Nayanthara : నయనతార యష్ కి సిస్టరా, లవరా

కేజీఎఫ్ సిరిస్ తో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ ని సంపాదించిన హీరో యష్. ఆయన తాజాగా టాక్సిక్ అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో నయన తార నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 7, 2024 | 12:35 PMLast Updated on: May 07, 2024 | 12:35 PM

Nayantara Is Yashs Sister And Lover

 

 

హీరోలకే కాదు హీరోయిన్ల కి కూడా లాంగ్ రన్ ఉంటుందని నిరూపించిన నటీమణుల్లో నయనతార కూడా ఒకటి. పైగా పాన్ ఇండియా నటి కూడా. ఏ మూవీ చేసినా అందులో తన ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. లేడీ సూపర్ స్టార్ అనే బిరుదుని కూడా పొందింది. తాజాగా ఈమె ఖాతాలోకి ఒక భారీ మూవీ వచ్చి చేరింది

కేజీఎఫ్ సిరిస్ తో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ ని సంపాదించిన హీరో యష్. ఆయన తాజాగా టాక్సిక్ అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో నయన తార నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి. నిజానికి మొదట బాలీవుడ్ అగ్ర హీరోయిన్ కరీనా కపూర్ ని అనుకున్నారు.దీనికి సంబంధించి అధికారకంగా ప్రకటన కూడా వచ్చింది.ఇప్పుడు కరీనా ని తప్పించి నయన్ ని తీసుకున్నారని అంటున్నారు. ఈ మేరకు చిత్ర బృందం నయన్ కి కలిసి కథ కూడా చెప్పారని తను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం వినపడుతుంది

కాకపోతే యష్ కి జోడిగా నటిస్తుందా లేక సోదరిగా నటిస్తుందా అనే విషయంలో క్లారిటీ లేదు. ఎందుకంటే ఈ మూవీ లో ఆ రెండు క్యారెక్టర్స్ కి చాలా ప్రాముఖ్యత ఉంది. యాక్షన్ థ్రిల్లర్ గా టాక్సిక్ తెరకెక్కుతుండగా కేవిఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుంది. మలయాళ సినీ రంగానికి చెందిన గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుంది. యష్ ఒక డిఫరెంట్ క్యారక్టర్ లో కనిపించబోతున్నాడు. అభిమానుల్లో అయితే టాక్సిక్ పై భారీ అంచనాలు ఉన్నాయి