Telangana Elections : తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారు.. ఒక రోజు 5 నియోజకవర్గాల్లో రాహుల్ పర్యటన
తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారు. రేపు తెలంగాణకు ఏఐసీసీ (AICC President) అగ్రనేత రాహుల్ గాంధీ.. ఈ నెల 17వ తేదీన ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రానికి రాహుల్ గాంధీ (Rahul Gandhi) రానున్నారు.

Rahul Gandhi's visit to Telangana is finalized Rahul will visit 5 constituencies in one day
తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారు. రేపు తెలంగాణకు ఏఐసీసీ (AICC President) అగ్రనేత రాహుల్ గాంధీ.. ఈ నెల 17వ తేదీన ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రానికి రాహుల్ గాంధీ (Rahul Gandhi) రానున్నారు. ఈ పర్యటనలో రాహుల్ గాంధీ ఒకే రోజు 5 నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ
పర్యటించనున్నారు.
రాహుల్ గాంధీ తెలంగాణ షెడ్యూల్..
Telangana, IT Rides : తెలంగాణలో మరోసారి ఐటీ రైడ్స్.. భాస్కర్ రావు అనుచరుల ఇంట్లో ఐటీ తనిఖీలు
17వ తేదీన ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రాహుల్ గాంధీ చుట్టేయనున్నారు. శంషాబాద్ నుంచి ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ లో పినపాకకు చేరుకొనున్నారు రాహుల్ గాంధీ. 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు పినపాకలో రోడ్ షో నిర్వహించనున్నారు రాహుల్ గాంధీ. 17వ తేదీన మధ్యాహ్నం 2 – 3 గంటల వరకు నర్సంపేటలో పర్యటించనున్నారు రాహుల్ గాంధీ. నర్సంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా వరంగల్ ఈస్ట్‌కు చేరుకుంటారు. వరంగల్ ఈస్ట్‌లో సాయంత్రం నాలుగు గంటలకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. సాయంత్రం 6:30 గంటలకు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ నియోజకవర్గాంలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. రాజేంద్రనగర్ ప్రచారం తర్వాత రాహుల్ గాంధీ తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.