‘Vishwambhara’ : ‘విశ్వంభర’ మేజర్ షెడ్యూల్ మొదలు

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటింగ్ మూవీ ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఆద్యంతం సోషియో పాంటసీ బ్యాక్‌డ్రాప్ తో రూపొందుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 23, 2024 | 04:30 PMLast Updated on: May 23, 2024 | 4:30 PM

Megastar Chiranjeevis Most Awaited Movie Vishwambhara

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటింగ్ మూవీ ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఆద్యంతం సోషియో పాంటసీ బ్యాక్‌డ్రాప్ తో రూపొందుతోంది. మొదట్లో చిరంజీవి లేకుండానే మారేడుమిల్లి ఫారెస్ట్ లో ఒక షెడ్యూల్ పూర్తిచేసుకుంది ఈ చిత్రం. చిరు సెట్స్ లోకి అడుగుపెట్టినప్పటి నుంచీ షూటింగ్ లో స్పీడు మరింత పెరిగింది. ఇప్పటికే ఈ సినిమాకోసం ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ ను సైతం తెరకెక్కించారు.

నేటి నుంచి ‘విశ్వంభర’ కొత్త షెడ్యూల్ మొదలైంది. జూలై చివరి వరకూ సాగే ఈ లెందీ షెడ్యూల్ తో దాదాపు ‘విశ్వంభర’ షూటింగ్ మొత్తం పూర్తవుతోందట. ఈ షెడ్యూల్ లో చిరంజీవి, త్రిషతో పాటు.. మిగతా తారాగణం అంతా పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. ఇక.. చిరంజీవి గతంలో నటించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ తరహాలో ఈ సినిమా కథ సిద్ధం చేశాడట వశిష్ట. అలాగే.. చిరు మార్క్ కామెడీ ఉంటూనే.. ఫ్యామిలీ ఎమోషన్స్ కు పెద్ద పీట వేసినట్టు ప్రచారం జరుగుతుంది.

‘విశ్వంభర’ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఆస్కార్ విజేత కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. చోటా కె.నాయుడు సినిమాటోగ్రాఫర్. ఆద్యంతం విజువల్ ఎఫెక్ట్స్ తో విజువల్ వండర్ లా ‘విశ్వంభర’ రెడీ అవుతోంది. వచ్చే జనవరి 10న సంక్రాంతి కానుకగా ‘విశ్వంభర’ విడుదలకానుంది.