షిండే సెంట్రల్ మినిస్టర్, ఫడ్నవీస్ సీఎం

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై ఉత్కంఠ వీడలేదు. ఎన్నికల ఫలితాలు వెల్లడై వారం రోజులు గడుస్తున్నా... మూడు పార్టీల్లో ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరు అనేది క్లారిటీ రాలేదు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 28, 2024 | 11:57 AMLast Updated on: Nov 28, 2024 | 11:57 AM

Shinde Is A Central Minister Fadnavis Is The Cm

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై ఉత్కంఠ వీడలేదు. ఎన్నికల ఫలితాలు వెల్లడై వారం రోజులు గడుస్తున్నా… మూడు పార్టీల్లో ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరు అనేది క్లారిటీ రాలేదు. నేడు ఢిల్లీకి దేవేంద్ర ఫడ్నవిస్, ఏకనాథ్ షిండే, అజిత్ పవర్ వెళ్లి… బిజెపి అగ్ర నేతలతో సమావేశం కానున్నారు. బిజెపి అధిష్టానం చేతిలో సీఎం కూర్చి పంచాయతీ ఉండటంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపుగా నేడే ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రి పీఠంపై నిన్న కీలక వ్యాఖ్యలు చేసిన ఏక్నాథ్ షిండే… నేను ముఖ్యమంత్రి అవుతానని ఎప్పుడు అనుకోలేదన్నారు. మోడీ నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. సీఎం పదవి బిజెపి తీసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసారు. సీఎం పదవి పై బిజెపి హై కమాండ్ దే తుది నిర్ణయం అన్న ఏక్ నాథ్ షిండే… మోడీ నిర్ణయానికి మేము మద్దతు ఇస్తామని స్పష్టం చేసారు.

షిండేను కేంద్రంలోకి తీసుకువచ్చే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. షిండే కుమారుడికి డిప్యూటీ సిఎం పదవి ఇస్తారంటు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం లోక్సభ ఎంపీ గా షిండే కుమారుడు ఉన్నాడు. అందరి ఊహలకు, ఊహాగానాలకు,అనుమానాలకు తెరదించే అవకాశం కనపడుతోంది.