టీఆర్ చేస్తున్నాడన్నారు. కాని వార్ 2 మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వటం, అది కూడా విలన్ గా కనిపించబోతుండటం ఎంత తెలివైన నిర్ణయమో ఇప్పుడిప్పుడే అందరికీ అర్ధమౌతోంది

ధూమ్ సీరీస్ లో ఏది చూసినా అందులో హీరో అభిషేక్ బచ్చనే… జాన్ అబ్రహం, హ్రితిక్ రోషన్, అమీర్ ఖాన్ ఇలా ముగ్గురు మూడు సీక్వెల్స్ లో విలన్ రోల్ వేశారు. కాని నిజానికి అందులో అసలైన హీరోలంటే వీళ్లే… అభిషేక్ పేరుకే హీరో… సో అంత క్లారిటీ ఉంది కాబట్టే, నటుడిగా ఫ్యాన్స్ ఏం కావాలో తెలిసే, వార్2 లో నెగెటీవ్ రోల్ లో తన యాక్టింగ్ స్కిల్స్ టేస్ట్ చేయించబోతున్నాడు తారక్.