మెంటల్ మాస్ కాంబినేషన్.. రామ్ చరణ్ అభిమానుల్ని బతకనిస్తారా లేదా..?
ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో రెండు మూడు సినిమాలు సెట్ చేసుకుంటున్నాడు రామ్ చరణ్. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత వచ్చిన అనుకోని గ్యాప్ ఇకమీద కనిపించకూడదని ఆయన మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు.

ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో రెండు మూడు సినిమాలు సెట్ చేసుకుంటున్నాడు రామ్ చరణ్. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత వచ్చిన అనుకోని గ్యాప్ ఇకమీద కనిపించకూడదని ఆయన మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు. అందుకే వరుస సినిమాలు ఓకే చేస్తున్నాడు మెగా వారసుడు. అలాగని ఏ కథపడితే ఆ కథ ఒప్పుకోవడానికి అసలు సిద్ధంగా లేడు చరణ్. ఆల్రెడీ గేమ్ చేంజర్ సినిమాతో చాలా పెద్ద రిస్క్ తీసుకొని ఫ్లాప్ అయ్యాడు ఈయన. వరుస ప్లాపులు ఉన్నా కూడా.. శంకర్ అనే బ్రాండ్ నమ్మి గేమ్ చేంజర్ సినిమా చేశాడు రామ్ చరణ్. కానీ అది ఆయన కెరీర్ నే చేంజ్ చేసే రేంజ్ లో డిజాస్టర్ అయింది. అందుకే ఇకపై బ్రాండ్ కాదు పూర్తిగా కథను నమ్మాలని ఫిక్స్ అయిపోయాడు ఈ హీరో. ఈ క్రమంలోనే ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా షూటింగ్ ఊహించిన దాని కంటే వేగంగా జరుగుతుంది. నవంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసి.. మార్చి 27న సినిమా విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు. ఇందులో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండకపోవచ్చు. షూటింగ్ కూడా ప్లాన్ ప్రకారం చేస్తున్నాడు బుచ్చిబాబు.
దీని తర్వాత సుకుమార్ సినిమా సెట్స్ మీదికి రానుంది. అన్ని కుదిరితే 2026 ఏప్రిల్ నుంచి సుక్కు, చరణ్ సినిమా మొదలు కానుంది. దీన్ని ఏడాదిలో పూర్తి చేసి 2027 సమ్మర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత రామ్ చరణ్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే విషయం మీద చాలా రోజుల నుంచి చర్చ జరుగుతుంది. చాలామంది దర్శకుల పేరు వినిపించిన కూడా ఇప్పుడు ఒక సెన్సేషనల్ దర్శకుడు పేరు తెర మీదకు వచ్చింది. ఆయన ఎవరో కాదు సందీప్ రెడ్డి వంగ.. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో రికార్డులన్నింటినీ వంగబెట్టి కుదేశాడు వంగ. దాంతో సందీప్ తో సినిమా చేయాలని చాలామంది స్టార్ హీరోలు వేచి చూస్తున్నారు. ప్రస్తుతం ఈయన ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమాతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు రానుంది. కేవలం 90 రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ పూర్తి చేసి.. ఏడాదిలోపే సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు సందీప్. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ అంత పూర్తి కావడంతో ప్రభాస్ రావడమే తరువాయి. ఆయన రాగానే షెడ్యూల్స్ వేసి చకచకా షూటింగ్ పూర్తి చేయనున్నాడు ఈ దర్శకుడు.
దీని తర్వాత అల్లు అర్జున్ తో సందీప్ రెడ్డివంగా కమిట్మెంట్ ఉంది. కానీ బన్నీ ప్రస్తుతం అట్లీతో పాటు త్రివిక్రమ్ సినిమాలు కూడా చేయాలి. ఈ రెండు భారీ ప్రాజెక్టులే. ఇవి పూర్తయ్యేసరికి ఎంత లేదన్న కనీసం మూడు సంవత్సరాలైనా పడుతుంది. అప్పటివరకు సందీప్ రెడ్డి వంగ ఖాళీగా ఉండలేడు.. అందుకే బుచ్చిబాబు, సుకుమార్ లతో సినిమాలు పూర్తి అయిన తర్వాత.. రామ్ చరణ్ తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు సందీప్ వంగా. ఇప్పటికే ఇద్దరు టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. కథ ఫైనల్ కాలేదు కానీ.. సందీప్ చెప్పిన లైన్ మాత్రం రామ్ చరణ్ ను బాగా ఎగ్జైట్ చేసిందని తెలుస్తుంది. పైగా ఇప్పుడు ఫుల్ ఎక్స్పరిమెంటల్ మోడ్ లో ఉన్నాడు రామ్ చరణ్. తన నటనకు పరీక్ష పెట్టే ఎలాంటి క్యారెక్టర్ వచ్చినా కూడా వదులుకునే పరిస్థితిలో ఈయన లేడు. అందుకే సందీప్ వంగ చెప్పిన లైన్ కు కూడా వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. అన్ని వర్కౌట్ అయ్యి.. రామ్ చరణ్, సందీప్ రెడ్డి వంగ సినిమా గాని సెక్స్ మీదికి వచ్చిందంటే మాత్రం ఇండియన్ స్క్రీన్ మీద ఒక మెంటల్ మాస్ కాంబినేషన్ చూడొచ్చు. ఇది జరగాలని అభిమానులు మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు. చూడాలి మరి.. జరుగుతుందో లేదో..?