NTR కి ప్రేమతో… పాన్ వరల్డ్ సాహసం..

రెబల్ స్టార్ తో బాహుబలి, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ చరణ్ తో త్రిబుల్ ఆర్ తీసిన రాజమౌళి, ఇప్పుడు పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ తో బిజీ అయ్యాడు. బాహుబలిలో పాన్ ఇండియాని షేక్ చేసి, త్రిబుల్ ఆర్ తో గ్లోబల్ గా గుర్తింపు పొందాక, పాన్ వరల్డ్ మార్కెట్ మీద దాడికి రెడీ అయ్యాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 14, 2025 | 06:02 PMLast Updated on: Apr 14, 2025 | 6:02 PM

With Love For Ntr A Pan World Adventure

రెబల్ స్టార్ తో బాహుబలి, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ చరణ్ తో త్రిబుల్ ఆర్ తీసిన రాజమౌళి, ఇప్పుడు పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ తో బిజీ అయ్యాడు. బాహుబలిలో పాన్ ఇండియాని షేక్ చేసి, త్రిబుల్ ఆర్ తో గ్లోబల్ గా గుర్తింపు పొందాక, పాన్ వరల్డ్ మార్కెట్ మీద దాడికి రెడీ అయ్యాడు. అందుకు సూపర్ స్టార్ మహేశ్ బాబుని ఎంచుకున్నాడు.. మరి సుకుమార్ పరిస్థితేంటి? ఈలెక్కల మాస్టర్ కూడా తన పాన్ వరల్డ్ ప్రాజెక్టుకి హీరోని కన్పామ్ చేసుకన్నాడా? చరణ్ తో చేసేది పాన్ ఇండియా మూవీ అయితే, ఆతర్వాత పట్టాలెక్కేది పాన్ వరల్డ్ ప్రాజెక్టా..? ఈ డౌట్లకు కారణముంది. అచ్చంగా ప్రశాంత్ నీల్ కూడా కేజీయఫ్, సలార్ తర్వాత పాన్ వరల్డ్ డోర్లు తీసేందుకు రెడీ అయ్యాడు. అందుకు ఎన్టీఆర్ ని ఎంచుకున్నాడు. డ్రాగన్ మూవీని మొదలుపెట్టాడు. అలానే సుకుమార్ కూడా నాన్నకు ప్రేమతో కాంబినేషన్ ని 2027 లో రిపీట్ చేయబోతున్నాడా? ఈ డౌటే నిజమయ్యేలా ఉంది. లెక్కల మాస్టారి లెక్క తప్పే అవకాశం లేదని తెలుస్తోంది.

ఎన్టీఆర్ తో నాన్నకుప్రేమతో మూవీ తీశాక, రంగస్థలంతో రామ్ చరణ్, పుష్ప రెండు భాగాలతో బన్నీ ఇద్దరూ సుకుమార్ ని మూడు నాలుగేళ్లు లాగేసుకున్నారు. కట్ చేస్తు ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో సుకుమార్ సినిమా ఓకే అయ్యేలా ఉంది. ముందు రామ్ చరణ్ తో కమిటైన సినిమా పూర్తయ్యాకే ఈ కాంబినేషన్ లో సినిమా ఉండే ఛాన్స్ఉంది. అది మాత్రం పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ మూవీనే అంటున్నారు. అందుకు రాజమౌళినే ఎగ్జాంపుల్ అనంటున్నారు.

ఎందుకంటే రాజమౌలి బాహుబలి తో సౌత్ నార్త్ కి మధ్య ఉన్న గోడలు కూల్చాడు. బాహుబలి 2 తో 1850 కోట్ల వసూళ్ళను ఆతర్వాత త్రిబుల్ ఆర్ తో ఆస్కార్ ఇలా నెక్ట్స్ లెవల్ కి వెళుతూ వచ్చాడు. అలాచూస్తే పుష్ప1 తో సుకుమార్ ఫస్ట్ పాన్ ఇండియా హిట్ సొంతమైంది. పుష్ప2 తో1800 కోట్ల వసూల్ల రికార్డు సొంతమైంది. అంటే బాహుబలి 2 ని పుష్ప2 తో పోల్చొచ్చు..

అలా చూస్తే ఇప్పుడు రామ్ చరణ్ తో సుకుమార్ తీయబోయే మూవీ రాజమౌళి కెరీర్ తోపోలిస్తే, మరో త్రిబుల్ ఆర్ అనుకోవచ్చు.. అలా నే సుకుమార్ కూడా ప్లాన్ చేస్తున్నాడట. అదే జరిగితే, ఆతర్వాత సుకుమార్ తీయబోయే సినిమా పాన్ వరల్డ్ మూవీనే..

ఎందుకంటే రాజమౌలి త్రిబుల్ ఆర్ తర్వాత మహేశ్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ తీస్తున్నాడు. చాలా విషయాల్లో రాజమౌళి దారిలోనే సుకుమార్ నడిచాడు. కాబట్టే తన నెక్ట్స్ స్టెప్ చరణ్ తో అయితే, ఆతర్వాత తారక్ తో పాన్ వరల్డ్ మూవీనే అని అంచనా వేస్తున్నారు

దీనికి ప్రశాంత్ నీల్ జర్నీని కూడా పోల్చేస్తున్నారు. తను కూడా రాజమౌలి లానే కేజీయఫ్, కేజయఫ్ 2 తో రెండు పాన్ఇండియా హిట్లు సొంతం చేసుకున్నాక, సలార్ తో గ్లోబల్ గా ఎటాక్ చేశాడు.ఇప్పుడు ఎన్టీఆర్ తో తను తీస్తున్నడ్రాగన్ పాన్ ఆసియా లేదంటే పాన్ వరల్డ్ మూవీనే ప్లాన్ చేశాడు..

అంటే రెండు పాన్ ఇండియా హిట్లు, మూడో మూవీతో గ్లోబల్ హిట్ తర్వాత పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ఇదే రాజమౌళి, ప్రశాంత్ నీల్ ఫాలో అవుతున్నారు. కాబట్టే ఎన్టీఆర్ తో సుకుమార్ తీయబోయేది పాన్ వరల్డ్ ప్రాజెక్టే అన్న అంచనాలు పెరుగుతున్నాయి. సందీప్ రెడ్డి వంగ, సుకుమార్ ఇలా పాన్ ఇండియా డైరెక్టర్స్ అంతా కట్ట కట్టుకుని ఇలా తారక్ చుట్టు ప్రదక్షిణలు చేయటం మాత్ర షాకింగ్ గా ఉంది. అందరికి తన కాల్ షీట్లే కావాల్సి వస్తున్నట్టుంది.