అల్లు అర్జున్ కోసం ఐరన్ మాన్, సూపర్ మాన్ అందరు వస్తున్నారుగా.. ఏకంగా 800 కోట్లతో..!
చాలా రోజుల నుంచి వార్తల్లో ఉంటున్న అల్లు అర్జున్, అట్లీ సినిమాను ఎట్టకేలకు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. త్రివిక్రమ్ కంటే ముందు ఏదో ఒక మాస్ సినిమా చేయడానికి అల్లు అర్జున్ ఇన్ని రోజులు ట్రై చేస్తున్నాడు అనుకున్నారు కానీ.

చాలా రోజుల నుంచి వార్తల్లో ఉంటున్న అల్లు అర్జున్, అట్లీ సినిమాను ఎట్టకేలకు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. త్రివిక్రమ్ కంటే ముందు ఏదో ఒక మాస్ సినిమా చేయడానికి అల్లు అర్జున్ ఇన్ని రోజులు ట్రై చేస్తున్నాడు అనుకున్నారు కానీ.. తాజాగా అనౌన్స్మెంట్ వీడియో చూసిన తర్వాత బన్నీ ఏ రేంజ్ సినిమా చేస్తున్నాడు అనేది అర్థమవుతుంది. ఇండియన్ సినిమా ఇప్పటివరకు కలలో కూడా చూడని ఒక మాస్ ఎంటర్టైనర్ కోసం ప్లాన్ చేస్తున్నారు అల్లు అర్జున్, అట్లీ. తమ ఆనౌన్స్మెంట్ తోనే సినిమా స్థాయి చెప్పకనే చెప్పారు. ఈ సినిమా కోసం పూర్తిగా హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ఐరన్ మాన్, సూపర్ మాన్, అవతార్ లాంటి భారీ హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన విజువల్ ఎఫెక్ట్స్ టీం ఈ సినిమాకు పని చేస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాను ఒకటి రెండు కాదు ఏకంగా 800 కోట్లతో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. AA22XA6 అనే వర్కింగ్ టైటిల్ తో మొదలైంది ఈ సినిమా. అమెరికాలోని ప్రత్యేక విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలన్నింటినీ చుట్టేసారు అల్లు అర్జున్, అట్లీ. అక్కడ పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ను కలిసి తమ కథను చెప్పి.. సినిమాకు కావాల్సిన అన్ని విషయాల గురించి మేకింగ్ వీడియోలో పొందుపరిచారు దర్శక నిర్మాతలు.
ఇది చూస్తుంటేనే సినిమా రేంజ్ అర్థమైంది. కచ్చితంగా ఇంతకు ముందు ఇండియన్ స్క్రీన్ మీద ఎవరు చేయని ఒక మాస్ మ్యాజిక్ చేయాలని ఫిక్స్ అయిపోయారు అల్లు అర్జున్, అట్లీ. అక్కడే అల్లు అర్జున్ 3d స్కానింగ్ కూడా చేశారు. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం పూర్తిగా హాలీవుడ్ నుంచి ఇండియాకు వస్తున్నారు. అంతేకాదు విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కూడా అల్లు అర్జున్, అట్లీ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. కచ్చితంగా విఎఫ్ఎక్స్ పరంగా ఇండియన్ సినిమాలో సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేయడానికి రెడీ అవుతున్నారు ఈ ఇద్దరు. మే నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇంత పెద్ద సినిమా షూటింగ్ కేవలం ఒక ఏడాదిలోనే పూర్తి చేయాలని చూస్తున్నాడు అట్లీ. అది కష్టం అని తెలుసు కానీ కచ్చితంగా పూర్తి చేయాలి అనేది అల్లు అర్జున్ కండిషన్. ఎందుకంటే ఈయన కోసం త్రివిక్రమ్ స్టోరీ సిద్ధం చేస్తున్నాడు.
వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి త్రివిక్రమ్ కథ సిద్ధం కానుంది. అది పూర్తిగా మైథలాజికల్ సబ్జెక్ట్. కార్తికేయ స్వామి నేపథ్యంలో ఈ సినిమా కథ రాస్తున్నాడు మాటల మాంత్రికుడు. ఆ సినిమా బడ్జెట్ కూడా దాదాపు 600 కోట్ల వరకు ఉండబోతుంది. కుదిరితే ఒక పార్ట్ లేదంటే రెండు భాగాలుగా ఆ సినిమా తెరకెక్కించాలి అని ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఆలోపు అట్లీ సినిమా పూర్తి చేయాలి అనేది అల్లు అర్జున్ ఆలోచన. అట్లీ సినిమా కోసం 200 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటు బిజినెస్ లో వాటా తీసుకుంటున్నాడు అల్లు అర్జున్. మన వైపు దర్శకుడు కూడా దాదాపు 80 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. మరి ఈ ఇద్దరు కలిసి చేయబోయే ఆ మ్యాగ్నమోపస్ ఎలా ఉండబోతుందో చూడాలి.