600 కోట్ల బడ్జెట్ 1100 రాబడి… ఇదెక్కడి రెబల్ మాయ…
రెబల్ స్టార్ ప్రభాస్ ఇటలీలో రిలాక్స్ అవుతున్నాడు. తను అక్కడ రిలాక్స్ అయినా, ఇక్కడ రికార్డులు మాత్రం ఆగట్లేదు. ది రాజా సాబ్ పెండింగ్ షూటింగ్ పెండింగ్ లోనే ఉండిపోతోంది.

రెబల్ స్టార్ ప్రభాస్ ఇటలీలో రిలాక్స్ అవుతున్నాడు. తను అక్కడ రిలాక్స్ అయినా, ఇక్కడ రికార్డులు మాత్రం ఆగట్లేదు. ది రాజా సాబ్ పెండింగ్ షూటింగ్ పెండింగ్ లోనే ఉండిపోతోంది. ఫౌజీ కొంత షూటింగ్ జరిగినా, కొత్త షెడ్యూల్ కి కనీసం రెండు నెల్ల బ్రేక్ పడింది. జూన్ లో మొదలవ్వాల్సిన సందీప్ రెడ్డి మూవీ స్పిరిట్ షూటింగ్, జులై లేదంటే ఆగస్ట్ కి వాయిదా పడేలా కనిపిస్తోంది. ఇలాంటి టైంలో ఇటలీలో రెబల్ స్టార్ చిల్ అవుతున్నాడు. అంతా సమ్మర్ వెకేషన్ కి ఫారిన్ ట్రిప్ కి వెళుతుంటే, సమ్మర్ అయిపోయే వరకు ఇండియాలో ల్యాండ్ కాడని తేల్చాడు రెబల్ స్టార్. ఇది ఫ్యాన్స్ కి కొంత డిసప్పాయింట్ చేసే అంశమే.. కాని ఇక్కడే పాన్ ఇండియా కింగ్ అనిపించుకుంటున్నాడు ప్రభాస్. తను ఇటలీలో ఉన్నా, తన సినిమాల షూటింగ్ కి చిన్న బ్రేక్ పడినా, తన సినిమాలు మాత్రం రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. 600 కోట్ల పెట్టుబడినే అప్పుడే 1100 కోట్ల రాబడిగా మార్చేస్తోంది తన కొత్త మూవీ. 30 శాతం షూటింగ్ పూర్తి కాకుండానే ఈ రికార్డులు గోలేంటి? టేకేలుక్
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రజెంట్ ఏప్రిల్, మే నెలంతా ఇటలీలోనే గడపబోతున్నాడు. ప్రజెంట్ వేసవి వెకేషన్ అక్కడే పూర్తి చేయబోతున్నాడు. తర్వాత మే ఎండ్ నుంచి ది రాజా సాబ్ పెండింగ్ సాంగ్స్ షూట్ కి రెడీ అవుతాడట. జూన్ లో ఫౌజీ కొత్త షెడ్యూల్ షూటింగ్ కి డేట్లిచ్చాడు. స్పిరిట్ జులైలో లాంచ్ చేసి, ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరిగేలా ఎక్కడికక్కడ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకునే, వెకేషన్ కి ఇటలీకెళ్లాడు.ఇలా తను వెకేషన్ కి ఇటలీ వెలితే, ఇక్కడ తన సినిమాల బిజినెస్ మతిపోగొట్టేలా ఉన్నాయి. సమ్మర్ కి రావాల్సిన రాజసాబ్, ఆగస్ట్ కే వచ్చేలా కనిపిస్తున్నాడు. అందుకే ఆ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ డీల్స్ మొదలయ్యాయట. కాకపోతే 95 శాతం షూటింగ్ పూర్తి చేసిన ది రాజా సాబ్ కంటే, 25 శాతం కూడా షూటింగ్ పూర్తి కాని ఫౌజీ ప్రీరిలీజ్ బిజినెస్ మతిపోగొట్టేలా ఉంది.
ఇమాన్వీ తో కలిసి ప్రభాస్ చేస్తున్న పీరియాడికల్ వార్ రొమాంటిక్ డ్రామాలో దిశా పటాని కూడా స్పెషల్ రోల్ వేస్తోంది. ఐతే ఈ సినిమా ఓటీటీ రైట్స్ 220 కోట్లు పలకటం అందరికి షాక్ ఇస్తోంది. ఇది సలార్ లాంటి మాస్ మూవీకాదు. కల్కీ లాంటి మైథాలజీ టచ్ తో కూడా రావట్లేదు. పూర్తిగా రొమాంటిక్ పీరియాడికల్ వార్ డ్రామా అంటే కాస్త క్లాస్ టచ్ ఉండే అవకాశమే ఎక్కువుంది.
అలాటి ఈ మూవీకి ఓటీటీ రూపంలో 220 కోట్లు దక్కితే, ఓవర్ సీస్ 190 నుంచి 200 కోట్లు పలుకుతున్నాయట. నార్త్ థియేట్రికల్ రైట్స్550 కోట్లని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలనుంచి 200 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగేలా ఉంది. అంటే తెలుగు రాష్ట్రాలు, నార్ ఇండియా, ఓవర్ సీస్ తో పాటు ఓటీటీ రైట్స్ కలిపితేనే 1100 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ మతిపోగొడుతోంది. ఇక తమిల్, మలయాళ, కన్నడ, రైట్స్ కూడా కలిపితే, శాటిలైట్ రైట్స్ కూడా యాడ్ అయితే, ఆ లెక్క మరో రెండు వందలకోట్లు ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది.మొత్తంగా ఓ సినిమా 25 శాతం కూడా పూర్తికాకముందే, ఇలా 1300 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ తో మతిపోగొడుతోంది. ఇదే ఇలా ఉంటే సందీప్ రెడ్డి వంగలాంటి దర్శకుడితో ప్రభాస్ మూవీ అంటే, రిలీజ్ కి ముందే దంగల్ రికార్డులు బద్దలయ్యే ఛాన్స్ ఉంది.