సూపర్ స్టార్ కి 12000 కోట్ల స్వీట్ వార్నింగ్.. ఇక సెట్ అరెస్టే…

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎప్పుడైతే రాజమౌలి తో సినిమా కమిటయ్యాడో, అప్పడే ఈ హీరో ఖేల్ ఖతమ్ అన్నారు. ఇక ఫ్యాన్స్ ని కనీసం రెండేళ్లవరకు చూడలేడని ఫిక్స్ అయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 17, 2025 | 08:30 PMLast Updated on: Apr 17, 2025 | 8:30 PM

12000 Crore Sweet Warning To The Superstar And Now The Set Is Arrested

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎప్పుడైతే రాజమౌలి తో సినిమా కమిటయ్యాడో, అప్పడే ఈ హీరో ఖేల్ ఖతమ్ అన్నారు. ఇక ఫ్యాన్స్ ని కనీసం రెండేళ్లవరకు చూడలేడని ఫిక్స్ అయ్యారు. కట్ చేస్తే ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్ తో పోలిస్తే, మహేశ్ కి అస్సలు నిబంధనలు వర్తించవని తేలింది. మొన్న యాడ్స్ లో కనిపించాడు. నిన్న షూటింగ్ మధ్యలో వెకేషన్ కి వెళ్లి వచ్చాడు. ఇప్పుడు ఇంటర్ నేషనల్ ప్రెస్ మీట్ టైంలో నాలుగో షెడ్యూల్ షూటింగ్ కి రెడీ అవుతున్నాడు. అయితే ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ తో రాజమౌళి సినిమాలు తీసినప్పుడు, ఎన్నడూ వాల్లని ఇలా మహేశ్ బాబు కి ఇచ్చిన ఫ్రీడమ్ ఇవ్వలేదు. అసలు షూటింగ్ మొదలైతే, షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టే వరకు హీరోలని బయటికి వదల్లేదు. వెకేషన్లు, అకేషన్లు అన్నీ క్యాన్సిల్… కాని సూపర్ స్టార్ మాత్రం రాజమౌళి సినిమా మొదలయ్యాక, నచ్చినట్టు యాడ్స్ చేస్తున్నాడు. కుదిరినప్పుడు వెకేషన్ కి ఫారిన్ వెళ్లొస్తున్నాడు. అదే ఎలా అనే లోపు 12000 కోట్ల స్వీట్ వార్నింగ్ ఇచ్చేశాడు రాజమౌళి. ఇదే లాస్ట్ వార్నింగ్… వెంటనే సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫారిన్ వెకేషన్ ని సగంలోనే ముగించేశాడు… ఇంతకి సూపర్ స్టార్ కి రాజమౌళి ఇచ్చిన 12000 కోట్ల స్వీట్ వార్నింగ్ ఏంటి? హావేలుక్

సూపర్ స్టార్ మహేశ్ బాబు 29 వ మూవీ ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్ కి ఇంకా నాలుగు రోజులే టైం ఉంది. ఇంతవరకు ఏప్రిల్ 21న జరిగే ఈ మహా ప్రెస్ మీట్ ఎనౌన్స్ మెంట్ ఇవ్వలేదు రాజమౌళి టీం. అలాంటి టైంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు కి రాజమౌళి ఏకంగా 12000 కోట్ల స్వీట్ వార్నింగ్ ఇవ్వటం హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటి వరకు వచ్చిన చాలా రూమర్లు, ప్రచారాలకు బ్రేక్ పడినట్టైంది..అసలు సంగతేంటంటే, బాహుబలి రెండు బాగాలు చేసేప్పుడు ప్రభాస్ పూర్తిగా 4 ఏళ్లు సెట్ కే పరిమితమయ్యాడు. బాహుబలి ఫస్ట్ పార్ట్ రిలీజ్ టైంలో ప్రచారానికి బయటికొచ్చాడు. కాని మళ్లీ రెండో పార్ట్ పూర్తయ్యేవరకు తన దర్శన భాగ్యం సామాన్యులకే కాదు ఫ్యాన్స్ కి కూడా దక్కలేదు. తనెక్కడికి ఫారిన్ ట్రిప్ కో, వెకేషన్ కో వెళ్లలేదు.. పూర్తిగా ఆ నాలుగేళ్లు రాజమౌళి ఎలా చెబితే అలా సెట్స్ కి, షూటింగ్ లొకేషన్స్ కి పరిమితమయ్యాడు.

