3వ యానిమల్ NTR.. 4వ యానిమల్ చరణ్… నాటు నాటు సెన్సేషన్..

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలిసి స్టెప్పేస్తే, నాటు నాటు పాటకి, హాలీవుడ్ ఊగిపోయింది. దెబ్బకి కీరవాణి ఎకౌంట్ లో ఆస్కార్ అవార్డు వచ్చిపడింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 17, 2025 | 09:30 PMLast Updated on: Apr 17, 2025 | 9:30 PM

3rd Animal Ntr 4th Animal Charan Natu Natu Sensation

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలిసి స్టెప్పేస్తే, నాటు నాటు పాటకి, హాలీవుడ్ ఊగిపోయింది. దెబ్బకి కీరవాణి ఎకౌంట్ లో ఆస్కార్ అవార్డు వచ్చిపడింది. అలాంటి కాంబినేషన్ మళ్లి సెట్ అవ్వాలంటే త్రిబుల్ ఆర్ సీక్వెల్ తోనే సాధ్యం… రాజమౌళి అడుగు ముందుకేస్తేనే ఇలాంటి సెన్సేషన్ రిపీట్ అవుతుంది. కాని త్రిబుల్ ఆర్ 2 వస్తుందని, జక్కన్న ప్లాన్ చేస్తాడని ఎవరికీ నమ్మకం లేదు. తను మాత్రం మహేశ్ బాబు తో 1000 కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తున్నాడు. ఐ మ్యాక్స్ కెమెరాతో తెరకెక్కే ఫస్ట్ ఇండియన్ మూవీతో బిజీ అయ్యాడు. కాబట్టి ఎన్టీఆర్, చరణ్ ఇద్దరితో నాటు నాటు రేంజ్ సెన్సేషన్ ఇప్పట్లో కష్టమే… కాని ఆ కష్టాన్ని, సాధ్యంగా మార్చబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ. సుకుమార్ లాంటి డైరెక్టర్ పుష్ప రెండు భాగాలతో దుమ్ముదులిపినా, చరణ్ ని, ఎన్టీఆర్ ని ఒకే తెరపై చూపించే సాహసం చేయలేకపోతున్నాడు. రాజమౌళి రేంజ్ రిస్క్ తీసుకోలేకపోతున్నాడు. కాని సందీప్ రెడ్డి అసలు సిసలైన యానిమల్ పార్క్ చూపించేందుకు పులిని, సింహాన్ని ఒకే దగ్గరికి తీసుకొస్తున్నాడు.. అదేంటో చూసేయండి.

నాటు నాటు పాటకి వరల్డ్ ఎంతగా ఊగిపోయిందో చూశాం. అమెరికన్ థియేటర్స్ లో, యూరోపియన్ థియేటర్స్ లో అక్కడి జనం ఇండియన్స్ లా సిల్వర్ స్క్రీన్ దగ్గరకెళ్లి మరీ డాన్స్ చేశారు. అంతగా నాటు నాటు పాట ఈ ప్రపంచానికి కిక్ ఇచ్చింది. ఎగ్జైట్ చేసింది. అలా త్రిబుల్ ఆర్ తో హాలీవుడ్ స్టార్స్ కూడా ఇటు వైపు చూసే ఎన్టీఆర్ , రామ్ చరణ్ కి గుర్తింపు దక్కింది.మళ్లీ అలాంటి సీనే రిపీట్ అయ్యేలా ఉంది. దీనికి కేరాఫ్ అడ్రస్ రాజమౌళి కాదు, సందీప్ రెడ్డి వంగ…ఔను రెబల్ స్టార్ ప్రభాస్ తో జులైలో స్పిరిట్ షూటింగ్ ప్లాన్ చేసుకున్న సందీప్ రెడ్డి వంగ, తర్వాత యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ తీస్తాడన్నారు.

కాని ఈ లోపు ఎన్టీఆర్ ని కలిశాడు. రామ్ చరణ్ తో కథ చర్చ లు చేశాడు. విచిత్రం ఏంటంటే రామ్ చరణ్ తో సందీప్ రెడ్డి వంగ సినిమా సెట్స్ పైకెళ్లబోతోందని ప్రచారం పెంచారు. కాని అది ఇప్పటికిప్పుడైతే సాధ్యంకాదని తేలింది. మెగా పీఆర్ టీం ఇవన్నీ రూమర్స్ అని తేల్చింది..అలాని తెరవెనక మారుతోన్న ఈక్వేషన్స్ విషయానికొస్తే, మైండ్ బ్లాంక్ అయ్యే ప్రాజెక్టేదో ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. స్పిరిట్ తర్వాత యానిమల్ పార్క్ ఉండకపోవచ్చనే మాటే బలపడుతోంది. ఎందుకంటే ఆల్రెడీ ఎన్టీఆర్ ని ముంబై లోరెండు సార్లు, హైద్రబాద్ లో ఒక సారి కలిసి, ఫ్యూచర్ ప్రాజెక్ట్ కథ మీద డిస్కర్స్ చేశాడు సందీప్ రెడ్డి వంగ..

ఇంతలో సీన్ లోకి రామ్ చరణ్ వచ్చేసరికి, బన్నీ ఆఫర్ ని పక్కన పెట్టి చరణ్ తో సినిమా చేస్తాడనే ప్రచారం మొదలైంది. కాని రియాలిటీ చెక్ చేస్తే, నాటు నాటు కాంబినేషన్ లోనే పాన్ వరల్డ్ మూవీ తీస్తే హాలీవుడ్,యూరప్ మార్కెట్ లో ఈజీ రీచ్ ఉంటుందనే, సందీప్ రెడ్డి వంగ మల్టీ స్టారర్ కథ చెప్పాడట. ఎలాగూ ఇద్దరూ కలిసి త్రిబుల్ ఆర్ చేశారు. హిట్ మెట్టెక్కారు. ఇద్దరి మధ్యలో మంచి స్నేహం కూడా ఉంది.. సో తన దగ్గరుకన్న మల్టీ స్టారర్ మాస్ మూవీకి వీళ్లే కరెక్ట్ అని ఇలా మూడు నెలలుగా ఒక్కో పావు కదుపుతున్నాడట సందీప్ రెడ్డి వంగ.