రివ్యూను ఎవడు ఆపాలి.. ఎందుకు ఆపాలి.. నానికి ఉన్న మెచ్యూరిటీ మిగిలిన వాళ్లకు లేదా..?
మనం బతుకుతున్నది సోషల్ మీడియా యుగంలో. ఇప్పుడు ఇక్కడ ఏ చిన్న పని చేయాలన్నా కూడా రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. అంతెందుకు 5 రూపాయలు పెట్టి ఒక గుండు పిన్ను కొనాలన్నా కూడా దాని రివ్యూ చూస్తూ ఉంటారు..

మనం బతుకుతున్నది సోషల్ మీడియా యుగంలో. ఇప్పుడు ఇక్కడ ఏ చిన్న పని చేయాలన్నా కూడా రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. అంతెందుకు 5 రూపాయలు పెట్టి ఒక గుండు పిన్ను కొనాలన్నా కూడా దాని రివ్యూ చూస్తూ ఉంటారు.. అన్ని విషయాలు గమనించి రివ్యూ బాగుంటేనే కొంటారు. దానికి మంచి రేటింగ్ లేకపోతే అటు సైడ్ కూడా ఎవరు వెళ్లరు. మరి 5 రూపాయల వస్తువుకే అంత జాగ్రత్త ఉన్నప్పుడు.. వందల కోట్లు పెట్టి సినిమా చేస్తున్నప్పుడు అది బాగుందో లేదో తెలుసుకొని సినిమాకు వెళ్లడం ప్రేక్షకులు చేసే తప్పు ఎలా అవుతుంది..? ఈరోజుల్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ థియేటర్ కు వెళ్లి సినిమా చూడాలి అంటే కనీసం 2 వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. మరి అంత ఖర్చు పెట్టినప్పుడు రివ్యూలు చూసి సినిమా బాగుందని తెలిసిన తర్వాత థియేటర్కు వెళ్తే అందులో తప్పు ఎక్కడ కనిపిస్తుంది అని అడిగే వాళ్ళే చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. కానీ ఇండస్ట్రీలో మాత్రం కేవలం రివ్యూల కారణంగానే సినిమాలు ప్లాప్ అవుతున్నాయి అనడం మాత్రం అతి తెలివి అవుతుంది. ఎందుకంటే ఒక సినిమా రివ్యూ అనేది కేవలం అది రాసే వాడి కోణంలో ఉంటుంది. అది వాడికి నచ్చుతుందా లేదా అనేది వాడి ఇష్టం.
ఆ రివ్యూ బాగోలేదు అని చెప్పాడు కాబట్టి సినిమా చూడాలి అనుకున్న వాళ్ళందరూ ఆగిపోతారు అనుకోవడం అవివేకమే. ఇంత చిన్న లాజిక్ మన సినిమా వాళ్ళు ఎందుకు మిస్ అవుతున్నారో ఇప్పటికీ అర్థం కాని విషయం. ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే 100 మందిలో కేవలం 20 మంది మాత్రమే రివ్యూలు చూసి వెళ్తారు. సినిమాకు మిగిలిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఆ సినిమా ఎలా ఉందో చూడడానికి.. దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి థియేటర్ కు వెళ్తారు. కేవలం 20 మంది అభిప్రాయాలను మాత్రమే లెక్కలోకి తీసుకొని మొత్తం సినిమా రివ్యూస్ వల్ల పాడైపోతుందని చెప్పడం హాస్యాస్పదమే. ఒక సినిమా ఎలా ఉందో చెప్పే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఒకసారి సినిమా విడుదలైన తర్వాత అది పబ్లిక్ ప్రాపర్టీ.. దానిమీద మాట్లాడే రైట్ టికెట్ కొన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలా కాదు మా సినిమా గురించి నువ్వు రివ్యూ రాయొద్దు అని చెప్పే హక్కు ఎవరికీ ఉండదు. తాజాగా ఈ రివ్యూల మీద హీరో నాని స్పందించాడు.
ఈయన రియాక్షన్ చూసిన తర్వాత ఇండస్ట్రీలో రివ్యూ సిస్టమ్ మీద మాట్లాడే వాళ్లకు పెద్ద షాక్ తగిలినట్టే. రివ్యూ రాయకుండా ఎవరు ఎవరిని అడ్డుకోలేరు.. అసలు ఎలా ఆపుతారు ఎందుకు ఆపుతారు.. ఆ హక్కు ఎవరికీ ఉండదు.. కాకపోతే ఆ రివ్యూ అనేది నాకు నచ్చలేదు అని చెప్పండి అంతే తప్ప అది ఎవరికీ నచ్చదు అని మీరు డిసైడ్ చేయకండి అంటున్నాడు నాని. ఒక సినిమా హిట్ ఫ్లాప్ అనేది కనీసం మూడు నాలుగు రోజుల తర్వాత తెలుస్తుంది.. అంతేకానీ మార్నింగ్ షో చూసి వచ్చి ఇది డిజాస్టర్ అని మీరు డిసైడ్ చేయొద్దు అనేది నాని చేస్తున్న వాదన. ఈ ఒక్కటి మీరు దృష్టిలో పెట్టుకుని రివ్యూ రాయండి.. అలాగే పర్సనల్ అకౌంట్స్ లో రాసేలాగా ప్రొఫెషనల్ టీవీ చానల్స్ లో కూడా రాయొద్దు అనేది నాని చెప్తున్న మాట. ఒక స్టాండర్డ్స్ తో కూడిన రివ్యూ రాస్తే ఎవరూ కాదనరు అంటున్నాడు ఆయన. అంతేగాని రివ్యూ రాయకుండా అడ్డుకోవడం అనేది జరగని పని అని క్లారిటీగా చెప్పాడు నాచురల్ స్టార్.
గతంలో నితిన్ కూడా రివ్యూ సిస్టం మీద కుండబద్దలు కొట్టాడు. అసలు సినిమాలకు రివ్యూలు అనేవి లేకపోతే దర్శకులు ఎవరి మాట వినరు అని.. లాజిక్ లేని సన్నివేశాలు రాసుకొని ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీస్తారు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. రివ్యూ ఉంది కాబట్టే అందులో లాజిక్స్ వెతికి మరి రాస్తారు.. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమాలు చేస్తున్నారు మన దర్శకులు.. లేదంటే లాజిక్స్ గానికి వదిలేసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సినిమాలు తీస్తారు అంటూ ఆయన కామెంట్ చేశాడు.
ఆయన ఒక సినిమాకు మంచి రేటింగ్ ఇచ్చినప్పుడు.. దాన్ని పోస్టర్ల మీద వేసుకొని ప్రమోట్ చేసుకుంటున్నప్పుడు.. తక్కువ రేటింగ్ ఇచ్చినప్పుడు మాట్లాడే అధికారమే లేదు అంటున్నాడు ఆయన. నితిన్ చెప్పిన దానిలో కూడా లాజిక్ లేకపోలేదు. తమ సినిమాకు మంచి రేటింగ్ ఇస్తే రివ్యూవర్లు దేవుళ్ళుగా కనిపిస్తారు. అదే నెగిటివ్ రివ్యూస్ ఇస్తే మాత్రం వాళ్లే దెయ్యాలుగా మారిపోతారు. మొత్తానికి రివ్యూ సిస్టమ్ మీద ఇండస్ట్రీలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి అనేది అర్థమవుతుంది.