మే డే.. మేడే.. మేడే చూడండి.. మోషన్ తో సెన్సేషన్..
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మరో సల్మాన్ ఖాన్ లా మారబోతున్నాడా? అంటే షర్ట్ లేకుండా ఎయిట్ ప్యాక్స్ తో తను కనిపించే పరిస్థితి రావటమే ఈ డౌట్ కి కారణం.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మరో సల్మాన్ ఖాన్ లా మారబోతున్నాడా? అంటే షర్ట్ లేకుండా ఎయిట్ ప్యాక్స్ తో తను కనిపించే పరిస్థితి రావటమే ఈ డౌట్ కి కారణం. అయితే ఆల్రెడీ అరవింద సమేత వీరరాఘవలో షర్ట్ లేకుండా, ఇంట్రడక్షన్ ఫైట్ సీన్ లో దుమ్ముదులిపాడు తారక్. కట్ చేస్తే మళ్లీ ఇప్పడు తన షర్ట్ లేని అవతారం పాన్ ఇండియా లెవల్లో సెన్సేషన్ అయ్యేలా ఉంది. అందుకు మేడేనే ముహుర్తం కుదిరింది. వచ్చేనెల ఫస్ట్ తేదీనా హిందీ మూవీ వార్ 2 టీం మోషన్ పోస్టర్ రిలీజ్ చేయబోతోంది. వచ్చే నెల ఎలాగూ ఎన్టీఆర్ బర్త్ డే ఉంది. సో అప్పడే మోషన్ పోస్టర్ రిలీజ్ చేయాలనుకున్నారు. కాని లెక్కుల మారాయి. మోషన్ పోస్టర్ ని మే 1 కి రిలీజ్ చేసి, 20న అంతకుమించి సర్ ప్రైజ్ ప్లాన్ చేసింది ఫిల్మ్ టీం. అదేంటి? హావేలుక్
మేడే రోజు బ్రహ్మాండం బద్దలయ్యేమోషన్ పోస్టర్ ని రిలీజ్ చేయబోతోంది వార్ 2 మూవీ టీం. కేవలం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇందులో ఎలా ఉంటాడో తేల్చే పోస్టర్ ని రిలీజ్ చేయబోతున్నారు. నిజానికి మే సెకండ్ వీక్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేయాలనుకున్నాు. కాని మే 20న ఎన్టీఆర్ బర్త్ డే ఉంది.సో ఆరోజు మరో సర్ ప్రైజ్ ని ప్లాన్ చేసిన ఫిల్మ్ టీం, ఈ రెండు సర్ ప్రైజులకి మూడు వారాల గ్యాప్ ఉండాలని డిసైడ్ అయ్యింది.
అందుకే మే డే కి వార్ 2 మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేస్తున్నారట.త్రీడీలో ప్లాన్ చేసిన ఈ మోషన్ పోస్టర్ కోసమే కోటి ముప్పై లక్షలు ఖర్చయ్యిందని తెలుస్తోంది. ఆల్రెడీ మోషన్ పోస్టర్ రెడీ అవటం,దాని మీద డేట్ కూడా ఉండటం వల్లే, మ్యాటర్ బయటికి లీకైనట్టు తెలుస్తోంది.ఏయిట్ ప్యాక్స్ తో షర్ట్ లేకుండా ఉండే ఎన్టీఆర్ లుక్ తో మోషన్ పోస్టర్ ని ముందుగా రిలీజ్ చేస్తున్నారు. నిజానికి వార్ 2 మూవీ లో హీరో హ్రితిక్ కాబట్టి, తన బదులు, ఎన్టీఆర్ లుక్ నే ఫిల్మ్ టీం ముందుగా రిలీజ్ చేయబోతుండటం సర్ ప్రైజింగే..
అంతేకాదు ఇందులో నెగెటీవ్ రోల్ వేసిన ఎన్టీఆర్, పాత్రకి వెయిట్ ఎక్కువే కాబట్టి, ముందుగా తన పాత్రని రివీల్ చేసి,సౌత్ మార్కెట్ లో బజ్ క్రియేట్ చేస్తున్నారట. ఇక ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా మే 20 కి ఒక రోజు ముందు తన ప్రోమోని వదలబోతున్నట్టు కూడా తెలుస్తోంది.
రెండీంట్లో పూర్తిగా ఎన్టీఆర్ కంటెంటే ఉండబోతోంది. జూన్ లోనే హ్రితిక్ రోషన్ పాత్ర తాలూకు మోషన్ పోస్టర్ వస్తుంది. ఎలాగూ వార్ లో తన లుక్ జనాలకు తెలుసు కాబట్టి, వార్ 2 లో తన లుక్ కి కొత్తగా రివీల్ చేయటానికి ఏమి ఉండదు……కాబట్టే,వార్ 2 లో ఏదైనా ఎగ్జైటింగ్ మ్యాటర్ ఉందంటే, అది ఎన్టీఆరే కాబట్టి, తన మోషన్ పోస్టర్ ని, తన ప్రోమోని మే 1 కి, మే 19 కి రిలీజ్ చేయటం ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయ్యింది.ఈనెలాఖర్లోనే స్పెషల్ ఎనౌన్స్ మెంట్ కూడా రావొచ్చని తెలుస్తోంది.