Kavitha’s sensational comments : సోనియా రాహుల్ గాంధీపై కవిత సంచలన వ్యాఖ్యలు.. అమరవీరుల స్థూపం ముందు మోకరిల్లినా.. మీ పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదు!’
సోనియా, రాహుల్ గాంధీలు అమరవీరుల స్థూపం ముందు మోకరిల్లినా మీ పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదు!’

Kavitha's sensational comments on Sonia Rahul Gandhi.. Even if you kneel before the stupa of Sonia Rahul's martyrs, your sins will not be atone!'
కాంగ్రెస్ పార్టీ (Congress Party) పై బీఆర్ఎస్ (BRS) నిజామాబాద్ మాజీ ఎంపీ, ప్రస్తుతం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) ట్వీటర్ వేదికగా.. సంచలన వ్యాఖ్యాలు చేశారు. సోనియా రాహుల్ గాంధీలకు తెలంగాణలో ఉన్న అమరవీరుల స్థూపానికి దారి తెలియకపోవడం అత్యంత బాధాకరం అని అన్నారు. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణను మోసం చేసిన గాంధీ కనీసం స్వయంగా తెలంగాణకు క్షమాపణలు కూడా చెప్పలేరా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్రలు చేసిన తెలంగాణలో పై యాత్ర సాగిన ఒక్కసారి కూడా జై తెలంగాణ అని చెప్పకపోవడం చాలా బాధాకరం అని అన్నారు ఎమ్మెల్సీ కవిత. పదేండ్ల లో ఒక్కసారి కూడా మీ కుటుంబానికి వందలాది తల్లుల కడుపు కోత గుర్తు రాకపోవడం అత్యంత బాధాకరం అని అన్నారు. సోనియా గాంధీ (Sonia) , రాహుల్ గాంధీ (Rahul) లు కలిసి అమరవీరుల స్థూపం ముందు మోకరిల్లినా వారి చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదని అన్నారు ఎమ్మెల్సీ కవిత.
‘గ్యారంటీలకు గాంధీలు, క్షమాపణలకు బంట్రోతులా???! ఆరు దశాబ్దాల పాటు తెలంగాణను మోసం చేసిన గాంధీలు కనీసం స్వయంగా క్షమాపణ చెప్పలేరా? పదేండ్లలో ఒక్కసారి కూడా మీ కుటుంబానికి వందలాది తల్లుల కడుపు కోత గుర్తు రాకపోవడం బాధాకరం!. ఈ గడ్డమీద జోడోయాత్రలు చేసి ఒక్కసారి కూడా జై తెలంగాణ చెప్పకపోవడం దారుణం. ఈ రోజుకీ మీకు అమరవీరుల స్థూపానికి దారి తెలియకపోవడం అత్యంత బాధాకరం. సోనియా, రాహుల్ గాంధీలు అమరవీరుల స్థూపం ముందు మోకరిల్లినా మీ పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదు!’ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.