Gutka Ban : తెలంగాణలో గుట్కా బ్యాన్.. మత్తు పదార్థాలపై ఉక్కుపాతం..

తెలంగాణలో నూతన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సర్కర్ మత్తు పదార్థాల వినియోగంపై ఉక్కుపాదం మోపుతుంది. తెలంగాణ నూతన ప్రభుత్వం ఏర్పాటు అయ్యాకా.. తొలి అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణలో మాదక ద్రవ్యల పై విడటం పై నిషేదం విధించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 26, 2024 | 05:40 PMLast Updated on: May 26, 2024 | 5:40 PM

Gutka Ban In Telangana Iron Foot On Drugs

 

 

తెలంగాణలో నూతన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సర్కర్ మత్తు పదార్థాల వినియోగంపై ఉక్కుపాదం మోపుతుంది. తెలంగాణ నూతన ప్రభుత్వం ఏర్పాటు అయ్యాకా.. తొలి అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణలో మాదక ద్రవ్యల పై విడటం పై నిషేదం విధించింది. ఇక అదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గుట్కా తయారీ, గుట్కా అమ్మకాలను బ్యాన్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ సర్కార్ వెల్లడించింది.

కాగా ఇది 24 మే 2024 నుంచి అమలులోకి వచ్చిందని పేర్కొంది. యువతపై ప్రభావం చూపుతున్న డ్రగ్స్, గంజాయిపై ఇప్పటికే ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం ప్రకారం ప్రజారోగ్యం దృష్ట్యా గుట్కా తయారీ అమ్మకాలను నిషేధిస్తున్నట్లు వెల్లడించారు. పొగాకు, నికోటిన్‌, పౌచ్‌లు, ప్యాకేజీ కంటెయినర్లు మొదలైన వాటిలో ప్యాక్ చేసిన గుట్కా.. పాన్‌ మసాలా తయారీ, నిల్వ, పంపిణీ, రవాణా, విక్రయాలను నిషేధించిబడినట్లు పేర్కొన్నారు.