MAHESH BABU: మీరే నాకు అమ్మా.. నాన్న.. ఫ్యాన్స్‌తో మహేశ్ ఎమోషనల్
తనకు ఇకపై ఫ్యాన్సే అమ్మా, నాన్న అని భావోద్వేగానికి గురయ్యారు. ప్రతి చిత్రం విడుదల సందర్భంగా తన తండ్రి కృష‌్ణ ఫోన్ చేసి అభినందించే వారని, కానీ, ఈసారి మాత్రం ఆయన లేరని మహేశ్ అన్నారు.

Does Guntur Karam superstar hero Mahesh Babu have this problem..?
MAHESH BABU: మహేశ్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న రిలీజ్ కానుంది. ఈ చిత్ర ప్రి రిలీజ్ ఫంక్షన్ మంగళవారం సాయంత్రం గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా వేదికపై మహేశ్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తనకు ఇకపై ఫ్యాన్సే అమ్మా, నాన్న అని భావోద్వేగానికి గురయ్యారు. ప్రతి చిత్రం విడుదల సందర్భంగా తన తండ్రి కృష‌్ణ ఫోన్ చేసి అభినందించే వారని, కానీ, ఈసారి మాత్రం ఆయన లేరని మహేశ్ అన్నారు.
Kalki 2898 AD: చిరు డేట్‌ను పట్టారు.. ఆ సెంటిమెంట్ డేట్‌కే ప్రభాస్ ‘కల్కి’
ఇకపై ఫ్యాన్సే తనకు అమ్మా నాన్న అని, ఎప్పట్లాగే అండగా ఉండాలని కోరారు. తనకు త్రివిక్రమ్ ఎంతో మంచి ఆప్తుడని, ఆ విషయం బయట ఎప్పుడూ చెప్పలేదని మహేశ్ అన్నారు. కానీ, ఈ రోజు త్రివిక్రమ్ గురించి చెప్తున్నానని అంటూ.. ఆయనకు ఐలవ్ యూ చెప్పారు. సంక్రాంతి తనకు బాగా కలిసొచ్చిందని, ఈసారి కూడా సంక్రాంతికి హిట్ గ్యారెంటీ అన్నారు. తమన్ తనకు తమ్ముడు లాంటివాడని చెప్పారు. హీరోయిన్ శ్రీలీలకు ఎంతో భవిష్యత్ ఉందని, ఆమె డాన్స్ ఇరగదీస్తుందని మహేశ్ ప్రశంసించారు. తనతో డాన్స్ చేయడం ఏ హీరోకైనా సవాలే అన్నారు. తాము అడగ్గానే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన మీనాక్షి చౌదరికి మహేశ్ థాంక్స్ చెప్పారు.
ఈ ఈవెంట్‌లో హీరోయిన్స్ శ్రీలీల, మీనాక్షి చౌదరి, దర్శకుడు త్రివిక్రమ్, సంగీత దర్శకుడు థమన్, దిల్ రాజు, నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ.. మహేశ్ సినిమా కోసం రెండొందల శాతం కష్టపడతాడని ప్రశంసించారు. హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. ఈ సినిమా గురించి తనకు ఫోన్ రాగానే ఎంతో ఆనందించానని, మంచి పాత్ర చేశానన్నారు.