ఇక త్రిబుల్ ఆర్ టైంలో ఎన్టీఆర్, చరణ్ 3 ఏళ్లు ఈ సినిమా షూటింగ్ లొకేషన్ కే అంకితమయ్యాడు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అన్నీ త్యాగం. వెకేషన్ లేదు, ఇంపార్టెంట్ అకేషన్ లేదు.. అన్నీ లైట్ తీసుకుని త్రిబుల్ ఆర్ కోసమే కష్టపడ్డారు. ఏదో కరోనా లాక్ డౌన్ల వల్ల ఫ్యామిలీస్ తో టైం స్పెండ్ చేసే ఛాన్స్ చిక్కింది కాని, లేదంటే ఆ భాగ్యం కూడా ఎన్టీఆర్, చరణ్ కి దక్కేది కాదు.ఇలా ప్రభాస్ నుంచి ఎన్డీఆర్, రామ్ చరణ్ వరకు రాజమౌళి సినిమా అంటే అంతా సెట్స్ కే పరిమితమయ్యారు. కాని సూపర్ స్టార్ మహేశ్ బాబు మాత్రం హ్యాపీగా ఫ్యామిలీతో ఇటలీ టూరేసి వచ్చాడు. తన పాస్ పోర్ట్ లాక్కున్నట్టు రాజమౌళి పెట్టిన వీడియోకి కౌంటర్ గా తన పాస్ పోర్ట్ తనదగ్గరే ఉందనే ఫన్నీ వీడియోతో షాక్ ఇచ్చాడు.

ఇదే రాజమౌళి మూవీ షూటింగ్ 3 షెడ్యూల్లు పూర్తయ్యాక కూడా, కూతురు సితారతో కలిసి యాడ్ షూట్ లో మెరిశాడు. తన లుక్ రివీలైంది. అంతకుముందు షూటింగ్ సీన్ లీకైంది.. ఇన్ని జరిగినా రాజమౌళి స్ట్రిక్ట్స్ గా నిర్ణయం తీసుకోలేదా అంటే తీసుకున్నట్టేతెలుస్తోంది.ఆ నిర్ణయం వెనక 12000 కోట్ల రిస్క్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 55 వేల థియేటర్స్ లోరిలీజ్ కాబోతున్న తొలి ఇండియన్ మూవీ, ఐమ్యాక్స్ కెమెరాలో తెరకెక్కుతున్న ఫస్ట్ ఇండియన్ మూవీ, ఇలా ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. 55 వేల థియేటర్స్ లో సింగిల్ డే ఈ సినిమా ఆడితే 5000 కోట్ల నుంచి 12000 కోట్లు వచ్చేఛాన్స్ ఉంది. అలాంటి మూవీ విషయంలో రాజమౌళి రిస్క్ చేయడు. అందుకే ఈనెల 21 ప్రెస్ మీట్ తర్వాత రెండేళ్లు మహేశ్ బాబు పూర్తిగా సెట్స్ కే పరిమితమవుతాడట. సినిమా రిలీజ్ వరకు నో బ్రేక్స్, నో వెకేషన్స్, ఇది రాజమౌళి ఇచ్చిన స్వీట్ వార్నింగ్. అందుకే మళ్ళీ ఫ్యామిలీతో గడిపే టైం రాదనే, ఈ బ్రేక్ టైంలో వెకేషన్ కి వెళ్లి వచ్చాడట మహేశ్ బాబు. అంటే ఇక ముందు హౌజ్ అరెస్ట్ కాబోతుంటాడు కాబట్టే, ముందే వెకేషన్ తో రిలాక్స్ అయ్యి వచ్చాడని తెలుస్తోంది.