TOLLYWOOD: ఇండియా ఫస్ట్ పాన్ వరల్డ్ స్టార్ కూడా.. రెబల్ స్టారేనా..? 

పాన్ ఇండియా ట్రెండ్ కొత్త కాకున్నా, పాన్ ఇండియా హీరోయిజాన్ని కొత్తగా హైలెట్ చేసింది మాత్రం బాహుబలి మూవీనే. అలాంటిది ప్రభాసే మళ్లీ పాన్ వరల్డ్ హీరోగా తొలి హిట్‌తో ట్రెండ్ సెట్ చేస్తాడా..? కల్కి వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 25, 2024 | 08:40 PMLast Updated on: Apr 25, 2024 | 8:41 PM

Prabhas Ram Charan Mahesh Babu Jr Ntr Become Pan World Stars

TOLLYWOOD: పాన్ ఇండియా హీరో అంటే ఒకప్పుడు కామెడీ. కాని అది కామెడీ కాదు, టాలీవుడ్ హీరోకి ఆ స్థాయి ఉందని రాజమౌళి బాహుబలితో ప్రూవ్ చేస్తే, తన పెర్పామెన్స్‌తో ప్రభాస్ కూడా తనేంటో పాన్ ఇండియా మార్కెట్‌కి ప్రూవ్ చేశాడు. పాన్ ఇండియా ట్రెండ్ కొత్త కాకున్నా, పాన్ ఇండియా హీరోయిజాన్ని కొత్తగా హైలెట్ చేసింది మాత్రం బాహుబలి మూవీనే.

MEGASTAR CHIRANJEEVI: సెకండ్ ఇన్నింగ్స్‌.. ఇకపై కొత్త దారిలో చిరు..!

అలాంటిది ప్రభాసే మళ్లీ పాన్ వరల్డ్ హీరోగా తొలి హిట్‌తో ట్రెండ్ సెట్ చేస్తాడా..? కల్కి వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతోంది. ఇది ఏమాత్రం వరల్డ్ మార్కెట్‌లో దుమ్ముదులిపినా సీన్ మారిపోతుంది. ఆల్రెడీ బాహుబలితో జర్మనీ, రష్యా, జపాన్‌లో ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న ప్రభాస్ ఈసారి పాన్ వరల్డ్ కంటెంట్‌ హిట్ కొడితే, తనే ఇండియా తరపున తొలి పాన్ వరల్డ్ స్టార్ అనిపించుకునే ఛాన్స్ ఉంది. అమితాబ్, కమల్, రజినీ.. ఇలా గతంలో చాలామంది పాన్ వరల్డ్ మార్కెట్‌లో సందడి చేయబోయారు. కానీ, ఎవరూ సీరియస్‌గా పాన్ వరల్డ్ మార్కెట్‌లో స్థిరంగా ఉండలేకపోయారు. మరి ప్రభాస్ కల్కితో ఆ రికార్డ్ సొంతం చేసుకుంటాడో.. లేదో.. మేలో తేలనుంది. కేజియఫ్ ఫేం యష్‌కి కూడా టాక్సిక్‌తో ఆ ఛాన్స్ ఉంది. ఆస్కార్‌ని అందుకున్న త్రిబుల్ ఆర్‌తో చరణ్, ఎన్టీఆర్.. ఇద్దరికి గ్లోబల్ స్టార్స్‌గా పేరొచ్చింది. కాబట్టి నెక్ట్స్ చేసే మూవీలు పాన్ వరల్డ్ మార్కెట్‌ని టార్గెట్ చేయగలిగితే వీళ్లకు పాన్ వరల్డ్ స్టార్స్‌గా గుర్తింపు దక్కే ఛాన్స్ ఉంది.

ఇక ప్రభాస్‌ని పాన్ ఇండియా స్టార్‌గా మార్చింది.. చరణ్, తారక్‌ను గ్లోబల్ స్టార్స్‌గా ఫోకస్ చేసింది రాజమౌళి. కాబట్టి తన మేకింగ్‌లో మహేశ్ చేసే పాన్ వరల్డ్ సినిమాతో తనకి కూడా పాన్ వరల్డ్ హీరో అయ్యే ఛాన్స్ ఉంది. హిందీలో రామాయణంతో రణ్‌బీర్ కపూర్, శక్తిమాన్‌గా రణ్‌వీర్ సింగ్, క్రిష్ 4తో హృతిక్ రోషన్.. ఇలా అంతా పాన్ వరల్డ్ మార్కెట్‌ని టార్గెట్ చేశారు. అయితే ఈ ముగ్గురు మన ముగ్గురు తెలుగు స్టార్స్‌తో పోలిస్తే వెనకబడ్డారు. కాబట్టి ఇండియా తరపున ఈ తరంలో తొలి పాన్ వరల్డ్ స్టార్‌గా వెలగబోయేది ప్రభాస్, లేదా మహేశ్ అనే మాటే వినిపిస్తోంది.