బ్రేకింగ్‌ : పల్టీలు కొట్టిన హీరో అజిత్‌ కారు

తమిళ్‌ హీరో అజిత్ మరోసారి ప్రమాదానికి గురయ్యాడు. రేసింగ్ లో అజిత్ కారు ట్రాక్ నుంచి పక్కకు వెళ్లడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అజిత్ సురక్షితంగా బయట పడ్డారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 19, 2025 | 02:57 PMLast Updated on: Apr 19, 2025 | 2:57 PM

Hero Ajiths Car Flipped Over In Beljiam

తమిళ్‌ హీరో అజిత్ మరోసారి ప్రమాదానికి గురయ్యాడు. రేసింగ్ లో అజిత్ కారు ట్రాక్ నుంచి పక్కకు వెళ్లడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అజిత్ సురక్షితంగా బయట పడ్డారు. బెల్జియంలో జరిగిన రేస్‌లో అజిత్‌కు ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అజిత్ ప్రయాణిస్తున్న కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. కానీ అజిత్‌ మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. 2025 ఫిబ్రవరి 23న స్పెయిన్‌లో జరిగిన ఓ రేసింగ్ ఈవెంట్‌లో కూడా అజిత్ కారు తీవ్ర ప్రమాదానికి గురైంది.

మరో కారును తప్పించే క్రమంలో ఆయన కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. అజిత్ ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఇదే సంవత్సరం జనవరిలో దుబాయ్ గ్రాండ్ ప్రీ రేస్ కోసం సాధన చేస్తుండగా కూడా అజిత్ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారు ట్రాక్ సమీపంలోని గోడను ఢీకొని ముందు భాగం దెబ్బతింది. ఈ ప్రమాదంలో అజిత్ గాయాలు లేకుండా బయటపడ్డారు. ఈ ప్రమాదం తర్వాత కూడా ఆయన టీమ్ రేస్‌లో విజయం సాధించింది. ఇలా అజిత్‌ వరుస ప్రమాదాలకు గురవ్వడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.