బ్రేకింగ్‌: లవర్‌తో కలిసి భర్తను చం*పేసిన యూట్యూబర్‌

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచమైన వ్యక్తి కోసం భర్తనే చంపేసింది ఓ యూట్యూబర్‌. హర్యానాకు చెందిన రవీనా, ప్రవీణ్‌ భార్యా భర్తలు. వీళ్లకు ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 16, 2025 | 04:25 PMLast Updated on: Apr 16, 2025 | 4:25 PM

Youtuber Who Killed Her Husband With Her Lover In Haryana

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచమైన వ్యక్తి కోసం భర్తనే చంపేసింది ఓ యూట్యూబర్‌. హర్యానాకు చెందిన రవీనా, ప్రవీణ్‌ భార్యా భర్తలు. వీళ్లకు ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. రవీనా ఓ యూట్యూబర్‌. కొంత కాలంగా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా బాగా యాక్టివ్‌గా ఉంటోంది. రీసెంట్‌గా రవీనాకు సురేష్‌ అనే యువకుడితో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది.

అతనితో రవీనా రీల్స్‌ చేసేది. కొంత కాలానికి వీళ్ల స్నేహం ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇదే క్రమంలో సురేష్‌తో రవీనా ఏకాంతంగా ఉన్న సమయంలో ప్రవీణ్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. దీంతో విషయం బయటికి రాకుండా ప్రియుడితో కలిసి అక్కడే భర్తను చంపేసింది రవీనా. తన దుపట్టాతో ప్రవీణ్‌కు ఉరి వేసి ఇద్దరూ కలిసి అతన్ని చంపేశారు. ఆ శవాన్ని మాయం చేసేందుకు రవీనా సురేష్‌ ఓ ప్లాన్‌ వేశారు. బైక్‌ మీద శవాన్ని దిన్నోడ్‌ రోడ్‌ అనే ప్రాంతానికి తీసుకువెళ్లింది.

అక్కడున్న కాలువలో శవాన్ని పడేసి ఇంటికి తిరిగి వచ్చింది. ప్రవీణ్‌ కనిపించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. దాదాపు వారం రోజుల తరువాత దిన్నోడ్‌ రోడ్‌ కాలువకు కాస్త దూరంలో ప్రవీణ్‌ శవం కనిపించింది. రవీనాను పోలీసులు అరెస్ట్‌ చేయడంతో అసలు విషయం బయటికి వచ్చింది. రీసెంట్‌గానే ఓ నేవీ ఆఫీసర్‌ను లవర్‌ కోసం చంపేసింది ఓ మహిళ. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ మర్డర్‌ గురించి మర్చిపోకముందే.. మరో మహిళ ప్రియుడి కోసం భర్తను చంపేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.