Home » Tag » TELANGANA
ఓడలు బళ్లవుతాయి... బళ్లు ఓడలవుతాయి... ఈ సామెత ఎమ్మెల్సీ కవితకు సరిగ్గా సరిపోతుంది. బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన కవిత ఇప్పుడు ఎక్కడా బతుకమ్మ వేడుకల్లో కనిపించడం లేదు.
తెలంగాణ మంత్రి కొండ సురేఖ.. కేటీఆర్ పై చేసిన ఆరోపణ దేశం మొత్తం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్ కన్వెన్షన్ కూల్చి వేయకుండా ఉండాలంటే, హీరోయిన్ సమంతనీ తన దగ్గరకు పంపాలని కేటీఆర్ డిమాండ్ చేసినట్లు కొండ సురేఖ ఆరోపిస్తున్నారు.
తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీని టీడీపీ దెబ్బ కొడుతుందా...? తమ నాయకులను లాక్కున్న గులాబీ పార్టీకి షాక్ ఇవ్వడానికి చంద్రబాబు రోడ్ మ్యాప్ సిద్దం చేసారా...? బీఆర్ఎస్ లో ఉండలేక అధికార కాంగ్రెస్, మరో ప్రతిపక్షం బిజెపిలోకి వెళ్ళలేక సతమవుతున్న ఎమ్మెల్యేలను కారు దింపి, బాబు సైకిల్ ఎక్కిస్తారా...?
తెలంగాణాలో హైడ్రా దూకుడు ఆగిందా...? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. తెలంగాణా ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మున్సిపల్ డెవెలప్మెంట్ అధారటీ పరిధిలో ఉన్న అన్ని చెరువులపై సమగ్ర సర్వేకు ఆదేశాలు ఇచ్చింది.
తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. సీఎం ఢిల్లీ పర్యట నేపథ్యంలో మరోసారి మంత్రివర్గ విస్తరణ చర్చల్లోకి వచ్చింది.
తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో ప్రదర్శిస్తున్న దూకుడుతో పాటుగా చేస్తున్న వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎవరు ఎన్ని విమర్శలు చేస్తున్నా తన దూకుడు మాత్రం తగ్గించడం లేదు రేవంత్ రెడ్డి.
తెలంగాణాలో ఇప్పుడు హైడ్రా దూకుడుతో జనాలకు కంటి మీద కునుకు లేకుండా పోయిన సంగతి తెలిసిందే. హైడ్రాకు చట్టబద్దత లేకుండానే కీలక భవనాలను నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే.
తిరుమల లడ్డు వ్యవహారం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య యుద్దానికి వేదిక కానుందా...? తమిళనాడు ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ పై పవన్ వ్యాఖ్యలు చేసారు అంటూ కేసు పెట్టడం వెనుక కారణం ఏంటీ...? ఇప్పుడు పవన్ కూడా కేసు పెట్టి కౌంటర్ ఇస్తారా...?
కుటుంబ గుర్తింపు మరియు కుటుంబ డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేసారు. హైదరాబాద్ నగరాన్ని కాపాడాలన్న ఉద్దేశంతోనే హైడ్రా, మూసీ ప్రాజెక్టును తీసుకొస్తున్నాం అని స్పష్టం చేసారు.
తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ హైడ్రా... కాంగ్రెస్ సర్కార్ కాస్త వెనకడుగు వేసినా జనంలోని అనుమానాన్ని తనవైపు తిప్పుకుంటూ బీఆర్ఎస్ చెలరేగిపోతోంది. కారు నేతలంతా మూసీ చుట్టు ప్రదక్షిణలు చేస్తూ హస్తాన్ని మురికినీటిలో ముంచడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. ఇంత కీలకమైన సమయంలో తెలంగాణ బీజేపీ కాడి వదిలేసింది. మధ్యలోకి నన్ను లాగొద్దన్నట్లుంది కమలం నేతల తీరు.