200 కోట్లు యూఎస్ రికార్డ్.. 350 కోట్ల రెమ్యునరేషన్.. 50 కోట్ల గిఫ్ట్…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ లో పూనకాలొచ్చేటైమైందా..? ఆగస్ట్ 14 వరకు వార్ 2 మూవీ వచ్చే ఛాన్స్ లేదు... అయినా రిలీజ్ కి రెడీ అయిన మూవీతో కాదు... ఇంకా సెట్లో ఉన్నసినిమానే సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ లో పూనకాలొచ్చేటైమైందా..? ఆగస్ట్ 14 వరకు వార్ 2 మూవీ వచ్చే ఛాన్స్ లేదు… అయినా రిలీజ్ కి రెడీ అయిన మూవీతో కాదు… ఇంకా సెట్లో ఉన్నసినిమానే సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది. ఎన్టీఆర్ మ్యాజిక్ ప్రశాంత్ నీల్ కి అర్ధమైనట్టుంది. ఈనెల 22న డ్రాగన్ సెట్లోకి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అడుగు పెట్టబోతున్నాడు. కాని ఈలోపే ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు రికార్డులు తన ఎకౌంట్లో పడేలా ఉన్నాయి. యూఎస్ రైట్స్ తో 200 కోట్ల షాక్ ఇస్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. రెమ్యునరేషన్ విషయంలో రెబల్ స్టార్ నే మించేలా కనిపిస్తున్నాడు. 1400 కోట్లు రాబట్టిన కేజీయఫ్2, 800 కోట్లు రాబట్టిన సలార్ రికార్డులు ప్రశాంత్ నీల్ ఎకౌంట్ లో ఉన్నా, తనకే మైండ్ బ్లాక్ అవుతోంది.. ఎన్టీఆర్ వల్ల డ్రాగన్ షూటింగ్ మొదలైన వెంటనే, వందలకోట్ల ప్రీరిలీజ్ డీల్స్ షాక్ ఇస్తున్నాయి.. అవేంటో చూసేయండి.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ ఎప్పుడు సెన్సేషనే అవుతుంది. మొన్నటి వరకు తమిళ సూపర్ స్టార్ లేదంటే, కింగ్ ఖాన్ షారుఖ్ వీళ్లే 120 నుంచి 150 కోట్లు తీసుకుంటూ వచ్చారు. తర్వాత సీన్ లో కి రెబల్ స్టార్ ప్రభాస్ 100 కోట్ల నుంచి 350 కోట్ల వరకు తీసుకునే రేంజ్ కి ఎదిగాడు. ఇప్పడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆరికార్డుని కూడా బ్రేక్ చేసేలా ఉన్నాడు. దానికి ఇంకా షూటింగ్ 10 శాతం కూడా పూర్తి కాని డ్రాగన్ మూవీనే కారణం..
ప్రశాంత్ నీల్ అంటేనే కేజీయఫ్ రెండు బాగాలు, సలార్ లాంటి హ్యాట్రిక్ పాన్ ఇండియా హిట్లే గుర్తొస్తాయి…అలాంటి దర్శకుడితో రెండు పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా అంటే, పూనకాలు ముందే మొదలవ్వాలి…అదే జరుగుతోంది. ఇంతవరకు ఎన్టీఆర్ డ్రాగన్ సెట్లో అడుగుపెట్టలేదు… కానీ ఈలోపే యూఎస్ రైట్స్ సెన్సేషనల్ ఎమౌంట్ ని రాబట్టేశాయి.
ఈనెల 22 నుంచి డ్రాగన్ సెట్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అడుగుపెట్టబోతున్నాడు.. ఆల్రెడీ తను లేని సీన్లు తీస్తున్న ప్రశాంత్ నీల్, ఇప్పటి వరకు అలా ఈ గ్యాప్ లో టైం ని సేవ్ చేశాడు. అయితే ఈ మూవీ ఓవర్ సీస్ రైట్స్ డీట్ ఇప్పుడు ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఇంతవరకు ఏ ఇండియన్ మూవీకి రానంతగా భారీ ధర యూఎస్ రైట్స్ పలికాయి…
డ్రాగన్ అన్ని భాషల యూఎస్ సీస్ రైట్స్ 200 కోట్లు పలికాయట. సలార్, కల్కీ 2 మూవీలను డిస్ట్రిబ్యూట్ చేసిన ముగ్గురు ఇండో అమెరికన్లు, డ్రాగన్ యూఎస్ రైట్స్ ని 200 కోట్లకు సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. యూఎస్ రైట్స్ లో 25 శాతం ఎన్టీఆర్ కి అదనపు షేర్ రూపంలో దక్కుతోంది. అంటే 50 కోట్లు ఆల్రెడీ వచ్చేసినట్టే..
ఆల్రెడీ 350 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఎన్టీఆర్ కి ఇప్పుడు యూఎస్ రైట్స్ లో వాటా 50కోట్లు తోడవటంతో, 400 కోట్ల క్లబ్ లో చేరిన హీరోగా మారబోతున్నాడు. సో అలా చూస్తే రెబల్ స్టార్ ప్రభాస్ తీసుకునే 350 కోట్ల రెమ్యునరేషన్ ని ఎన్టీఆర్ మించినట్టే అనితేలుతోంది.ఇదే షాకింగ్ న్యూస్ అనుకుంటే, ఈనెల 22న డ్రాగన్ సెట్లో ఎన్టీఆర్ అడుగుపెడితే, వచ్చే ఏడాది సమ్మర్ లో అంటే ఏప్రిల్ 14న డ్రాగన్ థియేటర్స్ లో అడుగుపెడుతుందట. సంక్రాంతి నుంచి సమ్మర్ కి అచ్చంగా కేజీయఫ్ 2 రిలీజ్ అయిన తేదీకి డ్రాగన్ రిలీజ్ అవుతుందట.